Showing posts with label అనంతపురం 1980 ~~ 2009 ~~ రాగం:::ఆనందభైరవి. Show all posts

Tuesday, August 4, 2009

అనంతపురం 1980 ~~2009 ~~ రాగం:::రీతిగౌళ:::

సంగీతం::జేమ్స్ వసంతం
రచన::వెన్నెలకంటి
గానం::బెల్లిరాజ్,

రాగం:::రీతిగౌళ:::

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

పగలే రేయయిన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈవేళ ఇరువురి దూరాలు తరగనీ
ఒడిలో వాలాలనున్నదీ వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మొమాటం ఇది

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే