Wednesday, October 16, 2013

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు--2013





సంగీతం::మిక్కీ జె మేయర్
రచన::అనంత శ్రీరామ్
గానం::చిత్ర

యేకువలోన గోదారి ఎరుపెక్కింది..ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
యేకువలోన గోదారి ఎరుపెక్కింది..ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది
పండిన చేతికెన్నో  సిగ్గులొచ్చి..ఆహా  సిగ్గంతా చీరకట్టింది
చీరలో చందమామ  ఎవరమ్మా..ఆ గుమ్మ సీతమ్మా

సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమో విరగబూసింది
కొమ్మ కదలకుండా కొయ్యండీ పూలు
కోసినవన్నీ సీత కొప్పూ చుట్టండీ
కొప్పూన పూలు గుప్పెటంతెందుకండీ
కోదండ రామయ్య వస్తున్నాడండీ

రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య..వస్తూ చేసాడమ్మ ఏదో మాయ
రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య..వస్తూ చేసాడమ్మ ఏదో మాయ

సీతకి రాముడే సొంతమయ్యే చోటిది..నేలతో ఆకాశం వియ్యమొందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చే నమ్మా..ఓ
ఏడు అంగాలేస్తే ఏడు జన్మాలకి వీడదీ సీతమ్మా..ఓఓఓఓఓఓఆఆఆఆ 

సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు..సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది
చిలకమ్మా ముద్దుగా చెప్పిందో మాట
ఆ మాట విన్నావా రామ అంటుంది
రామా రామా అన్నది ఆ సీత గుండె
అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే

చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంతా..చుట్టూ చెట్టు చేమ
పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మా..ఆఆఆఓఓఓ


Seethamma Vaakitlo Sirimalle Chettu--2013
Music::Mickey J Mayer
Lyricist::Anantha Sriram
Singer::Chitra


Yekuvalona godari erupekkindi..aa erupemo gorinta pantayyindi 
Yekuvalona godari erupekkindi..aa erupemo gorinta pantayyindi 
Pandina chethikenno siggulochi..ha siggantha cheerakattindi
cheeralo chandamama evvaramma..aa gumma seethamma

Seethamma vakitlo sirimalle chettu
sirimalle chettemo viragaboosindhi
komma kadalakunda koyyandi poolu
kosinavanni seetha koppu chuttandi
koppuna poolu guppe thanthenthukandi
kodanda ramayya vasthunnadandi

Rane vachadoyamma aa ramayya..vasthu chesadamma edo maaya 
Rane vachadoyamma aa ramayya..vasthu chesadamma edo maaya 

Seethaki ramude sonthamayye chotidi
nelatho aakasam viyyamondhe velidhi
moodu mullu vesthe moodu lokalaki muchatochenamma
yedu angalesthe yedu janmalaki veedadee seethaamma..OOOOOOAAAA 

Seethamma vakitlo sirimalle chettu
sirimalle chettupai chilaka vaalindi
chilakamma mudduga cheppindo maata
aa maata vinnava rama antundi
rama rama annadi aa seetha gunde
anna naade aameki mogudayyade

Chethilo chethule cherukunte sambaram
choopulo choopule leenamaithe sundaram
janta bagundantu gonthu vippayanta chuttu chettu chema
panta pandindantu pongi poyindamma idigo ee seethamma..AAAOOO

No comments: