Sunday, February 25, 2018

ద్వారక--2016



సంగీతం::సాయి కార్తీక్
రచన::రహమాన్
గానం::చిత్ర
దర్శకుడు::శ్రీనివాస రవీంద్ర
తారాగణం::విజయ్ దేవరకొండ, పూజ జవేరి

పల్లవి::

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

మురళీ గాన లోల దూరమేల
దిగి రా కృష్ణా
కడలై పొంగుతున్న ప్రేమ
నీల కన రా కృష్ణా
అందుకో సంబరాల స్వాగతాల మాలిక
ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

చరణం::1

మా ఎద మాటున దాగిన ఆశలు
వెన్నెల విందనుకో
మా కన్నుల కందని మాయలు
చూపుతూ మెల్లగా దోచుకుపో
గిరినే వేలిపైన నిలిపిన మా కన్నయ్య
తులసి దళానికే ఏల తూగినవయ్యా
కొండంత భారం గోరంత చూపినా లీలా కృష్ణయ్యా
మా చీరాలు దోచిన అల్లరి ఆటలు మాపైన ఈ మాయ

భజరే భజరే భజరే..భజ..భజ
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే

చరణం::2

మాయది కావని మాధవుడా అను చేరిన ప్రణమిది
మా మాయని బాధని పిల్లన గ్రోవిలా రాగం చేయమని
ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట
చివరికి ప్రతి ఒకరిని నడిపెదవు కదా నీ బాట

తీరని వేదన తియ్యని లాలన అన్నీ నువ్వయ్యా
నీ అందెల మువ్వల సవ్వడి గుండెలో మోగించ రావయ్యా

భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే
భజరే నంద గోపాల హరే