Friday, June 12, 2009

బోణి ~~ 2009



సంగీతం::రమణగోగుల
రచన::రామజోగయ్య శస్త్రి
గానం::హేమచంద్ర ,శ్రావణ భార్గవి


కాదంటానా సరసం చేదంటానా
లేదంటానా అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా

మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక

హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే అందర్లోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

నా పరువం నీ కొరకే
హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో
మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
ధిమెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

ఏదో దాహం తహతహ లాడే దాహం
నీపై మోహం తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల విణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా

No comments: