Friday, June 12, 2009
బోణి ~~ 2009
సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::శ్రీరామ చంద్ర,సుధా జీవన్
ఇట్స్ ఓకే లే
ఇది మాములే అనుకోవాలే
ఎదిరించాలే
చిరునవ్వుతో చీకటినోడించాలే
భరువెంతైనా అణువంతేలే
ఎదురీదాలే పద లే లే లే
అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
నీతో బంధం కలిపే సంతోషం ఎదో
సొంతం కాదా నేడే రేపో
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు
అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
ఎవెర్య్థింగ్'స్ గొన్న బె అల్రిఘ్త్
ఎవెర్య్థింగ్'స్ గొన్న బె అల్రిఘ్త్
ఎండ వానలు జంట కానిదే..ఏడు రంగులు రావులే
ఎద గాయం గేయమైతే..వెదురైనా వేణువే
మదిలో తీపి కొలువుంటే
దరికే కలత రాదంతే
కన్నీరైనా పన్నీరైనా కనుపాపను నవ్విస్తే
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు
అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
మోడువారిన కొమ్మ రెమ్మలు..కొత్త చిగురే చేరదా
నిండు కడలే ఆవిరైనా..నింగి చినుకై జారదా
కసిరే ఏకాంతమంటే ముసిరే స్నేహ పరిమళమే
నీలో ఎదిగే శూన్యంలో పిలుపేదో ఉందిలే
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు
అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment