Wednesday, July 4, 2007

సైనికుడు--2006


సంగీతం::హరీష్ జయరాజ్
రచన::కులశేఖర్
గానం::SP.బాలు,ఉన్నిక్రిష్ణన్,కవిత సుబ్రమణ్యం

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా....


మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా
ఊరించే ఊహాలోకం లేరా......
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా
రంగంటూ లేనేలేదు లేరా...


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా..


ఊహల్లో ఊసుల్లో ఆమాటే
ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే
ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందు ఉంటుందిలే బహుశా...


మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా
నీ చెంటే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే


ప్రేమిస్తే ఎంతైనా వింతేలే
నువ్వు ఎంత చెప్పూ గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా
ఇంతోటి తీపి ఏమున్నదైనా


శిలవా నా మాట వినవా
ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా
కల్లోనైన ఊహించని మహిమా


మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా...
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా...

సైనికుడు--2006


సంగీతం::Harris Jairaj
రచన::వేటూరి
గానం::హరిహరన్,చిత్ర

హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా


అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

వసారా చూరంట వాలే పొద్దూ
చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ
జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ

కాస్తో కూస్తో కాటా ఏస్తే
నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్


అలకలు వస్తే తళుకులు చూస్తా
చతికిల పడకుండా జతే కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా
చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా
నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
వడి సొంతమే ఉందిగా హాయీ హామీ


అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా


గడపలకొస్తే గడియలు తీస్తా
కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా
సొగసులు కోస్తే రవికలు తెస్తా
విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
నడి సందెలో అందెలే సిందెయ్యగా


హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

సైనికుడు--2006


సంగీతం::Harris Jairaj
రచన::కులశేఖర్గానం::శ్రేయ

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో..వాకిళ్ళల్లొ
ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

సిందూలేసే సూదవమ్మ
వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

హా..సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా


ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురైమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా


డోలారే డోలా డోలారే డోలా
మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా
నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా


మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగ ఆదమరచిపోనా


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో..వాకిళ్ళల్లొ
ఉయ్యాలలూగె ప్రేమా హో


సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

సిందూలేసే సూదవమ్మ
వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా