Tuesday, April 24, 2007

సొంతం~~2002

సంగీతం::దేవి శ్రీ ప్రసాద్
రచన::సిరివెన్నెల
గానం::KS.చిత్ర

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగిందే
తడిమి చూస్తే అతడి తలపే నిండి పొయిందే
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా

నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా

Tuesday, April 3, 2007

నిర్ణయం~~1992సంగీతం::ఇళయ రాజ
రచన::గణేష్ పత్రో
గానం::SP.బాలు

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని
చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటె పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మ
నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా
నేనంటె కాదన్న లేదీసే లేరమ్మ
నా కంటె ప్రేమించె మొనగాడు ఎవడమ్మా
I love you darling because you are charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె,why not

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని య..య్యా
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన
అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా
నీ చేతె పాడిస్తా లవ్ సొంగ్స్ డూఎట్లు
నా చేత్తొ తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట
అచ్చ్హ మైనే ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా
అమీ తుమీ తేలకుంటె నిన్ను లేవదీస్కుపోతా are you ready

హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని..ఉ..హా..హా
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

Monday, April 2, 2007

క్రిమినల్~~రాగం::ఆభేరి!11995


సంగీతం::MM.కీరవాణి
రచన::సిరివెన్నెల
గానం::బాలు,చిత్ర
రాగం:::ఆభేరి(భీంపలాశ్రీ)


తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం..... నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో.... .అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో
Darling...
Every breath you take
Every move you make
I will be there with you

What would I do with out you
I want to love you
forever and ever and ever

ఎన్నడూ.... .తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో..... తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా..మనసా..ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా..మనసా..ఇది ఏనాటి అనుబంధమో
ఆ...హా...ఆ...హా...ఆ...హా...