Showing posts with label లక్ష్యం~~2007. Show all posts
Showing posts with label లక్ష్యం~~2007. Show all posts

Sunday, May 25, 2008

లక్ష్యం~~2007


సంగీతం::మణిశర్మ
రచన::చంద్రబోస్,రామ జోగయ్య శాస్త్రి
గానం::కల్పన,రంజిత్

ఎవడు..ఎవడు..ఎవడు..
ఎవడూ..ఎవడూ..ఎవడూ..
నా కాఫీ కలిపేవాడు నా కంచం కడిగేవాడు
నా కష్టం తీర్చేవాడు నాక్కావాలి
నా కూడా ఉండేది నా డ్రెస్ పిండేది నన్నే ఇస్త్రీ
చెయ్యనిదీ నాక్కావాలి
నా పైట చిక్కేవాడు నా వెనకా నక్కేవాడు నా
ముందు మొక్కేవాడు నాక్కావాలి
నా పైకే ఎక్కేది నా బ్యాకే నొక్కేది నన్నొదిలి
చెక్కేయనిది నాక్కావాలి
సరియైన మొగుడు ఎవ్వడు
సుగుణాల మగువ ఎవ్వరూ
ఎన్నో బంధించేవాడు ఎదురేదీ ఎరగనివాడు ఆ.ట్.ం
అయ్యేవాడు ఎవ్వడు ఎవ్వరు ఎవ్వడు ఎవ్వరు
ఎవ్వడు ఎవ్వడు హే...

మందూ సిగరెట్టూ చెడు అలవాటంటూ ఉండని వాడే కావాలి
లాగు ఊరేగు అది మగలక్షణమని చెప్పేలేడీ కావాలి
అమ్మా ఆంటీస్ అస్సలెవ్వరివంకా చూడనివాడే కావాలి
చూడు తెగ చూడు అందరిలో నన్నే చూడమని తనుతొలగాలి
ఎంతందముగా ఉన్నావంటూ పొగడాలి
నిజాలు చెబితే నమ్మాలి
ఎంతో ఎంతో ఖర్చే పెట్టి తిప్పాలి.
నవ్వుతానే తీర్చాలి
ఏమైనా చేసేవాడు ఏమన్నా నమ్మేవాడు ఆ తగిన
పసివాడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడు ఎవ్వడూ
హే...

పెళ్ళే అయ్యాక ఇక లవ్వాడే వాడే వడే కావాలి
లవ్వే చేశాక ఇక పెళ్ళి గిళ్ళి ఆడే లేడీ కావాలి
ఆరు మరి ఏడు సాయంత్రం లోగా ఇంటికి తానేరావాలి
అయిదు గంటలకే ఉదయాన్నే వస్తే తలుపే తాను తీయాలి
అందరికన్నా నన్నే మిన్నగా చూడాలి
నా వాళ్ళూ నాకూ కావాలి
సాకులు చెప్పే రాజస్థానే నిండాలి
కన్నీళ్ళు కూడా కరగాలి

లక్ష్యం~~2007


సంగీతం::మణిశర్మ
రచన::చంద్రబోస్,రామ జోగయ్య శాస్త్రి
గానం::హేమచంద్ర

నిలువమని నన్ను అడగవలెనా
నిలువకుండా పోతివి లలనా
ఓర చూపుల చినదానా ఒక్కసారి రావే లలనా,
నిలువవె వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీనడకల హొయలున్నవె జానా
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూవుంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు
నిలువవె వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీనడకల హొయలున్నవె జానా
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూవుంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు

ఎవరని ఎంచుకొనినావో వరుడని బ్రాంతి పడినావో
ఎవరని ఎంచుకొనినావో బ్రాంతి పడినావో
సిగ్గుపడి తొలగేవో విరహగ్నిలో నను తోసి పోయేవో
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూవుంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు
నిలువవె వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా

ఒక్కసారి నన్ను చూడరాదా,చెంత చేర సమయమిది కాదా
ఒక్కసారి నన్ను చూడరాదా సమయమిది కాదా చాలు నీ మర్యాద
వగలాడి నే నీ వాడనే కానా ...
నువ్వు కులుకుతూ గలగల నడుస్తూవుంటే నిలువదె
నా మనసు ఓ అలనా అది నీకే తెలుసు
నిలువవె వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీనడకల హొయలున్నవె జానా