Sunday, December 13, 2009

ఎవరైనా ఎపుడైనా ~~ 2009

ఎవరైనా ఎపుడైనా ~~ 2009సంగీతం::మణిశర్మ
రచన::వెన్నెలకంటి
గానం::హేమచంద్ర ,మాళవిక

నీలాలు కారు కనులలో..కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం

నిన్నే ప్రేమించా గుండే లోతులా
నిన్నే బాధించా గుండె కోతలా
పువ్వే ఇచ్చాను ఒక నాడలా
ముల్లై గుచ్చానే నిన్ను నేడిలా
నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం

నిదురపోవు నిజములో మేలుకొన్న కలలలో
నిజమైనా కల అయినా ఇదేనా
దూరమైన పిలుపులో చేరువైన వలపులో
కలకాలం నిలిచేది కధేనా
నింగికి నేలకు కలిసే అలవాటు లేదులే
కడలికీ నదికి ఎపుడు ఎడబాటు రాదులే

నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం

పలుకు నీవు మెల్లగా మనసు తోడు చేరగా
నీ కోసం బతికున్నా ఇన్నాళ్ళుగా
మనసు నిన్ను వీడగా కారే నీరు ధారగా
ఎడబాటే కలిగింది చేదుగా
మనసైన నువ్వే నన్నే ద్వేషించినావులే
ఇటువంటి నిన్నే నేను ఊహించలేదు

నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం

Saturday, December 12, 2009

జోష్ ~~~ 2009

జోష్ ~~~ 2009సంగీతం::సందీప్ చౌట
రచన::
గానం::విఠల్ రాహుల్

కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
ఉన్నది ఎక్కువేర,లేనిది తక్కువేర--2
ఉన్నదంతా ఊడిన పుడింగు నువ్వేరా..ఒరేయ్..నువ్వు పుడింగువేర
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

చదువులన్ని మూల పెట్టి పుస్తకాలు మూట కట్టి, సిగేరెట్టే చేత బట్టి చింపాంజి ఫోజే పెట్టి
రంకెలు వేస్తావు రాగ్గింగులు చేస్తావు, రోతగా చూస్తావు భూతు జోకులేస్తావు రమేశ..అరె రాధా రమేశ
నీ ప్యుచర్ పంచరోయ్ నా రామేశ,ఫ్యాన్ ఫోలోఇంగ్ పెరుగుతాది రామేసో రమేశ..
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

అన్నా అన్నా అంటు నువ్వు అన్నా వెనుక ఉంటావు
అన్నా ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు
బందులు చేస్తావు బస్ లు తగలేస్తావు, కొట్టులు మూస్తావు కొట్లాటకు లేస్తావు గనేస..గుణ గణ గణేశ
నీ ఎనర్జంత వేస్ట్ ఐన గణేశ..నీకు experience వస్తుంది గనేశో గణేశ..
కాలేజీ హోయ్ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

మాదక ద్రవ్యల్లోన మాస్టర్ గ మారినావు, డోపింగ్ విభాగం లో డాక్టరేట్ పొందినావు
దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు,లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు సురేశా..సురేశా
నీ హెల్త్ అంత ఖరాబు ఐన సురేశ..స్వర్గం హైటెంతో తెలుసుతుంది సురేసా హో సురేశా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా

ఇఫోనే చేతిలోన ఐపాడు చెవిలోన,కాలేమో బైక్ పైన కళ్లు ఏమో ఆకాసాన
ఓ హోయ్..ఓ హోయ్..
పార్టీలంటావు pub ల్లో ఉంటావు,పాల్సు ప్రేష్టేజికి పాకులాడుతుంటావు ప్రకాశా..అరై లేరా ప్రకాశ
నే కన్నోళ్ళ కన్నీళ్లను ప్రకాశా..నీ perfume బాటిల్ ల్లో కలుపు ప్రకశో ప్రకాశ

జోష్ ~~~ 2009సంగీతం::సందీప్ చౌట
రచన::
గానం::సౌమ్య రావ్

నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట

నువ్వు చూసొచ్చిన ప్రతి వింతా
నేనేవ్వరికి చేపోద్దా
నీ ఊసులనే ఊ కొడుతూ వింటా
ఒక్క చోట నిలవోద్దు అంటు తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావ సాయపడతావా 2

నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట

వేళ పాల గోలి మార్ విసిరేసా చూడు బాచి ని
అపుడప్పుడు నవ్వుతామ టైం టేబుల్ వేసుకొని
దాగుడు మూత దండకోరు
ఎవ్వరికి జాడ చెప్పమని
యిట్టె తప్పించుకోమ ఆపేసే చూపుల్ని
పద్దతంటు పట్టించుకోని పాటల్లె సాగని పొద్దంతా
వొద్దు అంటు ఆపేది ఎవ్వరంటా
కాటుక పిట్టల్లా కల్లగిరి వాలిన చోటెల్లా
ఎన్ని వర్ణాల్లో చూడిల్లా తెలుగు పువ్వుల్లా

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా

కిటికీ లోంచి చూడాలా కదిలల్లె అన్ని ఋతువుల్నీ
చెయ్యరా తాకరాద వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురోచే చిన్ని ఆశలనీ
గుండెల్లో చోటు లేదా ఊరించే ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశం అందుకుంటా

ఎల్లలు ఆగేనా అల్లరిగా దూగే వేగాన
అదుపులో ఉంచే వీల్లేదా నన్ను నేనైనా

ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా

నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట 2

Friday, December 11, 2009

గణేష్--2009సంగీతం::మిక్కి,J.మెయిర్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::శ్రీ మధుమిత

యేలే...యేలే...యేలే...యేల్లెల్లెలెలె

యేలే...యేలే...యేలే...యేల్లెల్లెలెలె

తెలిసిన మాటే వింటుంటే మళ్ళి కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమైతే చాలా సంబరపడుతున్నా
చూస్తూ చూస్తునే నవ్వే మువ్వై పోతున్నా....
చినుకైన తడిసేటి వానా వానా
మనసంతా కురిసేనా ఈ సమయాన
హరివిల్లై కనిపించే నా నీడైన
తనువంతా మునిగింది ఆనందాన
యేలే...యేలే...యేలే...యేల్లెల్లెలెలె

యేలే...యేలే...యేలే...యేల్లెల్లెలెలె

నేనింతగా ఎపుడైన కేరింతలో మునిగానా
నీ చిత్రమై కదిలించవిల్లా.....హో...
నీ చెంతనే ఎదలోనా నే ఇప్పుడై మునిగేనా
గాల్లో ఇలా పరుగైనా....హా...

లరలల్ లరలల్ లరలల్ లరలల్ లల్ లల్ ల్ల్ లలన
లరలల్ లరలల్ లరలల్ లరలల్ లల్ లల్ ల్ల్ లలన
లరలల్ లరలల్ లరలల్ లరలల్ లల్ లల్ ల్ల్ లలన
లరలల్ లరలల్ లరలల్ లరలల్ లల్ లల్ ల్ల్ లలన

లరలల్ లరలల్ లరలల్ లరలల్ లల్ లల్ ల్ల్ లలన
తెలిసిన మాటే వింటుంటే మళ్ళి కొత్తగ వింటున్నా
కలగన్నట్టే నిజమైతే చాలా సంబరపడుతున్నా

Wednesday, December 9, 2009

కార్తీక్

గానం::సందీప్, ఉష

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా
ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

హృదయాలు పాడే ఈ ప్రేమ గీతం సాగే సదా

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

ఏ మాయ చేసింది ఈ జాబిలమ్మ
ఏ మాయ చేసింది ఈ జాబిలమ్మ
ఏ మత్తు చల్లింది ఈ వెన్నెలమ్మ
ఎదలో సితారా..పలికే ఈ వేళా..నాలోని లోకాన నీ గానమే

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

చిరుగాలిలా నన్ను తాకింది ప్రేమా
చిరుగాలిలా నన్ను తాకింది ప్రేమా
సిరిమల్లెలా మనస్సు దోచింది ప్రేమా
ప్రేమంటే నీవే..ప్రేమించరావే..నీ ప్రేమ నా శ్వాసగా మారగా

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా

నువు లేక క్షణమైన నేనుండలేనూ..
నువు లేక క్షణమైన నేనుండలేనూ..
నువు తోడు లేకున్న నే నేను కానూ..
ఏ జన్మకైనా నీ నీడ చాలు..ఆపైన కోరేది ఏముందిలే

ఈ రేయి..ఈ హాయి..నీ మాయ కాదా..ఇది ప్రేమే కదా