Showing posts with label జోష్ ~~~ 2009. Show all posts
Showing posts with label జోష్ ~~~ 2009. Show all posts
Saturday, December 12, 2009
జోష్ ~~~ 2009
సంగీతం::సందీప్ చౌట
రచన::
గానం::విఠల్ రాహుల్
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
ఉన్నది ఎక్కువేర,లేనిది తక్కువేర--2
ఉన్నదంతా ఊడిన పుడింగు నువ్వేరా..ఒరేయ్..నువ్వు పుడింగువేర
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
చదువులన్ని మూల పెట్టి పుస్తకాలు మూట కట్టి, సిగేరెట్టే చేత బట్టి చింపాంజి ఫోజే పెట్టి
రంకెలు వేస్తావు రాగ్గింగులు చేస్తావు, రోతగా చూస్తావు భూతు జోకులేస్తావు రమేశ..అరె రాధా రమేశ
నీ ప్యుచర్ పంచరోయ్ నా రామేశ,ఫ్యాన్ ఫోలోఇంగ్ పెరుగుతాది రామేసో రమేశ..
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
అన్నా అన్నా అంటు నువ్వు అన్నా వెనుక ఉంటావు
అన్నా ఒక్క మాట చెబితే అన్ని కానిస్తావు
బందులు చేస్తావు బస్ లు తగలేస్తావు, కొట్టులు మూస్తావు కొట్లాటకు లేస్తావు గనేస..గుణ గణ గణేశ
నీ ఎనర్జంత వేస్ట్ ఐన గణేశ..నీకు experience వస్తుంది గనేశో గణేశ..
కాలేజీ హోయ్ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
మాదక ద్రవ్యల్లోన మాస్టర్ గ మారినావు, డోపింగ్ విభాగం లో డాక్టరేట్ పొందినావు
దగ్గే పెరిగేలా డ్రగ్స్ తీసుకున్నావు,లివరు పోయేలా లిక్కరు లాగిస్తావు సురేశా..సురేశా
నీ హెల్త్ అంత ఖరాబు ఐన సురేశ..స్వర్గం హైటెంతో తెలుసుతుంది సురేసా హో సురేశా
కాలేజీ బుల్లోడా ఖలేజా ఉన్నోడా..స్టూడెంట్ కుర్రోడా టాలెంట్ ఉన్నోడా
ఇఫోనే చేతిలోన ఐపాడు చెవిలోన,కాలేమో బైక్ పైన కళ్లు ఏమో ఆకాసాన
ఓ హోయ్..ఓ హోయ్..
పార్టీలంటావు pub ల్లో ఉంటావు,పాల్సు ప్రేష్టేజికి పాకులాడుతుంటావు ప్రకాశా..అరై లేరా ప్రకాశ
నే కన్నోళ్ళ కన్నీళ్లను ప్రకాశా..నీ perfume బాటిల్ ల్లో కలుపు ప్రకశో ప్రకాశ
జోష్ ~~~ 2009
సంగీతం::సందీప్ చౌట
రచన::
గానం::సౌమ్య రావ్
నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట
నువ్వు చూసొచ్చిన ప్రతి వింతా
నేనేవ్వరికి చేపోద్దా
నీ ఊసులనే ఊ కొడుతూ వింటా
ఒక్క చోట నిలవోద్దు అంటు తెగ తరుముతున్న ఈ ఉత్సాహం
దారి కోరి నిన్నడుగుతుంది స్నేహం
ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావ సాయపడతావా 2
నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట
వేళ పాల గోలి మార్ విసిరేసా చూడు బాచి ని
అపుడప్పుడు నవ్వుతామ టైం టేబుల్ వేసుకొని
దాగుడు మూత దండకోరు
ఎవ్వరికి జాడ చెప్పమని
యిట్టె తప్పించుకోమ ఆపేసే చూపుల్ని
పద్దతంటు పట్టించుకోని పాటల్లె సాగని పొద్దంతా
వొద్దు అంటు ఆపేది ఎవ్వరంటా
కాటుక పిట్టల్లా కల్లగిరి వాలిన చోటెల్లా
ఎన్ని వర్ణాల్లో చూడిల్లా తెలుగు పువ్వుల్లా
ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా
కిటికీ లోంచి చూడాలా కదిలల్లె అన్ని ఋతువుల్నీ
చెయ్యరా తాకరాద వేకువని వెన్నెల్ని
గుమ్మం బయటే ఆపాలా ఎదురోచే చిన్ని ఆశలనీ
గుండెల్లో చోటు లేదా ఊరించే ఊహలకి
పంజరాన్ని విడిపించుకున్న బంగారు చిలకనై ఈ పూట
ఎగిరి ఎగిరి ఆకాశం అందుకుంటా
ఎల్లలు ఆగేనా అల్లరిగా దూగే వేగాన
అదుపులో ఉంచే వీల్లేదా నన్ను నేనైనా
ఆవర హవా అదిరి పడి ఓవర అంటావా
హాయిగా నాతో వొస్తావా సాయపడతావా
నువ్వేల్లని చోటుంటుందా
నువ్వేరుగని మాటుంటుందా
గాలి నన్ను రాని నీ వెంట 2
Monday, August 10, 2009
జోష్ ~~~ 2009
సంగీతం::సందీప్ చౌట
రచన::సిరివెన్నెల
గానం::కార్తీక్
డైరెక్టర్::వాసు వర్మ
ప్రొడ్యుసర్::దిల్ రాజు
నటీ,నటులు::కార్తీక,నాగచైతన్య
నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఏమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చలు
మున్ముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా
నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు
సెలయేళ్ళు చిత్రంగా నీ వైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు
రాగాలూ నీలాగ నలువైపులా
భూమి అంతా నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంతా నీ తరంగానికి సొమ్మసిల్లిపోదా
చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చెదైన తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
నీతో ఉంటే ఇంక కోనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నువ్వేం చూస్తున్న యెంతో వింతల్లే
అన్ని గమనించే ఆశ్చర్యమా
ఏ పని చేస్తున్నా ఏదో
ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చుపుల్లో కొలువు ఉండి పోగా
చీకటన్నది ఇక రాలేదే నీ కంటి పాప దాకా
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల
నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వలా గుంపై వాలు
కాలన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా
నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు
Subscribe to:
Posts (Atom)