Sunday, December 13, 2009
ఎవరైనా ఎపుడైనా ~~ 2009
సంగీతం::మణిశర్మ
రచన::వెన్నెలకంటి
గానం::హేమచంద్ర ,మాళవిక
నీలాలు కారు కనులలో..కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం
నిన్నే ప్రేమించా గుండే లోతులా
నిన్నే బాధించా గుండె కోతలా
పువ్వే ఇచ్చాను ఒక నాడలా
ముల్లై గుచ్చానే నిన్ను నేడిలా
నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం
నిదురపోవు నిజములో మేలుకొన్న కలలలో
నిజమైనా కల అయినా ఇదేనా
దూరమైన పిలుపులో చేరువైన వలపులో
కలకాలం నిలిచేది కధేనా
నింగికి నేలకు కలిసే అలవాటు లేదులే
కడలికీ నదికి ఎపుడు ఎడబాటు రాదులే
నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం
పలుకు నీవు మెల్లగా మనసు తోడు చేరగా
నీ కోసం బతికున్నా ఇన్నాళ్ళుగా
మనసు నిన్ను వీడగా కారే నీరు ధారగా
ఎడబాటే కలిగింది చేదుగా
మనసైన నువ్వే నన్నే ద్వేషించినావులే
ఇటువంటి నిన్నే నేను ఊహించలేదు
నీలాలు కారు కనులలో కలతగా కరిగెనే..జీవితం
కాలాలు మారి వలపులే వగపుగా మిగిలెనే నా గతం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment