Showing posts with label సైనికుడు--2006. Show all posts
Showing posts with label సైనికుడు--2006. Show all posts

Thursday, January 29, 2015

సైనికుడు--2006


సంగీతం::హారిస్ జయరాజ్ 
రచన::చంద్రబోస్
గానం::కె కె 

పల్లవి::
సైనికుడూ..ఊఊఊ..సైనికుడూ..ఊఊఊ 
గో గో గో గో గో..గో గో గో గో గో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో..

కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి
లోకమనే మదిలో ఒదిగే 
నిదురని తట్టి ఓ..ఓ
శ్రామికుడు నువ్వై 
ప్రేమికుడు నువ్వై ఓ..ఓ
సాగిపో నేడే సైనికుడు నువ్వే
గో గో..

చరణం::1

ఎంబిఏ చదివినా ఎంసిఏ లే చదివినా
ఈ జగతిని సైతం చదవరా
వేదాలే చదివినా 
వేమన నీతులు చదివినా
అవినీతుల లోతులు చదవరా...
వికాసం మాటున విషాదం ఉందిరా
విరామం వద్దురా విధానం మార్చరా
ఒంటి సైనికుడల్లే కవాతులే చెయ్యరా
కోటి సూర్యులమల్లే ప్రకాశమే పంచరా
గో గో..

చరణం::2

ఓ మై లవ్ మాటతో 
అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యన
ఓ మై ఫ్రెండ్ మాటతో 
అందరి మనసులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా
ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జగాలనే నడపరా
గో గో.. సైనికుడూ..ఊఊఊ


Sainikudu--2006
Music::Harris Jayaraj
Lyrics::Chandra Bose
Singer::Ke Ke 

sainikudu..uuuuu..sainikudu..uuuuuu
go go go go go go
go go go go go go
go go go adhigo adhigo lokam adhigo
go go go idhigo idhigo kaalam idhigo
kaalam idhigo kaalam idhigo
go go go adhigo adhigo lokam adhigo
go go go idigo idigo kalam idigo

kaalamane nadhilo kadhile alalanu kotti
lokamane madhilo vodhige nidhurani thatti
o o o o o o
sramikudu nuvvai premikudu nuvvai
o o o o o o
saagipo nede sainikudu nuvve
go go go go go go
go go go go go go

go go go adhigo adhigo lokam adhigo
go go go idhigo idhigo kaalam idhigo
go go go adhigo adhigo lokam adhigo
go go go idhigo idhigo kaalam idhigo

mba chadivina mca le chadivina
ee jagathini saitham chadavara
vedale chadivina vemana neethulu chadivina
avineethula lothulu chadavara
vikasam maatuna vishadam vundhira
viraamam vaddhura vidhanam maarchara
onti sainikudalle kavathule cheyyara
koti suryulamalle prakasame panchara prakasame panchara

go go go adhigo adhigo lokam adhigo
go go go idhigo idhigo kaalam idhigo
sainikuduu sainikuduu

oh my love maata tho ammayi manase gelichina
aa gelupe idhari madhyana
oh my friend  maata tho andhari manasulu gelavara
aa gelupoka malupunu chupura
prayathnam needhi ra prabhuthvam nuvvu ra
prabhavam needhi ra prabhanjana mavva ra
saati snehithudalle janalatho nadavara
meti nayakudalle jagalane nadapara

go go go adhigo adhigo lokam adhigo
go go go idhigo idhigo kaalam idhigo

kaalamane nadhilo kadhile alalanu kotti
lokamane madhilo vodhige nidhurani thatti
o o o o o o
sramikudu nuvvai premikudu nuvvai
o o o o o o
saagipo nede sainikudu nuvve
go go go go go go
go go go go go go
sainikudu..uuuuuu

సైనికుడు--2006


సంగీతం::హారిస్ జయరాజ్ 
రచన::వేటూరి
గానం::కార్తీక్,కారుణ్య,హరిణి,మాలతి

సాకీ:: 

ఓ చిలక నా రాచిలక 
రావే రావే రాచిలక 
నా చిలక రాచిలక 
రావే రావే నా చిలక 
ఓ సయ్యోరే సయ్యోరే సయ్యా హోరే 
అరె సయ్యోరే సయ్యోరే 
సయ్యా హోరే 

పల్లవి:: 

ఓరుగల్లుకే పిల్లా పిల్లా 
ఎన్నుపూస ఘల్లు ఘల్లుమన్నాదే 
ఓరచూపులే రువ్వే పిల్లా 
ఏకవీర నువ్వులా ఉన్నావే 

జవ్వనాల ఓ మధుబాల 
జవ్వనాల ఓ మధుబాల 
ఇవి జగడాల ముద్దు పగడాలా 
అగ్గిమీద ఆడ గుగ్గిలాల 
చిందులేస్తున్న చిత్తరాంగిరా 

చరణం::1 

లాలాలా పండు వెన్నెలా 
తొలివలపు పిలుపులే వెన్నలా 
ఇకనైనా కలనైనా ఎదకు చేరగలనా 
అందాల దొండపండుకు 
మిసమిసల కొసరు కాకికెందుకు 
అది ఈడా సరిజోడా 
తెలుసుకొనవే తులసి 
చెలి మనసును గెలిచిన వరుడికి 
నరుడికి పోటీ ఎవరు
నరుడికి పోటీ ఎవరు  
చలి చెడుగుడు విరుగుడు 
తప్పేవి కావు తిప్పలు..ఛల్ 

చరణం::2 

కాకాకా కస్సుబుస్సులా 
తెగ కలలు కనకు గోరువెచ్చగా 
తలనిండా మునిగాకా 
తమకు వలదు వణుకు 
దా దా దా దమ్ములున్నవా 
మగసిరిగా ఎదురు పడగలవా 
లంకేశా లవ్ చేశా 
రాముడంటి జతగాణ్ణి 
ఎద ముసిరిన మసకల 
మకమకలాడిన మాయే తెలుసా 
ఒడిదుడుకులు ఉడుకులు 
ఈ ప్రేమకెన్ని తిప్పలు..ఛల్

సైనికుడు--2006


సంగీతం::హారిస్ జయరాజ్ 
రచన::చంద్రబోస్
గానం::లెస్లీ లెవిస్,అనుష్క,సునీతాసారధి

సాకీ::

జువానా జమైకా హొజానా బలే
షవానా గయానా దివానా దలే
పప్పాబ పప్పాబ పప్పాబ పప్పా  
బైలా బైలమో..సన్నన్ నాననా
డైలా డైలమో..సన్నన్ నాననా
యువరాగం వెంట రావాలంటా నేడే

పల్లవి::

బైలా బైలమో..సరికొత్త సంగీతంలో
డైలా డైలమో..పయనిద్దాం ఈ వేగంలో


జనగణమే నిలిచింది నీతో
జనపదమే నడిచింది నీతో
నవజగమే 
యువరాగం వెంట రావాలంటా నేడే
ఓహో మాతరం మాతరం
తారంపం తారంపం
ఓహో..ఆపడం ఆపడం
ఎవరితరం..ఏహే


చరణం::1

ఓ..ఓ..ఓ..ఓ..
మెరుపే బంగారాలు
మెరవకపోతే రాళ్లు
అనుకుంటూ
ఉన్నాగా ఇన్నాళ్లు
తెరిపించావోయి కళ్లు
విడిపించవోయి ముళ్లు
ముళ్లైనా నీతో ఉంటే పూలు
పొంగించాలి ప్రవహించాలి
మనసుల్లోన మమతల సెలయేరు
నిర్మించాలి నడిపించాలి
నలుగురు మెచ్చే నూతన సర్కారు

చరణం::2

చూపుల్లోని చురుకు
ఊహల్లోని ఉడుకు
దీపాలై అందించాలి వెలుగు
చేయి చేయి కలుపు
పాదం పాదం కలుపు
ఏరాలి మొక్కల్లోని కలుపు
మెలి తీయాలి తరిమేయాలి
కాలుష్యాల చీకటి కోణాలు
పండించాలి పాలించాలి
సస్యశ్యామల ప్రేమల రాజ్యాలు

Wednesday, July 4, 2007

సైనికుడు--2006


సంగీతం::హరీష్ జయరాజ్
రచన::కులశేఖర్
గానం::SP.బాలు,ఉన్నిక్రిష్ణన్,కవిత సుబ్రమణ్యం

ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా....


మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా
ఊరించే ఊహాలోకం లేరా......
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా
రంగంటూ లేనేలేదు లేరా...


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా..


ఊహల్లో ఊసుల్లో ఆమాటే
ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే
ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందు ఉంటుందిలే బహుశా...


మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా
నీ చెంటే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే


ప్రేమిస్తే ఎంతైనా వింతేలే
నువ్వు ఎంత చెప్పూ గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా
ఇంతోటి తీపి ఏమున్నదైనా


శిలవా నా మాట వినవా
ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా
కల్లోనైన ఊహించని మహిమా


మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా
ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా...
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే
ప్రేమిస్తే లోకం మొత్తం హాయే


ఎంతెంత దూరం తీరం రాదా
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ
నీవైపు మళ్ళిందంటే మాయేగా...

సైనికుడు--2006


సంగీతం::Harris Jairaj
రచన::వేటూరి
గానం::హరిహరన్,చిత్ర

హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా


అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా

వసారా చూరంట వాలే పొద్దూ
చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ
జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ

కాస్తో కూస్తో కాటా ఏస్తే
నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా హేయ్


అలకలు వస్తే తళుకులు చూస్తా
చతికిల పడకుండా జతే కలుస్తా
ఇరుకున పెడితే దొరకనిదిస్తా
చిలికిన ఎన్నెల్లో వొడే పరుస్తా
నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
నిప్పంటుకున్నాక తప్పేందమ్మీ
వడి సొంతమే ఉందిగా హాయీ హామీ


అగ్గిపుల్లా ఆడపిల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా


గడపలకొస్తే గడియలు తీస్తా
కుడిఎడమవుతుంటే కుదేలు చేస్తా
సొగసులు కోస్తే రవికలు తెస్తా
విరవిరజాజుల్తో నిన్నే గెలుస్తా
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
సిగ్గంటుకున్నాక ముద్దెందుకూ
నడి సందెలో అందెలే సిందెయ్యగా


హేయ్ ఆడపిల్లా అగ్గిపుల్లా రాజై రాజై రెండూ కళ్ళా
బుగ్గే గిల్లీ చూడూ మల్లా సిగ్గుల్లో మొగ్గేస్తే సొమ్మసిల్లా
వసారా చూరంట వాలే పొద్దూ చల్ చటుక్కున చటుక్కున నాతో వద్దూ
దుబారా వద్దంట ఇచ్చేయ్ ముద్దూ జత కలిసిన ముడేసిన నాడే ఇద్దూ
కాస్తో కూస్తో కాటా ఏస్తే నీ వాస్తంత చూసాకే వాటాకొస్తా

సైనికుడు--2006


సంగీతం::Harris Jairaj
రచన::కులశేఖర్గానం::శ్రేయ

సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో..వాకిళ్ళల్లొ
ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

సిందూలేసే సూదవమ్మ
వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా

హా..సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా


ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురైమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా


డోలారే డోలా డోలారే డోలా
మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా
నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా


మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగ ఆదమరచిపోనా


సొగసు చూడ తరమా
అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా
రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో..వాకిళ్ళల్లొ
ఉయ్యాలలూగె ప్రేమా హో


సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

సిందూలేసే సూదవమ్మ
వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ

నాలో నేను లేనోయమ్మ
ప్రేమ వింత వరమా