Friday, September 5, 2008

కొత్తబంగారులోకం--2008::Kotta Bangaru Lokam--2008

సంగీతం::మిక్కీJ.మేయర్రచన::సిరివెన్నెలగానం::నరేష్ అయ్యర్,కళ్యాణి

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా


భారమంతా నేను మోస్తా అల్లుకోవాశాలతా
చేరదీస్తా సేవ చేస్తా రాణిలా చూస్తా
అందుకేగా గుండెలోనే పేరు రాశా

తెలివనుకో తెగువనుకో మగజన్మకలా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా


ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా
ఓ కే అనేశా దేఖో నా భరోసా
నీకే వదిలేశా నాకెందుకులే రభసా


పరిగెడదాం పదవె చెలీ..ఎందాక అన్నానా
కనిపెడదాం తుది మజిలీ..ఎక్కడున్నా
ఎగిరెళదాం ఇలనొదిలీ..నిన్నాగమన్నానా
గెలవగలం గగనాన్నీ...ఎవరాపినా
మరోసారి అను ఆ మాటా మహారాజునై పోతాగా
ప్రతి నిమిషం నీకోసం ప్రాణం సైతం పందెం వేసేస్తా


ఆ తరుణమూ కొత్త వరమూ చెంగుముడి వేసిందిలా
చిలిపితనమూ చెలిమి గుణమూ ఏవిటీ లీల
స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా

అదిగదిగో మది కెదురై కనబడలేదా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా


పిలిచినదా చిలిపి కలా
వింటూనే వచ్చేశా
తరిమినదా చెలియనిలా
పరుగు తీశా
వదిలినదా బిడియమిలా
ప్రశ్నల్ని చెరిపేసా
ఎదురవదా చిక్కు వలా
ఎటో చూశా

భలేగుందిలే నీ ధీమా ఫలిస్తుందిలే ఈ ప్రేమా
అదరకుమా బెదరకుమా
త్వరగా విడిరా సరదా పడదామా


పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినా నా ప్రియతమా
చిక్కునుంటే బిక్కుమంటూ లెక్క చేస్తాగా
చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా


మమతనుకో మగతనుకో మతి చెడి పోదా
కధ మొదలనుకో తుదివరకూ నిలబడగలదా

♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥    

Kotha Bangaru Lokam--2008
Music::Micky J.Meyer
Lyrics::Sirivennela
Singer's::Naresh Iyer,Kalyani

:::

Ok anesaa dekho naa bharosaa
Neeke vadhilesaa naakendhukule rabhasaa
Ok anesaa dekho naa bharosaa
Neeke vadhilesaa naakendhukule rabhasaa ..  

Bhaaramanthaa nenu mosthaa
Alluko aasaalatha
Cheradeesthaa seva chesthaa raanilaa choosthaa
Andhukega gundelo nee peru raasaa
Thelivanuko theguvanuko magajanma kadhaa
Kadha modhalanuko thudhi varaku nilabadagaladhaa ..  

Ok anesaa dekho naa bharosaa
Neeke vadhilesaa naakendhukule rabhasaa
Ok anesaa dekho naa bharosaa
Neeke vadhilesaa naakendhukule rabhasaa ..  

:::1

Parigedadhaam padhave cheli - endaaka annaana
Kanipedadhaam thudhi majilii - ekkadunnaa
Egireladhaam iilanodhilii - ninnaagamannaanaa
Gelavagalam gaganaanni - evaraapinaa
Marosaari anu aa maata
Mahaaraajunai pothaagaa
Prathi nimisham neekosam
Praanam saitham pandhem vesesthaa
Paatha runamo kothavaramo janma mudi vesindhilaa
Chilipithanamo chelimi gunamo yemitii leela
Swapnalokam yelukundhaam raagamaala
Adhigadhigo madhikedhurai kanabadaledhaa
Kadha modhalanuko thudhi varaku nilabadagaladhaa ..  

:::2

Pilichinadhaa chilipi kalaa - vintoone vachhesaa
Thariminadhaa cheliyanilaa - parugu theesaa
Vadhilinadhaa bidiyamilaa - prashnalni cheripesaa
Edhuravadhaa chikku valaa - yeto choosaa
Bhalegundhilaa nee dheemaa
Phalistundile ee premaa
Adharakumaa bedharakumaa
Paradhaa vidiraa saradhaa padadhaamaa
Pakkanunte phakkumantuu navvinaadaa priyathamaa
Chikkulunte bikkumantuu lekka chesthaamaa
Chukkalannii chinnabovaa chakkanammaa
Mamathanuko magathanuko mathi chedipodaa
Kadha modhalanuko thudhi varaku nilabadagaladhaa .. ♥

కొత్తబంగారులోకం -- 2008సంగీతం::మిక్కీ,J.మేయర్
రచన::అనంతం శ్రీరాం
గానం::కార్తీక్


నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా..ప్రేమేనా..ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరీ..అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై..నన్నే తోస్తున్నారా


హరే హరే హరే హరే రామా మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా ఏమ్మా
హరే హరే హరే హరే రామా మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా ఏమ్మా
నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా..ప్రేమేనా..ఎన్నో వింతలు చూస్తున్నా


ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకి ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం


అడుగులలోనా అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదూ గడచిన కాలం
ఇంతని నమ్మనుగా


నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా..ప్రేమేనా..ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
నా ? కవ్వింతలై పిలుస్తూ ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే


పెదవికి చెంపా తగిలిన చోటా
పరవశమేదో తోడౌతుంటే
పగలే అయినా గగనం లోనా
తారలు చేరెనుగా


నిజంగా..నేనేనా..ఇలా నీ జతలో ఉన్నా
ఇదంతా.. ప్రేమేనా .. ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరీ అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా


హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా ఏమ్మా
హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
ఎంతో హుషారేదో ఉన్నాదేదో లోనా ఏమ్మా

కొత్తబంగారులోకం -- 2008సంగీతం::మిక్కీ,J.మేయర్
రచన::సిరివెన్నెల
గానం::శ్వేతా ప్రసాద్
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥
నేననీ..నీవనీ..వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

మొదటిసారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుకా..
అనేటట్టుగా ఇది నీ మాయేనా


నేననీ..నీవనీ..వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే


పదము నాది పరుగు నీది రిధము వేరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడకా వెను వెంటే రానా


నేననీ..నీవనీ..వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడనీ..నువ్వు నా నిజమనీ
ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్పవెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే...
♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥…♪…♥