Showing posts with label సలీం (2009). Show all posts
Showing posts with label సలీం (2009). Show all posts

Sunday, November 22, 2009

సలీం (2009)



సంగీతం::సందీప్ చౌతా
రచన::చంద్రబోస్
గానం::ప్రదీప్ సోమసుందరన్,సోనూ కక్కర్

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ..హా ఆ X 2

జల జల వరదలు నది మది పిలుపని తెలిసిందా
తెల తెల నురగలు కడలిలొ చెలిమని తెలిసిందా
నిన్నలే వీడనీ..ఎండలే నీడనీ

నక్షత్రాలే నవ్వుతాయని
పాలపుంతలే పాడుతాయని
పుడమే నాట్యం ఆడుతుందని
అడవికి ఆమని చేరుతుందని
మయూరాలు పురి విప్పుతాయని
చకోరాలు తలలెత్తుతాయని
పావురాలు పైకెగురుతాయని
చిలక పళ్ళనే కొరుకుతందని
చేప నీటిలో తుళ్ళుతుందని
మబ్బు చినుకులే చల్లుతుందని
తేనెటీగలో ముళ్ళు ఉందని
తీగ పందిరిని అల్లుకుందని
జగతే కొత్తగ జన్మనెత్తునని
ప్రకృతి మొత్తం పరవశించునని
నేడే తెలిసిందీ

"అయ్యబాబోయ్ చంటీ..ఇంత కవిత్వం ఎలా చెప్పావ్ "

"నా చిట్టి "

ప్రేమ నాలో పుడుతుందని
ప్రేమలోనే పడతానని
ప్రేమతో మతి చెడుతుందని
నేడే తెలిసిందీ రు రు రు రూ

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందీ..

ఎదిగిన వయసుకు వరసే కలదని తెలిసిందా
వలచిన మనసుకు వయసే వరదని తెలిసిందా
అలజడే..ఉందనీ
అలసటే..లేదనీ

అల్లరి నాలో పెరుగుతుందని
అద్దం ఎపుడూ వదల్లేనని
ఆకలి నన్నే అంటుకోదని
ఆశలకేమో అంతులేదని
వేషం భాషా మారుతుందని
వేగం నన్నే తరుముతుందని
వేళా పాళా గురుతు రాదని
వేరే పనిలో ధ్యాస లేదని
ఒకటే దీపం వెలుగుతుందని
ఒకటే దైవం వెలసి ఉందని
ఒకటే మంత్రం మ్రోగుతుందని
ఒకటే మైకం కలుగుతుందని
ఒకటీ ఒకటీ ఒక్కటేనని
మోక్షం అంటే ఇక్కడేనని
నేడే తెలిసిందీ

" అసలేమైంది చంటీ నీకూ "

ప్రేమ తరగతి చేరానని
ప్రేమశాస్త్రం చదివానని
ప్రేమ పట్టా పొందానని

నేడే తెలిసిందీ రు రు రు రూ..

పూలు గుస గుసలాడేనని జత గూడేనని
గాలి ఈలలు వేసేనని సైగ చేసేనని
అది ఈ రోజె తెలిసిందా..

సలీం (2009)



సంగీతం::సందీప్ చౌతా
రచన::చంద్రబోస్
గానం::నిఖిత నిగం

ఈ వేళలో...హాయిలో...మాయలో
మాట రానీ...మత్తులో

ఈ వేళలో...హాయిలో...మాయలో
మాట రానీ...మత్తులో

I wanna talk to you
I wanna talk to you-X(2)

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you
I wanna talk to you

పెదాలలో ప్రకంపనే...తొలి సాక్ష్యం
పాదాలలో ప్రవాహమే...మలి సాక్ష్యం
చెక్కిళ్ళలో సింధూరమే...చిరు సాక్ష్యం
నా కళ్ళలో సముద్రమే...ప్రతి సాక్ష్యం

అణువణువు నేడు అనేక గొంతులై
కణుకణుము కూడ...స్వరాల తంత్రులై
ఒకే మాటనే సదా స్మరించుతున్నా
అదే మాటనే చెప్పేస్తూ ఉన్నా

I love you....
I love you....

ఏం చెయ్యనూ..ఏమనీ చెప్పనూ
What do I do with out You...

I wanna talk to you
I wanna talk to you

వెన్నెల్లలో తెప్పించనా..ఆహ్వానం
కన్నీళ్ళతో చేయించనా..అభిషేకం
కౌగిళ్ళలో దాచెయ్యనా..నీ స్నేహం
ప్రాణాలలో నింపెయ్యనా..నీ రూపం

నీ శ్వాసలోన సుమాల గాలినై
నీ కాలిలోన సుగంధ ధూళినై
ఎన్నో మాటలూ వినుపించు వీలు లేకా
ఒకే మాటతో వివరించేస్తున్నా

I love you...
I love you...

ఏం చెయ్యనూ..ఏమనీ చెప్పనూ
What do I do with out You...

I wanna talk to you
I wanna talk to you

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాచి ఉన్నాను నా ఊహల్లో

హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్
నేనిన్నాళ్ళూ నన్నే దాటి ఉంటాను నీ గుండెలో

I wanna talk to you
I wanna talk to you