Friday, May 23, 2008

అనుమానాస్పదం~~2007



సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::విజయ్ ఏసుదాస్,శ్రేయఘోషల్

నిను వెతికి వెతికి చూసి...అలిసింది పడుచు వయసూ
నిను తలచి తలచి మనసు...నలిగింది నీకు తెలుసూ
మరుపేల వలపు వేళా...మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా...వెన్నెల్లు కరుగు వేళా
కనరాని చారుశీలా...ఓ బాలా...ఓ బాలా...ఓ బాలా...ఓ బాలా

నిను వెతికి వెతికి చూసి....అలిసింది పడుచు వయసూ

మన అసలు పేరు నీడా...అడుగడుగు తోడుగా
కధ నడుపు తమరి జాడా...కనపడదు వేడుకా
కరిమబ్బు చాటు తారా...కనిపించెనా సితారా
చిరు చీకటింటి నీడా...వెలిగింది కంటినిండా

విరహాల ఆలయానా...విరజాజి హారతేలా
ముగిసింది చేదు కాలాం ...బిగిసింది ప్రేమగాలం
చెలి కనుల ఎరుపులే వలపు గెలుపులే ...తెలుపనా

నిను వెతికి వెతికి చూసి...అలిసింది పడుచు వయసూ...

ఉసిగొలుపు ఉడుకుతనమా...చలి పొగరు చాలులే
కుదురైన కలికి తనమా...కసి కధలు చెప్పకే
ఎదకెదుగు చిలిపితనమా...సొదపెట్టి చంపుతావా
పొదలడుగు వలపుతనమా...పెదవుల్లొ దాచుతావా

నిదురమ్మ పలకరింతా...నివురాయె వలచినంతా
హౄదయాల సీమలోనా...ఎదగాన కోకిలేనా
మన ఏడుజన్మలే ఏడురంగులై...కలిసెనే

నిను వెతికి వెతికి చూసి...అలిసింది పడుచు వయసూ
నిను తలచి తలచి మనసు...నలిగింది నీకు తెలుసూ
మరుపేల వలపు వేళా...మెరుపైన మేఘమాలా
పన్నీటి కలువపూలా...వెన్నెల్లు కరుగు వేళా
కనరాని చారుశీలా...ఓ బాలా...ఓ బాలా...ఓ బాలా...ఓ బాలా ...

నిను వెతికి వెతికి చూసి....అలిసింది పడుచు వయసూ ...

No comments: