Showing posts with label స్వాగతం ~~ 2008. Show all posts
Showing posts with label స్వాగతం ~~ 2008. Show all posts

Sunday, May 3, 2009

స్వాగతం ~~ 2008

స్వాగతం ~~ 2008




డైరెక్టర్::దాశరథి
ప్రొడ్యుసర్::ఆదిత్య రాం
రచన::అభినయ శ్రీనివాస్
సంగీతం::R.P.పట్నాయక్
గానం::కార్తీక్,చిత్ర


మనసా మౌనమా..మదిలో రాగమా
మనసా..క్షేమమా..మనిషే ప్రాణమా
చిగురులు వేసే చైత్రమా..చినుకై రాలే మేఘమా
చెరగని కావ్యం బంధమా..తరగని దూరం కాలమా
ఎదలోతుల్లో ఆనందమా ....

మనసా..మౌనమా..మదిలో రాగమా...
మనసా....మౌనమా...

నీలాకాశం సావాసంతో తారాలోకం సాగేవేళ
ప్రేమావేశం ప్రాణం పోసే గుండెల్లోనా
సాయంసంధ్యా నారింజల్లో సాయం కోరే నీరెండల్లో
తోడూ నీడా ఈడూ గూడూ నీవే కదా
వలచీ..పిలిచే..నాలో ఆశవైనా శ్వాసవైనా నీవే మైనా

మనసా..మౌనమా..మదిలో రాగమా
మనసా...క్షేమమా..మనిషే ప్రాణమా
Few say It’s Lust..
Few say It’s Love..
For me It’s You..Only You

భూజం బంతీ బుగ్గల్లోన..రోజారంగు సిగ్గుల్లోన
నీ అందాలా శ్రీగంధాలే పూసే వేళ
మాటేలేని కన్నుల్లోన..పాట పాడే పాపల్లోన
నీ చూపుల్లో నే బందీగా చిక్కే వేళా
జతగా..శృతిగా..అనురాగం యోగం ఏకం అయ్యే సంతోషాన

మనసా..మౌనమా..మదిలో రాగమా
మనసా..క్షేమమా..మనిషే ప్రాణమా