Showing posts with label డాన్~~2005. Show all posts
Showing posts with label డాన్~~2005. Show all posts

Monday, May 26, 2008

డాన్~~2005


సంగీతం::లారెన్స్
రచన::చిన్ని చరణ్
గానం::హరీష్‌రాఘవేంద్ర

ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే నీ వ్హిరునవ్వూ
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే

నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే..నాకు తొలిసారి
ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే

నిన్ను చూస్తే నిన్న లేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కళలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన ఏదో హైరాన హైరాన
ఎంత మంది ఎదుట ఉన్నా ఒంటరి నవుతున్నా
ఈ అల్లరి నీదేనా నన్ను అల్లిన ధిల్లాన
అనుకున్నానా మరి నాలోన
ఈ నమ్మని కమ్మని కధ మొదలవునా
అందం ...అందం...

ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే..
అయిపోయాను డ్రీమ్‌ బాయ్‌ ...
పడిపోయాను డ్రీమ్‌ బాయ్‌ ...

మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్నా చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తు కలవర పడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై నీలా మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ బావం నిలిపేనా
అనుకున్నాన మరి నాలోనా నీ నమ్మని కమ్మని కధ
మొదలవునని అందం...అందం...

ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వూ
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వే
నా కన్నుల్లోన నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం
కనిపించే చిన్నారి ఈ అనుభవమే..నాకు తొలిసారి

డాన్~~2005


సంగీతం::లారెన్స్
రచన::చిన్ని చరణ్
గానం::హరిహరన్,రీట

నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా
నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా
ఆకాశం మనం తోడు
ఈ నేలే మన నీడే
నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా
ఆకాశం మనం తోడు
ఈ నేలే మన నీడే

ప్రాణమున్నదీ...నీ కోసం
ప్రేమ ఉన్నదీ...మన కోసం
నువ్వు నేనుగా నేను నువ్వుగా మారిపోయే రోజు
ఇదీ ప్రాణమున్నదీ విడిచిపోయినా మన ప్రేమే మారనిదీ
లోకాలే దాటి మనము పయనిద్దామా..ఈప్రేమ సాక్షిగా జీవిద్దామా
నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా
ఆకాశం మనం తోడు
ఈ నేలే మన నీడే

నేను ఉన్నదీ నీ కోసం నిన్ను చేరమన్నదీ ఈ క్షణం
గూడు గూటిలో గోడ కట్టినా నెలవంకవు నీవేలే
కాలి మువ్వలా దాని గుండెలో కనుగొన్నది నీవేలే
కాలాలు ఆగిపోనీ ఓ నాప్రేం ఈ క్షణమే తీరి పోనీ నా ఈ జన్మ
నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా
మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా
ఆకాశం మనం తోడు
ఈ నేలే మన నీడే