Saturday, August 22, 2009

మల్లన్న--2009



డైరెక్టర్::సుసి గనేషన్
సంగీతం::దేవీ శ్రీ ప్రసాద్
గానం::కార్తీక్ కుమార్,సుచిత్రా,విక్రమ్మ్


అ అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ అ..
అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ...

Hey excuse me mr mallanna..
Hey excuse me mr mallanna,o coffe
తాగుదాం ఆవోనా hot a cold
నువ్వె తాకి చూడు..ఏయ్..పో..

Hey excuse me....
Hey excuse me mr mallnaa o long drive పోదాం ఆవోనా,
slow aa speed aa నువ్వే తోలి చూడు..పోవే

వట్టి sim card వట్టి ipod డు
నిన్ను swtch on చేయడం waste
Hutch bull dog పిచ్చి peacock
నాకు touch ఇవ్వకుంటేనే safe..
'L' board rey L board ఎప్పుడెక్కుతావ్
main road u...

పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా..పోవే..పోరా..పోవే..పోరా పో పో పో...

Hey excuse me...
Hey excuse me mr mallanna..o coffe
తాగుదాం ఆవోనా,hot a cold aa
నువ్వే తాకి చూడు..పో వే..

Excuse me miss subbalachchimi ur activery is aa Dampu lachchimi
నీ మాట తీరు నువ్వే చెప్పు గబ్బు లచ్చిమీ..పోవే..పోవే..2

అ అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ అ..
అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ...

హేయ్ మల్లన్న నీ style చూసి thril ఐ నా
నా అందం చూసి నీ మనసులో బెంగైనా ఛీ బెట్టైన థూ..

నీ అందం వల్ల కాదూ నీ హింస వల్ల చిత్తైన
నీ చేతికి మాత్రం చిక్కుతానా?
జగమే మాయ అన్నాడ ఆ వేమన్న
ప్రేమే లేదన్నాడు ఈ మల్లనా..

అబ్బ అబ్బ అబ్బ పెద్దలు అన్నారబా..
కాని కాక మొక్షం కాని మనిషి కాలేడబ్బ

డబ్బ డబ్బ డబ్బ పోవే పోపుల డబ్బా
రోజూ నీతో bow bow అంటే life నాకు దెబ్బా

Hitler కూతురా hitler కూతురా
ప్రేమ ముదిరినట్టుగ నన్ను చంపొద్దే..

lincoln తమ్ముడా lincoln తమ్ముడా
వేదాంతం చెప్పమాకే ఈ పొద్దే
కాశ్మీరా? క్రిష్ణా నీరా? ఇది తేలని తగర లా..

పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా..
పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా పొ పొ పో

Hey excuse.....
Hey excuse...mr mallanna..o coffe తాగుదాం ఆవోనా,
hot a cold ఆ నువ్వే తాకి చూడు..
hey excuse me miss subbalachchimi ur activery is aa dampu lachchimi
నీ మాట తీరు నువ్వే చెప్పు గబ్బు లచ్చిమి..పో రా పో రా

అ అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ అ..
అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ...

హేయ్ ఎంటి తెగ over చేస్తున్నవ్?
ఏం చెయనివ్వట్లేదు..
నువ్వు చదువుకున్న దానివి కదా
నిన్ను చదవడం రావట్లేదే :(
హేయ్ హేయ్ తప్పుకో..నువ్వు ఒప్పుకో..
ఇదిగో చూడు..మంచి మూడు".అయ్యో....

చెద చెద చెద నా మటంటే నే చేదా?
నన్నే కాదు అంటే రేపు నీకే కాదా బాధ...
హేయ్ పోదా పోదా పోదా నా పైనే ఆశే పోదా?

గర్ల్స్ అట్ల ఆశే పడ్తే chapter close ఐ పోదా?
హేయ్ ఉప్పు మూటలా ఉప్పు మూటలా,
life long lyf long నిన్ను నేను మోస్తాలే..

రొట్టి పెట్టలే రొట్టి పెట్టలే.వందరేట్లు నీ కంటే అందగత్తలే..
రమ్మంది ఈ రాకుమారి plz ra ra track కు మారి..

పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా..
పోవే పోరా..పోవే పోరా..పోవే పోరా పొ పొ పో..

Hey excuse.....
Hey excuse...mr mallanna..o coffe తాగుదాం ఆవోనా,
hot a cold ఆ నువ్వే తాకి చూడు..

Hey excuse me miss subbalachchimi ur activery is aa dampu lachchimi
,నీ లుక్కు హిప్పు చాల చాకు లచ్చిమీ..

అ అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ అ..
అ ఆ అ ఆ అ అ అ ఆ..అ అ ఆ అ ఆ అ అ ఆ...

కరెంట్ 2009 ~~( Current )



సంగీతం::దేవీశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::నేహ


అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే

అపుడు ఇపుడు ఎప్పుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా
గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే

రంగూ రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శున్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనే లేను అనుపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే

నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఓంటరి చేసావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే

Friday, August 21, 2009

కరెంట్ 2009 ~~( Current )



సంగీతం::దేవీశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
డైరెక్టర్::సూర్య ప్రతాప్
ప్రోడ్యుసర్::చింతలపూడి శ్రీనివాస రావ్,నాగసుశీల
గానం::Andrea,Franco


hey..clap for the Girl
clap for the Boy..
one plus one..one for one
let's go..make some noise

హా..అమ్మాయిలూ..అబ్బాయిలూ..
come on come on..come here
ఆ దేవుడే చెప్పాడులే..
we are made for each other

అమ్మాయిలూ..అబ్బాయిలూ..
come on come on..come here
ఆ దేవుడే చెప్పాడులే..
we are made for each other

హా..ఆ..సోలో సోలో..life అంటే
బోరే కదా ఎపుడైనా..
male and female ఉండాలి ఏ కథలోనైనా
హేయ్..ఆడా మగా ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకున్నా..
creation నే జరిగేనా..ప్రపంచమే సున్నా..
haa..boy needs a girl saalaa..girl needs a boy

జోడీలేని జిందగీలో లేదు లేరా జాయ్..
హ్హా..హ్హా..హ్హా..EVERYBODY!
అమ్మాయిలూ..అబ్బాయిలూ..
come on come on..come here
ఆ దేవుడే చెప్పాడులే..
we are made for each other :: 2

హాయ్..పచ్చని park కున్నా..పక్కన partner లేకుంటే
అది ఊటీ weather అయినా..జైపూర్ summer heat లే
హేయ్..party pub ఐ నీకో company లేదంటే
age old వైనైనా extra కిక్కే మివ్వదులే
emotional బౌండైనా body కి Friend అయినా
తోడన్నది కావాలే..లేదంటే తేడాలే..
haa..boy needs a girl saalaa..girl needs a boy

హ్హా..హ్హా..హ్హా..జోడీలేని జిందగీలో లేదులేరా జాయ్

హ్హా..హ్హా..హ్హా..EVERYBODY!
అమ్మాయిలూ..అబ్బాయిలూ..
come on come on..come here
ఆ దేవుడే చెప్పాడులే..
we are made for each other

boy needs a girl..girl needs a boy
and there is a moment to joy
boys need a friend..girls know the trend
and thats how the story ends

friends forever along together
thats how its meant to be
boys and girls are made for each other
dont you go change the destiny

i dont know..no one like
i have to try my joy

ధూం టు బైకున్నా ఎక్కేపిల్లే లేదంటే
ధ్రిల్లంటూ నిల్లే..వయసుకు జోషే ఉండదులే
హా..ఆ..డాలర్స్ ఎన్నున్నా..స్విస్ బ్యాంకు అకౌంటు నీకున్నా
బైతు పంచుకొనే సౌల్ మేట్ నీ కొకరుండాలే..
ప్లస్ అన్నదీ ఉందంటే..మైనస్ కూడ ఉండాలీ
లేదంటే ఈ నేచర్లో బ్యాలెన్స్ లేదసలే..

boy needs a girl saalaa..girl needs a boy
జోడీలేని జిందగీలో లేదు లేరా జాయ్..
హ్హా..హ్హా..హ్హా.. EVERYBODY!
అమ్మాయిలూ..అబ్బాయిలూ..
come on come on..come here
ఆ దేవుడే చెప్పాడులే..
we are made for each other :: 2

కరెంట్ 2009 ~~( Current )



కరెంట్ 2009
సంగీతం::దేవీశ్రీ ప్రసాద్
రచన::భాస్కరభట్ల
గానం::సాగర్,రానిన


ధీంతర ధీంతర ధిర ధిర ధిరన ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన ధిర ధిర ధిరన

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

నాలోనాకే కొత్తగుందిరో..లావా లాగ మరుగుతోందిరో
లావాదేవీ జరుగుతోందిరో..ఈ తికమక ఏంటిరో

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు


ధీంతర ధీంతర ధిర ధిర ధిరన ధిర ధిర ధిర ధీంతనన
ధిర ధీంతర ధీంతర ధిర ధిర ధిరన ధిర ధిర ధిరన

ప్రపంచమంతా జయించినట్టు ఉప్పొంగిపోతోంది ప్రాణం
పెదాలలోన పదాలు అన్ని క్షణాల లోనే మాయం
శరీరమంతా కరెంటు పుట్టి భరించలేకుంది ప్రాయం
నరాలలోన తుఫాన్ రేగి ఇదేమి ఇంద్రజాలం

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

ఆహా..హా..హా..హాహ..
ఆహా..హా..హా..హాహ..
ఆహా..హా..హా..హాహ..

ఓహో..శవరవా..ఓహో షా..
ఓహో..శవరవా..ఓహో షా..
ఓహో..శవరవా..ఓహో
ఓహో..శవరవా..ఓహో షా..
ఓహో..శవరవా..ఓహో షా..
ఓహో..శవరవా..ఓహో..

క్షణలనేమో యుగాలు చేసి తెగేడిపిస్తోంది కాలం
ఎడారిలోన చలేసినట్టు ఇదేమి వింత మైకం
తపస్సులన్నీ ఫలించినట్టు తమాషగుంటోంది వైనం
మనస్సుతోటి మనస్సులోకి రహస్య రాయబారం

There is something new about today
There is something nice about today
There is something cool about today
I never never seen before

అరె రెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు
అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు
అరె రంగుల గాలి పటమల్లేఎగిరిందే నా మనసు
అది ఎక్కడ చిక్కడి ఉంటుందో నీకే తెలుసు

మగధీర ~~ 2009 (magadhiira )



సంగీతం::MM.కీరవాణి
రచన::MM.కీరవాణి
గానం::Daler Mehendi,గీతామాధురి

పైట నలిగితే..మయమ్మ ఒప్పుకుంటదేంటి?
బొట్టు కరిగితే..మా బామ్మ ఊరుకుంటదేంటి?
అదే జరిగితే..ఓలమ్మో..

అదే జరిగితే..అత్తమ్మ..తట్టుకుంటదేంటి?
ఏంటి సుబ్బూ..ఉఊ...ఉఊ...ఉఊ..
నా నేంటి సుబ్బూ..ఉఊ..ఉఊ...ఉఊ..
నా నేంటి సుబ్బూ..చెప్పనే చెప్పుతూ..ఆ..

చెప్పనే చెప్పుతూ...చెప్పానే చెప్పుతూ వంకా..
తిప్పానే తిప్పుతూ..డోంకా..
చేతిలో చిక్కకుండ జారిపోకె జింకా..
పారిపోతే ఇంక..మోగుతాదే ఢంకా..
చెప్పానే చెప్పుతూ వంకా..
ఇవ్వానే ఇవ్వుతూ ఢంకా..
ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా
నువ్వు నేను సింకా..ఓసి..కుర్ర కుంకా..

ఎక్కడ నువ్వేలితే అక్కడ నేనుంటా
ఎప్పుడు నీవెనకే..యేయ్..యేయ్..యేయ్..యేయ్..యేయ్..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్..బార్..బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్..బార్..బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్..బార్..బార్సై
..

ఇయ్యాలా మంగళవారం..మంచిదికాదు
మానేసేయ్..మానేసేయ్..సెయ్..సెయ్..సెయ్..సెయ్..

జీ..సహా..జీ..సహా..జీ..సహా..జీ..సహా

నీవెంట పడతా బొంగరమై..
నీ చుట్టు ముడుతా పంజరమై..
నీ సుగ్గు కోస్తా..కొడవలినై..
నవ్వుల్ని తీస్తా..కవ్వాన్నై..
హా..షవా..అరె..షవా..
అరె..షవా..షవా..షవా..షవా..షవా..


నీవెంట పడతా బొంగరమై..
నీ చుట్టు ముడుతా పంజరమై..
నీ సుగ్గు కోస్తా..కొడవలినై..
నవ్వుల్ని తీస్తా..కవ్వాన్నై..
నిప్పుల ఉప్పెనలే ముంచుకు వస్తున్నా..
నిలువను క్షణమైనా..యేయ్..యేయ్..యేయ్..యేయ్..యేయ్..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్..బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్..బార్సై..


అలవాటు లేనే లేదు అయ్యేదాకా..
అగేసేయ్..సెయ్..సెయ్..సెయ్..ఏయ్ పిల్లడూ..
ఏయ్..ఏయ్..పిల్లడూ..ఓయ్ పిల్లడూ..ఓయ్..ఓయ్..పిల్లడూ..

చలెక్కుతున్నవేళ చింతచెట్టు నీడలోకి..
చురుక్కుమన్నవేళ..పాడుబడ్డ మేడలోకి..
వాగులోకి వంకలోకి సందులోకి చాటులోకి..
నారుమళ్ళ తోటలోకి..నాయుడోళ్ళ పేటలోకి..
బుల్లుచేను పక్కనున్న రెల్లు గడ్డి పాకలోకి..
పిల్లడో..ఏం పిల్లడో..ఏం పిల్లడో..
యెల్దామోస్తవా..ఏం పిల్లడో..యెల్దామోస్తవా..

వస్తా బాణాన్నై..రాస్తా బలపాన్నై..
మోస్తా పల్లకినై..ఉంటా పండగనై..

నీ దారికొస్తా బాణాన్నై..నీ పేరురాస్తా బలపాన్నై..
నీ ఈడు మోస్తా పల్లకినై..నీతోడుంటా పండగనై..

పిడుగుల సుడిలోనా..ప్రాణం తడబడిన..
పయనం ఆగేనా..యేయ్..యేయ్..యేయ్..యేయ్..యేయ్..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్ బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్ బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్ బార్సై..

జోర్ సేయ్..జోర్ సేయ్..జోర్ జోర్ జోర్ సేయ్..
బార్సై..బార్సై..బార్ బార్ బార్సై..

మగధీర ~~ 2009 (magadhiira )



సంగీతం::MM.కీరవాణి
రచన::MM.కీరవాణి
గానం::దీపు,గీతామాధురి


నాకోసం నువు జుట్టు పీక్కుంటే..బాగుంది
నేనంటే పడి చచిపోతుంటే..బాగుంది

నాకోసం నువు జుట్టు పీక్కుంటే..బాగుంది
నేనంటే పడి చచిపోతుంటే..బాగుంది

నాకోసం నువు గోడ దూకేయడం..బాగుంది
నే కనపడక గోళ్ళు కొరికేయడం..బాగుంది

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చవోయ్ 2

నాకోసం నువు జుట్టు పీక్కుంటే..బాగుంది
నేనంటే పడి చచిపోతుంటే..బాగుంది

KVR Park లో jogging కు వెళ్ళావంటు
విశ్వనీయ వర్గాల information

swiss వీధుల మంచుల్లో
మట్లాడుతు french లొ
burger తింటున్నావంటు intimation

పాల కడలి అట్టడుగుల్లో
పూల పరుపు మెత్తటి దిళ్ళో
పైన పడుకొని ఉండుంటావని calculation

ఘన గోపుర భవంతి లో
జన జీవన స్రవంతి లో
నా వెనకే ఉంటు దాగుడుమూతలు
ఆడడమనుకుంట నీ intention

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చవోయ్ 2

hEy indu..ha..oh..oh..sorry sorry..idiot
cant u seen

ఎవరో ఒక వనితా మణిని
నువ్వెమోననుకొని పిలిచి
కాదని తెలిసాక వగచి
సర్లే అని విడిచి

వెనకడుగె వెయ్యొద్దుర కన్న
వెనకే ఉందేమో మైన
ఎదురెదురై పోతారేమో..ఇలలో ఎపుడైన

అనుకుంటు..కలగంటు..తనతోనే..బ్రతుకంటు
దొరికీ దొరకని దొరసాని
దరికొచే దెపుడంటున్న..అంటున్న..అంటున్న

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చి నచ్చి నచ్చావోయ్
పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగ్గా
నచ్చవోయ్ 2

మగధీర ~~ 2009 (magadhiira )








సంగీతం::MM.కీరవాణి
రచన::భువనచంద్ర
గానం::రంజిత్,శివాణి


paapa hands up
paapa hands up

బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప
బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప

చెంగావి చీర గుట్టు చూసుకొండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప

Up up hands up
Juck juck ni luck
Dhik dhik dolakku tho
చేస్త
Zip zip jack up
Ship ship shake up
Step step music thoo

బంగారు కోడి..బంగారు కోడి
బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప
చెంగావి చీర గుట్టు చూసుకొండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప

స ప మ ప ద ప..ప ద ప..ప ద ప
స ప మ ప ద ప..స ప మ ప ద ప
స ప మ ప ద ప hands up పాప
స ప మ ప ద ప ర ప ప ప ప పా

ఒద్దమ్మ ఒద్దమ్మ సుబ్బులు
ఆంతంత ఉన్నై యెత్తులూ బొలో బొలో

నీ కన్ను పడ్డాక వోరయ్యో
పొంగెస్తున్నాయి సొత్తులూ చెలో చెలో

సిగ్గు లేని రైక టెక్కు చూస్తా
గోలు మాలు కోక పొంగుల్లో
కావలిస్తె మళ్ళి వస్తనయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకూ

Hey..hey
Up up hands up
Juck juck ni luck
Dhik dhik dolakku tho
రైక
Zip zip jack up
Ship ship shake up
Step step music thoo

ఎంటమ్మ ఎంటమ్మ అందులో
అందాల చిట్టి గంపల్లో బోలో బోలో
నా ఈడు నక్కింది బావయ్యో
చెయ్యేసినాక మత్తులో చలో చలో

చేత చిక్కినావె కిన్నె కోడి
దాచుకొన్న గుట్టు తియ్యర తీయ్యర
కాక మీద ఉన్న దాని రయ్యొ
పాప మీద కోపమెందుకూ

Hey..hey
Up up hands up
Juck juck ni luck
Dhik dhik dolakku tho
Ok
Zip zip jack up
Ship ship shake up
Step step music thoo

బంగారు కోడి..బంగారు కోడి
బంగారు కోడి పెట్ట వచ్చెనండి
హేయ్ పాప హేయ్ పాప హేయ్ పాప

చెంగావి చీర గుట్టు చూసుకొండి
హే పాప హేయ్ పాప హేయ్ పాప

Thursday, August 20, 2009

కలవరమాయే మదిలో--2009



సంగీతం::శరత్ వాసుదేవన్
రచన::వనమాలి
గానం::చిత్ర


జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే
జినక్కి తయ్యా జినక్కి తయ్యా జినక్కి తయ్యరే

