Showing posts with label పెళ్ళైన కొత్తలో~~2006. Show all posts
Showing posts with label పెళ్ళైన కొత్తలో~~2006. Show all posts

Tuesday, February 3, 2009

పెళ్ళైన కొత్తలో~~2006



సంగీతం::Agashtya
రచన::వెన్నెలకంటి
గానం::శ్రేయ ఘోషల్

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లే
కురిసింది గుండెల్లో వెన్నెల్లమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడింది
కూనలమ్మా....
ఎద లోతుల్లో
అలజడి రీగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచేను ప్రేమ నాలో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే..


కలలో ఒక రూపమే
కనులకు తెర తీసే
వెలిగించని దీపమే
తొలి జిలుగులు కురిసే
ఐనా మరి ఎందుకో
తడబడినది మనసూ
ఇది ఎమో ఎమిటో
అది ఎవరికి తెలుసూ
ఒక వింతగా...
పులకింతగా...
తొలి తలపే
మది చాటుగా
సడి చెసినది ఎందుకూ


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే


ఎదలో రసవీణలే
సరిగమలే పలికే
ఎదురయి విరివానల్లే
మధురిమలె చిలికే
మాట నే మౌనమే
కల కలములు రేపే
వెంటాడే స్నేహమే
కలవరములు చూపే
ఇది ఏమిటో
కథ ఏమిటో
తెలియని ఓ అనుమానమే
తెర తీసినది ఎందుకో


సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
కురిసింది గుండెల్లో
వెన్నెలమ్మా
చిన్నరి పాపల్లే
చిరునవ్వుల సిరిమల్లె
సరిగమలే పాడినది
కూనలమ్మా
ఎద లోతులో
అలజడి రేగే నాలో
మరి మరి ఎందుకో
పిలిచెను ప్రెమ నాలో

సిరి సిరి మువ్వల్లే
చిరుగాలి చినుకల్లె
చిరునవ్వుల పిలుపల్లే