Friday, June 12, 2009

నాని--2004



రచన::సిరివెన్నెల
సంగీతం::AR.రెహమాన్
గానం::SP.బాలు,సుజాత


పుస్తకమంటు లేని తొలి చదువిది వెచ్చగ నెర్చుకుంటావ
ముద్దుగ నేర్పుతాను కద మరి నువు వెచ్చగ నెర్చుకుంటావ
నిద్దర మాని కష్టపడదామిక రావా

చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
ఎం చెప్పినా ఎం చూపినా ఎం చెప్పినా ఎం చూపినా
నువ్వు చుట్టుముట్టవేమి గబుక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున

ఇంతకు ముందర నాకెవరు చెప్పలేదు ఈ సంగతులు
కొద్దిగ నేర్పితె చాలసలు చూపుతాను కద చక చక నా జోరు
వెచ్చగ నేర్చుకుంటావ
చక్కెర ఎక్కడ నక్కిన

వెచ్చగ నెర్చుకుంటావ
కనిపెట్టవ చీమలు ఠక్కున
వెచ్చగ నేర్చుకుంటావ
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
ఎం చెప్పినా ఎం చూపినా ఎం చెప్పినా ఎం చూపినా
వచ్చి పట్టుకొమనకె చటుక్కున

గట్టు దిగను అంటుంటే ఈతంటూ వస్తుందా లోతెంతో నది చెబుతుందా
చెట్టు ఎక్కలేనంటే పండుకు జాలేస్తుందా నీ వళ్ళొ తను పడుతుందా
ఇక్కడ చల్లని నీళ్ళుంటే ఏ నదిలొ నే దూకాలి
పళ్ళెం నిండుగ పళ్ళుంటే చెట్టెందుకు నే ఎక్కాలి
నీళ్ళతొ ఆర్పలేని నిప్పుందని
వెచ్చగ నేర్చుకుంటావ
పళ్ళతొ తీర్చలెని ఆకలి కద
వెచ్చగ నేర్చుకుంటావ
నిద్దర మాని కష్టపడదామిక రావా

చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
ఎం చెప్పినా ఎం చూపినా ఎం చెప్పినా ఎం చూపినా
నువ్వు చుట్టుముట్టవేమి గబుక్కున

ఒకటి ఒకటి కలిపేస్తే ఒకటే అవుతుందంటా ఆ లెక్కిపుడే మొదలంట
పెదవి పెదవి కాటేస్తే పెదవులకెం కాదంట ఎదలోనే పెరుగును మంట
ఇప్పటికిప్పుడీ పొడుపు కథ విప్పాలనిపిస్తుందీ
ఇక్కడికిక్కడ ఆ సరదా చూడాలనిస్పిస్తుందీ
అందుకు మంచి దారి ఉన్నది కద
వెచ్చగ నేర్చుకుందాం రా
మన్మధ మంత్రమొకటి తెలియాలట
వెచ్చగ నేర్చుకుందాం రా
కౌగిలి లోనే నేర్పగల చదువిది రావా

చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
చక్కెర ఎక్కడ నక్కిన కనిపెట్టవ చీమలు ఠక్కున
ఎం చెప్పినా ఎం చూపినా
ఎం చెప్పినా ఎం చూపినా

వచ్చి పట్టుకొమనకె చటుక్కున
వెచ్చగ నేర్చుకుంటావ
వెచ్చగ నేర్చుకుంటావ
వెచ్చగ నేర్చుకుంటావ
వెచ్చగ నేర్చుకుంటావ రావా

నాని--2004



రచన::చంద్రబోస్
సంగీతం::AR.రెహమాన్
గానం::సాధన సర్గం,ఉన్నికృష్ణన్

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ

నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ

నా ఆలి అమ్మగా అవుతుండగా..జో లాలి పాడనా..కమ్మగా..కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ..
కదిలే దేవత అమ్మ..కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు..నా వొళ్ళో ఒదిగే బాబు..ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగుని పట్టేవాడు..నా కడుపున పుట్టే వాడు..ఇద్దరికీ ప్రేమ అందించనా

నా చిన్ని నాన్ననీ..వాడి నాన్ననీ..నూరేళ్ళు సాకనా..చల్లగా..చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూనా..ముద్దుల కన్నా జో..జో
బంగరు తండ్రీ..జో..జో..బజ్జో లాలి జో..
పలికే పదమే వినక కనులారా నిదురపో..
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

ఎదిగీ ఎదగని ఓ పసికూనా..ముద్దుల కన్నా జో..జో
బంగరు తండ్రీ..జో..జో..బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో.. బజ్జో లాలి జో..

నాని--2004



రచన::సిరివెన్నెల
సంగీతం::AR.రెహమాన్
గానం::హరిహరన్,హరిణి


వస్తా నీ వెనుక ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
వస్తా నీ వెనుక
ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా
ఏదైనా లేదనకా
వీలందించి వలపు నటించే వేడుక ఇది గనుకా హే వేడుక ఇది గనుకా
మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా

కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం రూపం
ఇకపై నా ప్రాణం ఇకపై నా ప్రాణం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
విడవకు ఈ నిముషం విడవకు ఏ నిముషం
వస్తా నీ వెనుక..ఎటైనా కాదనకా..ఇస్తా కానుకగా..ఏదైనా లేదనకా


నర నరం మీటే ప్రియ స్వరం వింటే
నర నరం మీటే ప్రియ స్వరం వింటే
నర నరం మీటే ప్రియ స్వరం వింటే
కాలం నిలబడదే కాలం నిలబడదే
కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
వొడిలో ఒకటైతే వొడిలో ఒకటైతే

పిస్తా ~~~ Pistha ~~ 2009



Director::Saba Ayyappan
Music Director::Manisharma
Producer::Priyan
Singer::Udit Narayan
Lyrics::Ananth Sriram

స్నేహ గీతం ~~ 2009



స్నేహ గీతం ~~ 2009
రచన::సిరాశ్రీ
గానం::కార్తీక్
సంగీతం::సునీల్ కష్యప్

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే
సంతోషమే మది నిండే
నవలోకమే పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో
ఏవో ఏవో ఏవేవో
ఎదురై నిలిచే కలలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

ధేయం ధ్యానం ఒకటై సాగే
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే
ఒక చెలిమి కోసం .....వేచే క్షణం
ఒక చెలియ కోసం .....జరిపే రణం

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

స్నేహం ప్రేమై మారే వైనం
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఒ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం
ఓ ఓ ఓఓఓ

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో

ఒక స్నేహమే మము కలిపే
ఒక బంధమే విరబూసే

హ్రుదయం లోనె మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎద పుటలపైన ఓ సంతకం
మది నదులు కలిసే ఈ సంగమం

ఏవో ఏవో ఏవేవో
ఎదలో కదిలే కధలేవో
ఏవో ఏవో ఏవేవో
ఎదురై నిలిచే కలలేవో

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::హేమచంద్ర ,శ్రావణ భార్గవి


కాదంటానా సరసం చేదంటానా
లేదంటానా అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా

మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక

హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే అందర్లోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

నా పరువం నీ కొరకే
హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో
మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
ధిమెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

ఏదో దాహం తహతహ లాడే దాహం
నీపై మోహం తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల విణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::శ్రీరామ చంద్ర,సుధా జీవన్


ఇట్స్ ఓకే లే
ఇది మాములే అనుకోవాలే
ఎదిరించాలే
చిరునవ్వుతో చీకటినోడించాలే
భరువెంతైనా అణువంతేలే
ఎదురీదాలే పద లే లే లే

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
నీతో బంధం కలిపే సంతోషం ఎదో
సొంతం కాదా నేడే రేపో
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
ఎవెర్య్థింగ్'స్ గొన్న బె అల్రిఘ్త్
ఎవెర్య్థింగ్'స్ గొన్న బె అల్రిఘ్త్

ఎండ వానలు జంట కానిదే..ఏడు రంగులు రావులే
ఎద గాయం గేయమైతే..వెదురైనా వేణువే
మదిలో తీపి కొలువుంటే
దరికే కలత రాదంతే
కన్నీరైనా పన్నీరైనా కనుపాపను నవ్విస్తే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

మోడువారిన కొమ్మ రెమ్మలు..కొత్త చిగురే చేరదా
నిండు కడలే ఆవిరైనా..నింగి చినుకై జారదా
కసిరే ఏకాంతమంటే ముసిరే స్నేహ పరిమళమే
నీలో ఎదిగే శూన్యంలో పిలుపేదో ఉందిలే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::కారుణ్య,ప్రణవి

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
చూపుతోనే రేగేనే ప్రేమనే భావన
చినుకులా కలిసేనా చిగురు తోడిగేనా
వరదలా ముంచేనా ఈ కలల ఆలాపన

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
నీ చూపుతోనే రేగేనే ప్రేమనే భావన

వద్దు గురువా ప్రేమ గొడవా.. జిందగీ సిందరవందర
కళ్ళు మూసి బ్లైండ్ గా సుందరి మోజు లో దెబ్బైపోకుర
రోమియో లా జూలియట్ తో డ్యూయట్టు కి ఏందిర తొందర?
సిన్సియర్ గా నువ్విలా పోయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోకురో

వెన్నెల మెరుపంటి సన్నజాజి సోయగమంతా
నీ కందిస్తా నిధిగా
తియ్యని ఎరుపౌతా నీ పెదాలనంటే ఉంటా
పోలేనంటా విడిగా

ఎదలయ మురిసే పిలుపుల వలలో ముడిపడిపోతా చనువుగా
కుదురును చెరిపే కులుకుల జతలో వసంతాలు చూస్తా
అందీ ఆనందం చెరి కొంత

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ కత్తెర కత్తెర
ఆచి తూచి బురదలో అడుగెయ్యొద్దురా అల్లరి గాకురో
మజ్ను లాగా ఫీల్ అయిపోయి లైలా తో లింకయిపోకురో
ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే పరువే పోద్దురో

లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
దణ్ణం పెడతా బిడ్వ పిల్లా గాలీ అస్లే వద్దు
లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
వద్దు వద్దు వద్దు వద్దు వద్దుర బాబు వద్దు

నాలో లోలోన నిన్ను బందీ చేసేస్తున్నా
మన్నిస్తావా మదనా
తెలుసా నా కన్నా ఎక్కువే నిను ప్రేమిస్తున్నా
తీరేదేనా తపన

ఒకరికి ఒకరై ఒదిగిన కధలో ఎవరెవరంటే తెలియదే
వెనుకటి రుణమే వదలని వరమై ఇలా చేరుకుందే
జన్మాలెన్నైనా చెలి నీదే

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ గజిబిజి గత్తర
ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే పోకురా
దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా
జరగబొయే సంగతి హిస్టరీ మనకు ముందే తెలిపెరా

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::దీపు,సునీత


నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన
హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన వలపు తననన
హే నువ్వే నువ్వే చోటడిగితే మనసున కాదనగలనా

ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..
ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
దిల్ తొ పాగల్ హై.....

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను
ఇద్దరున్నాం అంటుందెలా
పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను
ఒక్క చోట చేర్చిందిలా
తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా
అల్లుకుందే కొంటె వలా
నేనంతా నువ్వైపోయేలా

ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..
ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
దిల్ తొ పాగల్ హై.....


ఇన్నినాళ్ళు నీలోఎక్కడో ఏ మూలో
ఇంత ప్రేమ దాచావేలా
పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే
చిట్టి గుండె మోసేదెలా
ప్రేమంటేనే వింత కదా
భారమైనా తెలికైపోదా
సత్యభామా పద పద
నీ తోడై నేనున్నా కదా

ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..ఆయ..ఓ..ఓ..
ఓ..ఓ..ఏఅయియే..ఓ..ఓ..ఏఅయియే
దిల్ తొ పాగల్ హై.....

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

కిక్ ~~ ( Kick ) ~~ 2009


రచన::సిరివెన్నెల
సంగీతం::S.తమన్
గానం::వర్ధిని తమన్

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా

కంటికి కనపడు ప్రాణమా
గుండెకు వినబడు మౌనమా

మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా
సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా

ఆగని జీవన గానమా
ఆ దేవుని వరదానమా
పదములు కలిపావే తెలిసే అర్దం నువ్వేనా
పరుగులు అలిసావే కలిసే తిరం నీవేనా

కిక్ ~~ ( Kick ) ~~ 2009




రచన::సిరివెన్నెల
సంగీతం::S.తమన్
గానం::చిత్ర ,కోరస్

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే

అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఈ తలనొప్పేదైనా నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గాని మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ప్రేమని కదిలించావే తోచి తొచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా

అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

మునుపేనాడు ..ఏ కుర్రాడు ..పడలేదంటే నీ వెనకాల
వందలు వేలు..ఉండుంటారు..మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్ల
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్ళని తిడతావా

అందరిలాగా వాణ్ణీ విధుల్లో వదిలేసావా
గుండెల గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా

అటు చూడొద్దు అన్నానా మాటాడొద్దు అన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా

ఏ దారైనా..ఏ వేళైనా..ఎదురవుతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా..నిదురోతున్నా..కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏమ్ లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేం చెప్పిందే
అలకో ఉలుకో పాపమ్ ఒప్పుకునేందుకు ఇబ్బందే
తనకే నాకే కోపం కన్నెగ పుట్టిన నా మీదే

ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే
ధీం తన నాహిరే ధీం ధీం తన నాహిరే

Thursday, June 11, 2009

ప్రేమించేది ఎందుకమ్మ

Chinni Padala Chilukamma

ప్రేమించేది ఎందుకమ్మ



o chinnari chinukamma
nuvvu karigedhi eppudamma
o bangaru chilakamma
nuvvu egiredhi epudamma

neellaloni chepaki kaneellosthunnayani
cheppvaallu choopevaallu evarammaa
thana thadi theliyadhe thanakayinaa

oopiri aaviraayyi veguthunnadho
gundelo mabbule kammukunnavo
thelisedhela chinukammaki
vaakite vekuva vacchi vunnadho
kaatuke cheekatayyi aaputhunnadho
theledhela chilakammaki

ee janma khaidhevaru vesaaro
nee veedhi thalupevaru moosaro
kaalayina kadhapandhe thelisena
kanu reppa vidakundaa thelisena
melakuvane nidharanukune

oh chinnari

nithyamu chedhu gnyaapakaalalo
horune vintu unnaa jeevitham
vinedhela gunde savvadi
ninnati needale nindipoyinaa
choopulo ekkada chotu lenidhe
cheredhela repulannavi

nittoorupule oopiranukunte
muni mabbule thoorpulanukunte
ye amrutham jantakosthundhi
ye nammakam kantapaduthundhi
bathukante gathamanukune

oh chinnari

ప్రేమ లేఖలు --1991

Neeve Neeve Pranam Anta

సీతారామరాజు