Showing posts with label వరుడు ~~ 2010. Show all posts
Showing posts with label వరుడు ~~ 2010. Show all posts
Tuesday, June 1, 2010
వరుడు ~~ 2010
సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::హేమచంద్ర
కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
ఓ సఖీ నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలీ నా ప్రేమకీ ఉసురైనా కావే
ఒంటరీ ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నాదానా
మేఘ్హమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాల
అందుతూ చేజారినా చేమంతీ మాల
అందనీ దూరాలకే నువ్ పోనేల
తెగించాను నీ కోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయాన
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీ్తో ఏకం అవుతా ఏమైనా
కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట
Monday, May 24, 2010
వరుడు ~~ 2010
సంగీతం::మణి శర్మ
రచన::వేటూరి
గానం::సోనూనిగం,శ్రేయాఘోషాల్
బహుశా ఓ చంచలా...ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా...చూపులో చూపుగా
అయినా కావచ్చులే...ఒకటై పోవచ్చులే
ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే...యే దూరమైనా చేరువై
బహుశా ఓ చంచలా...ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా...చూపులో చూపుగా
కనుపాపల్లో నిదురించీ...కల దాటిందీ తొలి ప్రేమా
తొలి చూపుల్లో చిగురించీ...మనసిమ్మందీ మన ప్రేమా
కలగన్నానూ...కవినైనానూ...నిను చూసీ
నిను చూసాకే...నిజమైనానూ...తెర తీసీ
బహుశా ఈ ఆమనీ...పిలిచిందా రమ్మనీ
ఒకటైతే కమ్మనీ...పల్లవే పాటగా
అలలై రేగే అనురాగం...అడిగిందేమో ఒడిచాటూ
ఎపుడూ ఏదో అనుభంధం...తెలిసిందేమో ఒకమాటూ
మధుమాసాలే మన కోశాలై...ఇటురానీ
మన ప్రాణాలే శతమానాలై...జతకానీ
తొలిగా చూసానులే...చెలిగా మారానులే
కలలే కన్నానులే...కలిసే ఉన్నానులే
నా నీవులోనే నేనుగా
బహుశా ఓ చంచలా...ఎగిరే రాయంచలా
తగిలే లే మంచులా...చూపులో చూపుగా
Subscribe to:
Posts (Atom)