Showing posts with label అత్తారింటికి దారేది--2013. Show all posts
Showing posts with label అత్తారింటికి దారేది--2013. Show all posts

Friday, May 1, 2015

అత్తారింటికి దారేది--2013


సంగీతం::దేవీశ్రీప్రసాద్
రచన::దేవీశ్రీప్రసాద్
గానం::దేవీశ్రీప్రసాద్.
కోరస్::అనిత, ప్రియదర్శని, ప్రియహెమేష్.

నిన్ను చూడగానే చిట్టి గుండె
గట్టిగానే కొట్టుకున్నదే..అదేమిటే
నిన్ను చూడకుంటే
రెండు కళ్లు ఒకటినొకటి
తిట్టుకున్నవే..అదేమిటే
ఏమిటో ఏం మాయో చేసినావె
కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో
అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా
అంత పెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ల లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీశావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ
ఇట్టా తిరిగేస్తూ తిరగ రాశావే
హే..అలా నువ్వు చీరకట్టి చిందులేస్తే
చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తు వుంటే
కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రా మరదలా
బృందం: అత్తలేని
కోడలుత్తమురాలు ఓలమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడలా కోడలా
కొడుకు పెళ్లామా ఓలమ్మా
పచ్చిపాల మీద మీగడేదమ్మా
ఆ వేడిపాలలోన వెన్న ఏదమ్మా
మోనాలిసా చిత్రాన్ని
గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనే లేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్లినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగివుందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే
నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగుభాషలో నాకు తెలిసిన పదాలు అన్నీ
గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా... వేటూరి పాటలా
ముద్దుగున్నావే మరదలా

Monday, October 21, 2013

అత్తారింటికి దారేది--2013:::Attarintiki Daredi--2013


















సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::శ్రీమణి 
గానం::విజయ్ ప్రకాష్ 

పల్లవి::

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్..పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్..వనవాసమ్.

భైరవుడో..భార్గవుడో..భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు దీవి లాంటి ఒంటి నైజమ్ వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజమ్
రక్షకుడో..తక్షకుడో..పరీక్షలకే సుసిక్షితిడో
శత్రువంటు లేని వింత యుధమ్..వీడి గుండె లోతు గాయమైన షబ్దమ్
నడిచొచ్చే నర్తనసౌరి..ఓహో..ఓహో..పరిగెత్తే పరాక్రమసైలీ..ఓహో..ఓహో..
హలాహలమ్ హరించినా ధక్ ధక్ ఉదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు..వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్..పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్..వనవాసమ్.

చరణం::1

ఓ..ఓఓఓ..ఓ..ఓఓఓ..ఓ..ఓఓఓ..
ధివినుంచి భుమిపైకి భగ భగమని కురిసేటి
వినిపించని కిరనమ్ చప్పుడు వీడు
వడి వడిగా వడగల్లై గడ గడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
సంఖమ్ లో దాగేటి పోటెత్తిన సంద్రమ్ హోరితడు
సోకాన్నే దాచేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు..వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
తనపొదలే వొదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చుపిస్తారు
తనదిసనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికీ
తనతూరుపు పరిచయమె చెస్తాడూ..ఊ..
రావనుడో రాఘవుడో మనసునుదోచె మానవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు..వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్..పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్..వనవాసమ్

Attarintiki Daredi--2013
Music::Devisri Prasad
Lyricist::Srimani
Singer's::Vijay Prakash

:::

Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…

Bhairavudo bhargavudo bhaskarudo mari rakkasudo
Ukku theega lanti onti naizam
Veedu merupulanni okataina tejam
Rakshakudo takshakudo parikshalake susikhsithudo
Shatruvantu leni vintha yudham
Idi gunde lothu gaayam aina shabdham
Nadichoche narthana souri..OhO..OhO..
Parigetthe parakrama saili..OhO..OhO..
Hala halam bharinchina karka hrudayudo

Veedu aaradugula bulletu, veedu dhairyam visirina rocketu
Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…

:::1

O..OOO..O..OOO..O..OOO..
Dhivi nunchi bhuvi paiki bhagabhagamani kuriseti
Vinipinchani kiranam chappudu veedu
Vadi vadiga vadagallai gadagada mani jaareti
Kanipinchani jadi vaanega veedu
Shankham lo daageti potettina sandram horithadu
Shokaane daatese ashokudu veedu ro
Veedu aarugula bulletu, veedu dhairyam visirina rocketu

:::2

aa aa aa aa aa aa aa aa aa 
Thana modale vadulukoni paikedigina kommalaki
Chigurinchina chotuni chupisthadu
Thana disane maarchukuni prabhavinche suryudiki
Thana thurupu taripevechestadu
Raavanudo raghavudo manasunu doche manavudo
Sainikudo sraamikudo asaadhyudu veedu ro
Veedu aarugula bulletu, veedu dhairyam visirina rocketu

Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…

అత్తారింటికి దారేది--2013:::Attarintiki Daredi--2013














సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::శంకర్ మహదేవన్

పల్లవి::

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్  రమ్మో..హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో..హో హో

చరణం::1

మొన్న మేడ మీద బట్టలారేస్తూ..కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ..నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా..హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది

పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ..పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే..ఓలమ్మో మల్లెపూల కొమ్మో
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ

చరణం::2

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే

ఓలమ్మో మల్లెపూల కొమ్మో..ఓ..

Attarintiki Daredi--2013
Music::Devisri Prasad
Lyricist::Ramajogayya Sastry
Singer's::Shankar Mahadevan

:::

Hey bongaraalanti kallu thippindi
ungaraalunna juttu thippindi
gingiraaletthe nadumompullo nanne thippindee
ammo baapu gaari bommo
olammo mallepoola kommo
rubberu gaajula rangu theesindi
buggala anchuna erupu raasindi
ribbonu kattina gaali patamlaa nannegaresindi
ammo daani choopu gummo
olammo old monk  rummo..hai
pagadaala pedavultho padagottindee pillaa
katthulu leni yuddham chesi nanne gelichindi
ekamgaa yedapaine narthinchindee
abbaa natyam loni muddara chusi niddara naade poyindi
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo..ho ho

:::1

Monna meda meeda battalaaresthu
kooni raagamedo theesesthoo
pidikedu praanam pindeselaa pallavi paadinde pillaa
ninna coffee glassu chethikandisthu
naajukaina vellu thaakisthu
metthani matthula vidyuth theegai otthidi penchinde malla..hoy
kooralo vese popu naa oohallo vesesindi
oragaa choose choopu naavaipe anipisthundi
poolalo gucche daaram naa gundello gucchesindi
cheera chengu chivaranchullo nanne bandhee chesindi
poddu poddunne hello antundi
poddu pothe chaalu kallokosthundi
poddasthamaanam poyinantha dooram gurthosthuntundii
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha

:::2

Ye maayaa lokamlono nannu mellaga thosesindi
thalupulu moosindi thaalam pogettesindi
aa mabbula anchula daaka naa manasuni mosesindi
chappudu lekundaa nicchena pakkaku laagindi
thinnagaa gundenu patti guppita petti moosesindi
andame gandhapu gaalai mallee oopiri posindi
thiyyani mucchatalenno aalochanlo acchesindi
premane kalladdaalu choopulake thagilinchindi
kosala deshapu raajakumaari aashalu repina khandaala pori
poosala dandalo nanne gucchi mello vesindee
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo..O..