సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::శంకర్ మహదేవన్
పల్లవి::
హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్ రమ్మో..హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో..హో హో
చరణం::1
మొన్న మేడ మీద బట్టలారేస్తూ..కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ..నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా..హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ..పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే..ఓలమ్మో మల్లెపూల కొమ్మో
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
చరణం::2
యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో..ఓ..
Attarintiki Daredi--2013
Music::Devisri Prasad
Lyricist::Ramajogayya Sastry
Singer's::Shankar Mahadevan
:::
Hey bongaraalanti kallu thippindi
ungaraalunna juttu thippindi
gingiraaletthe nadumompullo nanne thippindee
ammo baapu gaari bommo
olammo mallepoola kommo
rubberu gaajula rangu theesindi
buggala anchuna erupu raasindi
ribbonu kattina gaali patamlaa nannegaresindi
ammo daani choopu gummo
olammo old monk rummo..hai
pagadaala pedavultho padagottindee pillaa
katthulu leni yuddham chesi nanne gelichindi
ekamgaa yedapaine narthinchindee
abbaa natyam loni muddara chusi niddara naade poyindi
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo..ho ho
:::1
Monna meda meeda battalaaresthu
kooni raagamedo theesesthoo
pidikedu praanam pindeselaa pallavi paadinde pillaa
ninna coffee glassu chethikandisthu
naajukaina vellu thaakisthu
metthani matthula vidyuth theegai otthidi penchinde malla..hoy
kooralo vese popu naa oohallo vesesindi
oragaa choose choopu naavaipe anipisthundi
poolalo gucche daaram naa gundello gucchesindi
cheera chengu chivaranchullo nanne bandhee chesindi
poddu poddunne hello antundi
poddu pothe chaalu kallokosthundi
poddasthamaanam poyinantha dooram gurthosthuntundii
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha
:::2
Ye maayaa lokamlono nannu mellaga thosesindi
thalupulu moosindi thaalam pogettesindi
aa mabbula anchula daaka naa manasuni mosesindi
chappudu lekundaa nicchena pakkaku laagindi
thinnagaa gundenu patti guppita petti moosesindi
andame gandhapu gaalai mallee oopiri posindi
thiyyani mucchatalenno aalochanlo acchesindi
premane kalladdaalu choopulake thagilinchindi
kosala deshapu raajakumaari aashalu repina khandaala pori
poosala dandalo nanne gucchi mello vesindee
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo..O..
No comments:
Post a Comment