Showing posts with label Mr.పర్‌ఫెక్ట్--2011. Show all posts
Showing posts with label Mr.పర్‌ఫెక్ట్--2011. Show all posts
Monday, August 29, 2011
Mr.పర్‌ఫెక్ట్--2011
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::గోపికా పూర్ణిమ
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల..నేను
నన్ను చిన్న చూపు చూస్తే..ఊరుకోనూ
ఎందులోనూ నీకు నేను..తీసిపోనూ
నా సంగతేంటో తెలుసుకోవా..పోను పోనూ
అచ్చమయిన పల్లె రాణిపిల్ల..నేనూ
పచ్చి పైర గాలి పీల్చి..పెరిగినానూ
ఏరికోరి గిల్లికజ్జా..పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేనూ..హొయ్ హొయ్ హొయ్
హే సూటు బూటు స్టైలు..సుందరా
లేనిపోని డాబు..మానరా
ఈఊరిలో పైచేయి..నాదిరా
నా గొప్ప నువ్ ఒప్పుకో..తప్పులేదురా
రేవులోని తాడిచెట్టులా నీ..ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేలదించుకో.. ఓయ్..
Sunday, August 28, 2011
Mr.పర్‌ఫెక్ట్--2011
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::అనంత శ్రీరాం
గానం::సాగర్,మేఘ
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న..లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
రై రై రై రైడ్ చేసెయ్..రాకెట్ లా మనసునీ
సై సై సై సైడ్ చేసెయ్..సిగ్నల్స్ తో ఏం పని
ఇక హైవేలైన వన్‌వేలైనా..కదలదే బండి తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
పార్టీలా ఉంది నీతోటి ప్రతి క్షణం..ఎందుకంటే చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్ చెప్పే ప్రతి పదం..బాగుందబ్బ మాటల్లోన ముంచడం
రోల్ ఎన్ కోస్టర్ ఎంతున్నా..ఈ థ్రిల్ ఇస్తుందా జానా,
నీతో పాటు తిరిగేస్తుంటే..జోరే తగ్గేనా
కార్టూన్ ఛానెల్ లోనైనా..ఈ ఫన్ ఉందా బోలోనా
నీతోపాటూ గడిపేస్తుంటే టైమే..తెలిసేనా
ఇక సల్సాలైన సాంబాలైనా..కదలదే ఒళ్ళు తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
ఆన్‌లైన్‌లో నువ్ హై అంటే నా మది..క్లౌడ్ నైన్ లోకి నను తోస్తది
ఆఫ్‌లైన్‌లో నువ్వు ఉన్నావంటే మది..కోల్‌మైన్‌లోకి దూరేస్తది
ఏప్లేస్ఐనా గ్రీటింగ్‌కార్డ్‌లా కనిపిస్తుందే జానా..నాతో పాటు ఈ ఫీలింగు నీకూ కొత్తేనా
ఏరోజైనా వాలెంటైన్స్‌డే అనిపిస్తుందేమైనా..నాతో పాటూ అడుగేస్తుంటే నీకూ అంతేనా
ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా..గడవదే రోజు తేరేబినా
ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన..మోగుతోంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న..లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక
Mr.పర్‌ఫెక్ట్--2011
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::అనంత శ్రీరాం
గానం::శ్రేయా ఘోషాల్
ఓ చలి చలిగ అల్లింది..గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది..మనసు
చిటపట చిందేస్తుంది..అటు ఇటు దూకేస్తుంది
సతమతమైపోతుంది..వయసు
చిన్ని చిన్ని చిన్ని చిన్ని..ఆశలు ఏవేవో
గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి..పోతున్నాయీ
చిట్టి చిట్టి చిట్టి చిట్టి ఊసులు..ఇంకేవో
గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయీ
నువ్వు నాతోనే ఉన్నట్టు..నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు..నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు..ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు
ఓ చలి చలిగ అల్లింది..గిలి గిలిగ గిల్లింది
నీ వైపే మళ్ళింది..మనసు
గొడవలతో మొదలై..తగువులతో బిగువై
పెరిగిన పరిచయమే..నీది నాది
తలపులు వేరైనా..కలవని తీరైనా
బలపడి పోతుందే..ఉండేకొద్దీ
లోయలోకి..పడిపోతున్నట్టు
ఆకాశం పైకీ..వెళుతున్నట్టు
తారలన్ని..తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు..ఏమైనట్టు
నువ్వు నాతోనే ఉన్నట్టు..నా నీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు..ఊహలు
నువ్వు నా ఊపిరైనట్టు..నా లోపలున్నట్టు
ఏదో చెబుతున్నట్టు..ఏవో కలలు
నీపై కోపాన్నీ అందరి ముందైనా
బెదురే లేకుండా..తెలిపే నేను
నీపై ఇష్టాన్నీ నేరుగ..నీకైనా
తెలపాలనుకుంటే..తడబడుతున్నాను
నాకు నేనే దూరం అవుతున్నా
నీ అల్లరులన్నీ..గుర్తొస్తుంటే
నన్ను నేనే..చేరాలనుకున్నా
నా చెంతకి నీ అడుగులు..పడుతూ ఉంటే
నువ్వు నాతోనే ఉన్నట్టు..నానీడవైనట్టు
నన్నే చూస్తున్నట్టు ఊహలు..నువ్వు నా ఊపిరైనట్టు
నా లోపలున్నట్టు..ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు .
Subscribe to:
Posts (Atom)