Friday, April 30, 2010

సింహరాశి--2001
సంగీతం::S.A.రాజకుమార్
రచన::పోతుల రవికిరణ్
గానం::ఉదిత్‌నారాయణన్, సుజాత

పల్లవి::

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా
సందమామ సందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా
పుత్తడిబొమ్మే నీవా అందానికి అర్ధం నీవా
నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా
సత్యభామ....
సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా

చరణం::1

కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మ
ఒహో కట్టుకున్న పచ్చచీర బాగుందే చిలకమ్మ
ముట్టుకుంటే కట్టుజారి పోతుంది వినవయ్య
అరె వయ్యారి నారి వద్దంటే చేరి మీద మీదపడతావే
అహ అల్లేసుకోరా గిల్లేసుకోరా ఆకువక్క నీకేరా
కొంటె ఊపు సరి కొంగు సైగ మరి
ఈ అల్లరి హద్దులు దాటకె బుల్లెమ్మా

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా

చరణం::2

పుట్టలోని పట్టుతేనె ఏమైందే ఓయమ్మ హే
అయ్యయయ్యో పుట్టలోని పట్టుతేనె ఏమైందే ఓయమ్మ
పట్టెమంచం కిర్రుమనగా ఒలికింది మావయ్యో
అరె కయ్యాలమారి కౌగిళ్ళుకోరి కాకమీద ఉన్నావే
అహ ముద్దెట్టుకోరా ముచ్చట్ట్లు తేరా పాలబుగ్గ నీదేరా
చక్కగుంది సిరి తప్పదమ్మ గురి కన్యరాశే కందులు కాసుకు బుల్లెమ్మా

సత్యభామ సత్యభామ సంగతేంటమ్మా
వేళకాని వేళల్లోన పిలుపులేంటమ్మా
సందమామ సందమామ సరసమాడయ్యా
నిన్ను చూసిన గడియనుండి నిదురలేదయ్యా
పుత్తడిబొమ్మే నీవా అందానికి అర్ధం నీవా
నచ్చినవాడివిలేరా నా ప్రాణమే నీవని తెలుసుకోరా

సింహరాశి--2001
సంగీతం::S.A.రాజకుమార్
రచన::వెనిగళ్ళ రాంబాబు
గానం::S.P.బాలు,సుజాత

ధర్మరాజమ్మో పేదల గుండెల్లో
అమ్మను మరిపించే అన్నను చూడమ్మో
లక్ష్మీదేవైనా వచ్చెను చెళ్ళమ్మో
అనందం పొంగే మా పల్లెను చూడమ్మో

పల్లవి::

పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు
దానవీరశూరకర్ణ నరసింహరాజు
సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు

చరణం::1

పేదోళ్ల బతుకుల్లో పండగ నీవు
నూరేళ్లు చల్లగ ఉండాలి నీవు
బ్రతుకు బరువై లేకున్న చదువు
చదువులమ్మకు అయినాడు గురువు
మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు
మా కంటిచూపుల్లో సూరీడే నీవు
ఏ పుణ్యఫలమో నీ తల్లి రుణమై

సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా ఆ
పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు
మన్ను మిన్ను కన్న గొప్ప మనసున్నరాజు

చరణం::2

కటిక నేలే నీ పట్టుపరుపు
పూరి గుడిసెను గుడి చేసినావు
కట్టుపంచే నీకున్న ఆస్తి
కోట్లు ఉన్న నిరుపేదవయ్యా
కన్నీళ్లు తుడిచే అన్నవు నీవు
కన్నోళ్ల కలలే పండించినావు
ఈ పల్లెసీమే నీ తల్లి ప్రేమై

సింహరాశిలో నువు పుట్టినావయ్యా
జన్మభూమికే వన్నెతెచ్చినావయ్యా అయ్య

చరణం::3

మట్టి నుంచి పుట్టి పెరిగి మనిషైన వాణ్ణి
కట్టుబట్టలుంటే చాలు అనుకున్న వాణ్ణి
సాటివారి సేవకై బ్రతికున్న వాణ్ణి
పుట్టినప్పుడు మనం తెచ్చిందేముంది
గిట్టినప్పుడు మనతో వచ్చిందేముంది