Thursday, June 18, 1998

జీన్స్ -- 1998


సంగీతం::A.R.రెహమాన్
రచన::A.M.రత్నం,శివగణేశ్
గానం::శ్రీనివాస్,బృందం


ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే

చెలియా నీకు నడమును చూశా
అరెరే బ్రహ్మింత పిసనారి
తలపెకైత్త కళ్లు తిరిగిపోయే ఆహా అతడే చమత్కారి
మెరుపును తెచ్చి కొంచెగా మలచి రవివర్మ గీసిన వదనమట
నూరడగుల శిల ఆరడుగుల శిల్పులు చెక్కిన రూపమట
భువిలో పుట్టినా స్ర్తీలందరిలో నీవే నీవే అందమటా
అంతటి అందం అంతా ఒకటై నన్నే చంపుట గోరమటా
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే..

అందమైన పువ్వా పువ్వా చెలి కురులు సొరభి తెలిపేనా
అందమైన నదివే నదివే చెలి మీటి సొగసు తెలిపేనా
అందమైన గొలుసా గొలుసా కాలి సొగసు తెలిపేనా
అందమైన మణివే మణివే గుండె గుబులు తేలిపేనా

చంద్రగోళంలో ఆక్సిజిన్ నింపి అక్కడ నీకొక గుడికడతా
నీ ప్రాణాలను కాపాడేందుకు నా ప్రాణాలను బదులిస్తా
మబ్బులు తెచ్చి పరుపుగ పేర్చి కోమలాంగి నిను జోకొడతా
నిద్దురలోన చెమటలు పడితే నక్షత్రాలతో తుడిచేస్తా
పంచవన్నె చిలక జలకాలాడగా మంచు బిందువలే సేకరిస్తా
దేవత జలకాలాడిన జలమును గంగాజలముగ సేవిస్తా

ప్రియా ప్రియా చంపొద్దే..
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే
చెలీ కన్నులతో హృదయం కాల్చోద్దే
అయ్యో వనెలతో ప్రాణం తీయొద్దే
ప్రియా ప్రియా చంపొద్దే నవ్వీ నన్నే ముంచొద్దే