Tuesday, August 30, 2011

మంత్ర --2007




సంగీతం::ఆనంద్
రచన::భువనచంద్ర
గానం::మధుమిత,నోయిల్‌సెన్

ya r u ready? come! do it now!
A.. M A N T R A
వేసేస్తా లవ్ మంత్రాలే..
మహ... మహ... మహ... మహ!
మహ... మహ... మహ... మహ!
my heart is very hot! check out!
అందంతో పందెం వేస్తా అందరిని నేనొడిస్తా
నాతోనే పేచీకొస్తే ఓడించి నే చూపిస్తా
మాటకుందో అందం చేతకుందో అందం
అందం అంటే ఫిగరే కాదోయ్ మనసుది కూడా ఓ నేస్తం
లైఫో గోల్డెన్ కప్పు లవ్ చెయికుంటే తప్పు
మళ్ళి మళ్ళి రాదోయ్ టీనేజ్ ఓపెన్ చెయ్యి నీలో ఫీలింగ్
మారో మసీ మారో దిల్ సే మిలనా యారో
దిక్కులు చూస్తే వేస్టైపోదా లైఫే ఓ దిల్ దారో
my love... my love... my love my love... you love my love...
ఈహా... మహా మహా మహా... my heart will get you
she drives you crazy
nah nah nah nah nothing you got it take it easy
she is got me raising
చూపించొద్దు మీలో డాబు... బాబు బాబు
మదిలో మెదిలే ఆశేదో ఆఫేదో నిను చూస్తుంటే
i am a ga ga ga ga ga naughty ga వేసేస్తా లవ్ మంత్రాలే
దిల్ ఎ బోలే ధగ్ ధగ్ ధగ్ ధగ్... ధగ్ ధగ్ ధగ్నిను చూస్తుంటే
ఏదేమైనా i don't care i don't care i don't care !
you count from number one i am all in one
మా కళ్ళలోనా ఉందో గన్... పేల్చామంటే not a fun
రాదా ఫీవర్ హ హ... మేమంటుంటే న న
లుక్కు తోనే గుండె టచ్ చేసావంటూ చెప్పేతంటా
మీ కళ్ళమేమై నీ ఆశ మేమై మైకం తెస్తే హరే రామా!
మహ... మహ... మహ... మహ!
మహ... మహ... మహ... మహ!
my heart is very hot my heart is very hot
my heart is very hot
సందేహాలేలా play on the music music చూపిస్తాం మాలో మ్యాజిక్
సరాదాలా వేళా సాగించేసెయ్ ఏదో గోలా... గోల గోల
మదిలో మెదిలే ఆశేదో ఆఫేదో నిను చూస్తుంటే
i am a ga ga ga ga ga naughty ga వేసేస్తా లవ్ మంత్రాలే
దిల్ ఎ బోలే ధగ్ ధగ్ ధగ్ ధగ్... ధగ్ ధగ్ ధగ్ నిను చూస్తుంటే
ఏదేమైనా i don't care i don't care i don't care !

Monday, August 29, 2011

Mr.పర్‌ఫెక్ట్--2011




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::గోపికా పూర్ణిమ

అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల..నేను
నన్ను చిన్న చూపు చూస్తే..ఊరుకోనూ
ఎందులోనూ నీకు నేను..తీసిపోనూ
నా సంగతేంటో తెలుసుకోవా..పోను పోనూ
అచ్చమయిన పల్లె రాణిపిల్ల..నేనూ
పచ్చి పైర గాలి పీల్చి..పెరిగినానూ
ఏరికోరి గిల్లికజ్జా..పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ..హొయ్ హొయ్ హొయ్

హే సూటు బూటు స్టైలు..సుందరా
లేనిపోని డాబు..మానరా
ఈఊరిలో పైచేయి..నాదిరా
నా గొప్ప నువ్ ఒప్పుకో..తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీ..ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేలదించుకో.. ఓయ్..

Sunday, August 28, 2011

Mr.పర్‌ఫెక్ట్--2011




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::అనంత శ్రీరాం
గానం::సాగర్,మేఘ

ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న..లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
రై రై రై రైడ్ చేసెయ్..రాకెట్ లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్..సిగ్నల్స్ తో ఏం పని
ఇక హైవేలైన వన్‌వేలైనా..కదలదే బండి తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక

పార్టీలా ఉంది నీతోటి ప్రతి క్షణం..ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం..బాగుందబ్బ మాటల్లోన ముంచడం
రోల్ ఎన్ కోస్టర్ ఎంతున్నా..ఈ థ్రిల్ ఇస్తుందా జానా,
నీతో పాటు తిరిగేస్తుంటే..జోరే తగ్గేనా
కార్టూన్ ఛానెల్ లోనైనా..ఈ ఫన్ ఉందా బోలోనా
నీతోపాటూ గడిపేస్తుంటే టైమే..తెలిసేనా
ఇక సల్సాలైన సాంబాలైనా..కదలదే ఒళ్ళు తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక

ఆన్‌లైన్‌లో నువ్ హై అంటే నా మది..క్లౌడ్ నైన్ లోకి నను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది..కోల్‌మైన్‌లోకి దూరేస్తది
ఏప్లేస్ఐనా గ్రీటింగ్‌కార్డ్‌లా కనిపిస్తుందే జానా..నాతో పాటు ఈ ఫీలింగు నీకూ కొత్తేనా
ఏరోజైనా వాలెంటైన్స్‌డే అనిపిస్తుందేమైనా..నాతో పాటూ అడుగేస్తుంటే నీకూ అంతేనా
ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా..గడవదే రోజు తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న
..లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

Mr.పర్‌ఫెక్ట్--2011




సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::అనంత శ్రీరాం
గానం::శ్రేయా ఘోషాల్

ఓ చలి చలిగ అల్లింది..గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది..మనసు
చిటపట చిందేస్తుంది..అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది..వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని..ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి..పోతున్నాయీ
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు..ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయీ
నువ్వు నాతోనే ఉన్నట్టు..నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు..నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు..ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు

ఓ చలి చలిగ అల్లింది..గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది..మనసు

గొడవలతో మొదలై..తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే..నీది నాది
తలపులు వేరైనా..కలవని తీరైనా
బలపడి పోతుందే..ఉండేకొద్దీ
లోయలోకి..పడిపోతున్నట్టు
ఆకాశం పైకీ..వెళుతున్నట్టు
తారలన్ని..తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు..ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు..నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు..ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు..నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు..ఏవో కలలు

నీపై కోపాన్నీ అందరి ముందైనా
బెదురే లేకుండా..తెలిపే నేను
నీపై ఇష్టాన్నీ నేరుగ..నీకైనా
తెలపాలనుకుంటే..తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ..గుర్తొస్తుంటే
నన్ను నేనే..చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు..పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు..నానీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు..నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు..ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు .

Tuesday, August 9, 2011

గణేష్--2009::Ganesh--2009




సంగీతం::మిక్కీ J.మేయర్
రచన::సిరివెన్నెల
గానం::జావేద్ అలీ

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది
లైఫంతా నాతో ఇలాగే ఉంటావా?

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో
ఈ వెలుగును దాచాలంటే
పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో
మనసంతా ప్రేమైపోతే
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో
మైమరపున నే నిలుచుంటే
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందోలేదో కలేం కాదే ఇదంతా

ఇదే క్షణం శిలై నిలవనీ
సదా మనం ఇలా మిగలనీ
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో..మదేం విందో

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా

తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా

Ganesh--2009
Music::Micky j mayer
Director::Saravanan (new)
Producer::Sravanthi Ravikishore
Cast::Ram, Kajal
Lyrics::Sirivennela
Singer's::Juved Ali

Ivvala naku chaala happy ga undi
life anta naatho ilage untava?

Tanemando ando ledo teleledey nijamga
madhem vindo vindo ledey kala em kade idanta
inta lone anta maikaam panikiraade praanama
paravasam lo munigipote paikiragalamaaa

tanemando ando ledo teleledey nijamga
madhem vindo vindo ledey kala em kade idanta

kudivaipuna inko hrudayam unna saipodo emo
e velegunu dachanantey
padamara lo naina hrudayam eroje chusa nemo 
manasanta premayi pothe
egirochina edo lokam na chuttu velisindemo
maimarapula ne nilichiunte

inta lone anta maikaam panikiraade praanama
paravasam lo munigipote paikiragalamaaa


tanemando ando ledo teleledey nijamga
madem vindo..vindo ledey kala em kade idanta

idhey..kshanam..silai nilavani
sada..manam ila migalani
janmante idantu teledey innallu
ejantey ivvale jivinchaa noorelluuuu

tanemando madem vindo
tanemando ando ledo teleledey nijamga
madem vindo..vindo ledey kala em kade idanta
inta lone anta maikaam panikiraade praanama

paravasam lo munigipote paikiragalamaaa

Wednesday, August 3, 2011

దేవిపుత్రుడు--2000





దేవిపుత్రుడు--2000
సంగీతం::మణిశర్మ

పల్లవి::

కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక

చరణం::1

బాలకృష్ణుని బంగారు మొలతాడు
చిన్నికృష్ణుని సరిమువ్వ గజ్జెలు
సత్యాభామాదేవి అలకపానుపు
రుక్మిణిదేవి తులసీవనము
తీయని పాటల మురళి
తీరైన నెమలిపింఛం
కృష్ణుడు ఊదిన శంఖం
శిశుపాలుని చంపిన చక్రం
కనులు తెరువకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి

కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక


DaeviPutruDu--2000
Music by::Mani Sharma
Lyricist::
Directed by::Kodi Ramakrishna
Produced by::M.S. Raju
Starring::Daggubati Venkatesh,Anjala Zaveri,Soundarya

pallavi::

keraTaala aDuguna kanuchoopu maruguna
nidurapOtunnaadi dvaaraka
aa kRshNuDu aelina dvaaraka
SreekRshNuDu naDichina dvaaraka
aa kRshNuDu aelina dvaaraka
SreekRshNuDu naDichina dvaaraka

charaNaM::1

baalakRshNuni baMgaaru molataaDu
chinnikRshNuni sarimuvva gajjelu
satyaabhaamaadaevi alakapaanupu
rukmiNidaevi tulaseevanamu
teeyani paaTala muraLi
teeraina nemalipiMChaM
kRshNuDu oodina SaMkhaM
SiSupaaluni chaMpina chakraM
kanulu teruvakuMDaa kathalu kathalugaa unnavi eenaaTiki

keraTaala aDuguna kanuchoopu maruguna
nidurapOtunnaadi dvaaraka
aa kRshNuDu aelina dvaaraka
SreekRshNuDu naDichina dvaaraka
aa kRshNuDu aelina dvaaraka
SreekRshNuDu naDichina dvaaraka

దేవిపుత్రుడు--2000






సంగీతం::మణిశర్మ
రచన::జొన్నవిత్తుల
గానం::బాలు, చిత్ర

పల్లవి::

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే
ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే

చరణం::1

నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా
సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా
తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా
చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా
హరివిల్లే కాగా ఉయ్యాలలే
కోయిలలే పాడే నా జోలలే
బొమ్మలుగా మారే ఆ చుక్కలే
దిష్టంతా తీసే నలుదిక్కులే

చరణం::2

పాపలో అందమంతా బ్రహ్మకే అందనంత ఎంతో వింత
అమ్మలో ప్రేమ అంత నాన్నలో ఠీవి అంతా వచ్చేనంటా
తీయని నవ్వేమో దివి తారల వెలుగంత
కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత
అడుగేసి తీస్తే హంస జోడి
కులుకుల్లో తానే కూచిపూడి
చిరునవ్వులోన శ్రీరమణి
మారాము చేసే బాలామణి

ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ
సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే
నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే



Devi Putrudu--2000
Lyrics::jonnavittula
Singers::baalu, chitra
Music by::Mani Sharma
Directed by::Kodi Ramakrishna
Produced by::M.S. Raju
Starring::Daggubati Venkatesh,Anjala Zaveri,Soundarya

pallavi:

aakaaSaMlOni chaMdamaama baMgaaru paapai vachchaenamma
saagaramaayae saMbaramae svaagatamaayae saMtasamae
naalOni praema pratiroopamae ee iMTa taanae sirideepamae
aakaaSaMlOni chaMdamaama baMgaaru paapai vachchaenamma
saagaramaayae saMbaramae svaagatamaayae saMtasamae
naalOni praema pratiroopamae ee iMTa taanae sirideepamae

charaNaM1:

niMgilO neelamaMtaa uMgaraM chaesi istaa ooraegistaa
saagaraM poMgulannee gavvala gaunu chaestaa gaaraaM chaestaa
tellani aenugupai naa paapanu ekkistaa
chilakalu haMsalani aaDaeMduku rappistaa
harivillae kaagaa uyyaalalae
kOyilalae paaDae naa jOlalae
bommalugaa maarae aa chukkalae
dishTaMtaa teesae naludikkulae

charaNaM2:

paapalO aMdamaMtaa brahmakae aMdanaMta eMtO viMta
ammalO praema aMta naannalO Theevi aMtaa vachchaenaMTaa
teeyani navvaemO divi taarala velugaMta
kammani pilupaemO ee ammaku pulakiMta
aDugaesi teestae haMsa jODi
kulukullO taanae koochipooDi
chirunavvulOna SreeramaNi
maaraamu chaesae baalaamaNi

aakaaSaMlOni chaMdamaama baMgaaru paapai vachchaenamma
saagaramaayae saMbaramae svaagatamaayae saMtasamae
naalOni praema pratiroopamae ee iMTa taanae sirideepamae