Sunday, June 18, 2006

హాపీ~~Happy~~2006



రచన::సిరివెన్నెల
సంగీతం::యువన్ శంకర్ రాజ్
గానం::శంకర్ మహాదేవన్
రాగం::

నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని

!!నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ !!

దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా
దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా
కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా

!!నీ కోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ !!

పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా
కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజా
లుగా

Saturday, June 17, 2006

రావోయి చందమామ~~1999


సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::SP.బాలు,హరిణి

స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత..పూల బాసలు కాలేవా..చేతి రాతలు
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే


నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా


నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం
పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం
వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల ఏక తాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో
లే లేత..పూల బాసలు కాలేవా..చేతి రాతలు
స్వప్న వేణువేదో సంగీతమాలపించే
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

Sunday, June 11, 2006

తొలి ప్రేమ~~1999


సంగీతం::దేవ
రచన::సిరివెన్నెల
గానం::SP.బాలు

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిసాం మనమే మనమే ...
జన్మించలేదా నీవు నాకోసమే
ఓ...ఓ...ఓ...
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే

ప్రేమా...ప్రేమా...ప్రేమా...ప్రేమా...
ఆ...ఆ...ఆ...

నీ కనులేవో కలలు అడుగు
ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో వెలిగే లయనే
బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో
పొద్దుపొడుపై కదిలించలేద
నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞపకాన్నై
నిన్ను పిలువా....
పగడాల మంచుపొరలో....

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే

నా ఊహల్లో కదిలే కడలే
ఎదుట పడినవీ...
నా ఊపిరిలో ఎగసి చెదరి
కుదుట పడినవీ....
సమయాన్ని శాస్వతంగా
నిలిచిపోనీ...
మనసన్న అమౄతంలో మునిగిపోనీ....
మనవైన ఈ క్షణలే అక్షరాలై
శౄతిలేని ప్రేమ కధగా మిగిలిపోనీ
ఆ...హా...ఆ...హా....

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై

ప్రేమ కధ~~1997


సంగీతం::సందీప్ చౌత
రచన::సిరివెన్నెల
గానం::అనురాధా,రాజేష్

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ
ప్రేమే దొరికే వరకూ

స్వర్గం ఒకటుంటుందనీ
అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను
నీ నీడకు చేరే వరకూ

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో..ఏమైనా..నీతో..
ఈ పైనా..కడదాక సాగనా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ
ప్రేమే దొరికే వరకూ
స్వర్గం ఒకటుంటుందనీ
అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను నీ
నీడకు చేరే వరకూ

నువ్వు ఉంటేనె ఉంది నా జీవితం
ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం
సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే
పెదవి పలవరిస్తోందీ
ఇదే మాత గుండెల్లో
సదా మోగుతోందీ
నేనే నీకోసం
నువ్వే నాకోసం
ఎవరేమి అనుకున్నా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ
ప్రేమే దొరికే వరకూ
స్వర్గం ఒకటుంటుందనీ
అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను నీ
నీడకు చేరే వరకూ

ప్రేమనే మాటకర్ధమే తెలియదూ
ఇన్నాళ్ళ వరకూ
మనసులో ఉన్న అలజడే తెలియదూ
నిను చేరే వరకూ
ఎటెళ్ళిందో జీవితం
నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో
నువ్వే రాకపోతే
నువ్వూ..నీ నవ్వూ..నాతో లేకుంటే
నేనంటు ఉంటానా ......

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ
ప్రేమే దొరికే వరకూ

స్వర్గం ఒకటుంటుందనీ
అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను నీ
నీడకు చేరే వరకూ

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో...ఏమైనా...నీతో...
ఈ పైనా...కడదాక సాగనా ...

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ
ప్రేమే దొరికే వరకూ
స్వర్గం ఒకటుంటుందనీ
అంతా అంటుంటే వినీ
నమ్మలేదు నేను నీ
నీడకు చేరే వరకూ

Monday, June 5, 2006

ఖుషీ--2001






సంగీతం::మణిశర్మ
రచన::చంద్రబొస్
గానం::ఉదిత్ నారాయణ్ ,కవిత క్రిష్టమూర్తి

అమ్మయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అమ్మయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగెలే
ఆ నవ్వులు ఈ చూపులు ఆ నవ్వులు
ఈ చూపులు కలిపెస్తే ప్రేమేలే
అమ్మయే సన్నగ అరనవ్వే నవ్వగ ..ఊ ఒహొ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే..ఊ ఒహొ

ప్రేమలు పుట్టే వేళా పగలంతా రేయేలే ..అమ్మమ్మొ
ప్రేమలు పండే వేళా జగమంతా జాతరలే ..అమ్మమ్మొ
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే
నీ ఒంట్లొ ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైన నా నోటికి నారంజే
ఈ వయసులొ ఈ వరసలొ
ఈ వయసులొ ఈ వరసలొ నిప్పైన నీరేలే

అమ్మయే సన్నగ అరనవ్వే నవ్వగ ..ఊ ఒహొ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే..ఊ ఒహొ!!!

నెనొక పుస్తకమైతె నీ రూపే ముఖ చిత్రం ..అమ్మమ్మొ
నెనొక అక్షరమైతె నువ్వెలె దానర్ధం ..అమ్మమ్మొ
యెగిరే నీ పైటే కలిగించె సంచలనం
ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానం
యెండల్లొ నీరెండల్లొ నీ చెలిమె చలివెంద్రం
మంచుల్లొ పొగ మంచుల్లొ నీ తలపె రవి కిరణం
పులకింతలె మొలకెత్తగ
పులకింతలె మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం

అమ్మయే సన్నగ అరనవే నవ్వగ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అమ్మయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాల్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగెలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే!!!