Sunday, May 13, 2007
నేనున్నాను~~2004
సంగీతం::కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::టిప్పు,చిత్ర
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ. . .
ఏటేటో అవుతాది చిన్నమ్మీ
అట్టాగే వుంటాది ఓరబ్బీ. . .
ఏటేటో అవుతాది చిన్నబ్బీ. . .
ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది
నువ్వట్టానరాలు మెలేసి నడుస్తువస్తుంటే
సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది
చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే
కొంపలు ముంచకు దుంప తెగ
కోకకు పెంచకు కొత్తసెగ
గమ్మత్తుగ మత్తెకించే వేళ. . .
నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ . . .
పైటెక్కడుంటుందే చిన్నమ. . .
నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ. . .
పైటెక్కడుంటుందే చిన్నమ
అట్టాగే వుంటాది ఓరబ్బీ
ఏటేటో అవుతాది చిన్నబ్బీ
కళ్లల్లో అదేమికైపో నడకల్లో అదేమి ఊపో
నిలువెల్లా తెగించి తెగించి ఎగబడి పోతుంటే
ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో
వాటంగా వయస్సువలేసి తికమక పెడ్తుంటే
తూలకు తూలకు తిమ్మిరిగా
తుళ్లకు తుళ్లకు తుంటరిగా
ఒళ్లంతా గల్లంతై పోయేలా జడవూప. . .
నడువూపి. . .నిగనిగ నిధులు చూపి
నువ్వు వీరంగం వేస్తుంటే ఓలమ్మీ ఊరంతా ఊగిందే చిన్నమ్మీ
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ. . .
ఏటేటో అవుతాది చిన్నమ్మీ
అట్టాగే వుంటాది ఓరబ్బీ. . .
ఏటేటో అవుతాది చిన్నబ్బీ. . .
Saturday, May 12, 2007
నేనున్నాను~~2004~~రాగం::మోహన !!
సంగీతం::MM.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::చిత్ర
!!!! రాగం::మోహన !!!!
వేణు మాధవా.....ఆ ..ఆ..
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ శ్వాస లో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరని మాధవా..ఆ..ఆ..
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా..మురళీ సఖి
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే..
తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిది వెదురు తాను పొందింది
వేణు మాధవా నీ సన్నిధి.....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలు వైపుల నడి రాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగులుసడి వినబడక హృదయానికి
అలజడితో అణువణువు తడబడదా..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నువ్వే నడుపు పాదమిది
నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిముషమిది
వేణు మాధవా నీ సన్నిధి...
గా గ రి గ రి స రి గా గ రి రి స రి
గ గ ప ద సా స ద ప గ రి స రి
గ గ దప దా ప ద ప ద స దా ద ప గ రి గా
గ ప ద స స గ ప ద స స
ద ప ద రి రి ద ప ద రి రి
ద స రి గ రి స రి
గ రి స రి గ రి గ రి స రి గా
రి స ద ప గ గ గ పా పా
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప ద రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గ
స రి గ ప ద రి గా
రాధికా హృదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
ఈ గీతాంజలి
Friday, May 11, 2007
నేనున్నాను~~2004
సంగీతం::MM.కీరవాణి
రచన::సీతారామ శాస్త్రి
గానం::కాయ్ కాయ్,శ్రేయ గోషల్
వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి ...ఓం ధిరి...ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి ఓం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం
ఓం ధిరి ...ఓం ధిరి ...ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి ఓం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా...నీకోసం నీకోసం నీ...
కోసం...నీకోసం నీకోసం నీ...కోసం
నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి
నే పండుగ చేసి సందడిలోన ఆకు వక్కా సున్నం నీ కోసం..
నీకోసం నీకోసం నీ...కోసం...నీకోసం నీకోసం నీ...కోసం
గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా
ఉన్న పాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాట లేదుగా
కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా
తీగచాటుగా...మూగపాటగా ఆగిపోకే రాగమాలికా
నిలువెల్ల నీ జతలోనా చిగురించు లతనైరానా
కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా
అమ్మమ్మో అబ్బబ్బో ఆముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా
నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం..
నీకోసం నీకోసం నీ...కోసం...నీకోసం నీకోసం నీ...కోసం..
సిగ్గుపోరికా నెగ్గలేదుగా ఏడమల్లెలెత్తు సుకుమారమా
సాయమీయకా మొయలేవుగా లేత సోయగాల భారమా
కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా
తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా
మునిపంటి ముద్దురకానా చిగురింటి పెదవులపైనా
మురిపాల మువ్వనుకానా దొరగారి నవ్వులలోనా
నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆహద్దులు దాటించి
నువ్వొద్దనలేని పద్ధతిలోనే ముద్దులెన్నో తెచ్చా నీ కోసం ..
నీకోసం నీకోసం నీ...కోసం..నీకోసం నీకోసం నీ...కోసం..
వేసవి కాలం వెన్నెలాగా వానల్లో వాగుల్లాగ వయసు ఎవరికోసం
ఓం ధిరి ...ఓం ధిరి...ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి ఓం ధిరి
శీతాకాలం ఎండల్లాగ సంక్రాంతి పండుగలాగ సొగసు ఎవరికోసం
ఓం ధిరి ...ఓం ధిరి ...ఓం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి ఓం ధిరి
ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా...నీకోసం నీకోసం నీకోసం
నీకోసం...నీకోసం... నీకోసం నీకోసం నీకోసం
నీకోసం...నీకోసం...