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా

కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ
గొంతులోని నా తేనెపట్టునే తాను కోరేనమ్మా
పరుగాపని వాగులలోనా కదిలే అలలే
నా పలుకుల గమకం ముందు తల వంచెనులే
ఎగిసే..తేనె రాగాలు నీలిమేఘాలు తాకితే చాలు నింగి లోగిళ్ళు
జల్లై విల్లై తుళ్ళు
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా

ప ప స స ద స స ద ప ప ప ప గ స ని ప గ రి
స స ద ద ప ద ద ప గ ప స గ ప రి
ప ద ని స గ రి గ రి గ రి గ రి
ప ద ని స రి గ రి గ రి గ రి గ
ప ద ని స గ గ ప ద ని స గ గ ప ద ని స గ

ఇన్ని నాళ్ళుగా కంటి పాపలా పెంచుకున్న స్వప్నం
నన్ను చేరగా సత్యమవ్వదా నమ్ముకున్న గానం
పెదవంచున సంగతులన్నీ శ్రుతులై లయలై
ఎదనూపిన ఊపిరులవని స్వర సంపదలై
బతుకే..పాటలా మారు బాటలో సాగు ఆశలే తీరు రోజులే
చేరువయ్యే లైఫే హాయే

తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా
ఏ చిన్ని సందళ్ళు విన్నా ఈ గుండె చాటున
నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా
దరి చేరే స్వరము నాకు వరము
ప్రతి రోజూ పదము పాడే సమయాన
నన్నే నీలో కన్నా
తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న తిల్లాన
మనసును మీటుంతుంటే కొత్త పాటనవుతున్నా

కలవరమాయే మదిలో--2009



సంగీతం::శరత్ వాసుదేవన్
రచన::వనమాలి
గానం::చిత్ర,రోషన్


నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై కోపాలేనా ....
నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన

నీకు నేనే చాలనా నిన్ను కోరి వస్తే చులకనా
కాలు దువ్వే కాంచన కంటి పాప లో నిను దాచనా
ఆ కన్నులే పలు అందాలనే చూస్తే ఎలా
ఏం చూసినా ఎదలో ఉందిగా నిదా కల
నమ్మేదెలా..ఆ ఆ ఆ ఆ
నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా

నీడలాగా సాగనా గుండె నీకు రాసిచ్చెయ్యనా
మాటలేమో తియ్యన మనసులోని ఆశే తీర్చునా
నీ కోసమే నన్ను ఇన్నాళ్ళుగా దాచానిలా
ఏమో మరి నిను చూస్తే మరి అలా అనిపించలా
నీతో ఎలా ..ఆ ఆ ఆ ఆ

నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన
నా ప్రేమ సంతకాల సాక్షాలే చూపనా
ఏం మాయ చేసినా నీ మాటే చెల్లునా
నాపై కోపాలేనా ....
నీలో అణువంత ప్రేమున్నా అనుమానం రేగేనా నాతో తగువే తగునా
చాల్ళే తమ తీరు చూస్తున్నా మీతి మీరి పోయేనా అంతా ఒకటే నటన

కలవరమాయే మదిలో--2009



సంగీతం::శరత్ వాసుదేవన్
రచన::వనమాలి
గానం::హరిహరన్,కల్పన


ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని..నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ..నీ వాణ్ణి
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని..నీ గూటికే రాని

మారాము చేసే మారాణి ఊసే నాలోన దాచానులే
గారాలు పోయే రాగాల హాయే నా గుండెనే తాకెలే
నీ కొంటె కోపాలు చూడాలనే ..
దొబూచులాడేను ఇన్నాళ్ళుగా
సరదా సరాగాలు ప్రేమేగా
ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని..నీ గూటికే రాని

నీ నీడలాగ నీతోనే ఉన్నా నీ జంట నేనవ్వనా
వేరెవ్వరు నా నీ గుండెలోన నా కంట నీరాగునా
ఆ తలపు నా ఊహకే తోచునా..
నా శ్వాస నిను వీడి జీవించునా
నీ కంటి పాపల్లే నేలేనా

ఓ నేనే ఓ నువ్వని ఒక తీరే మన ప్రేమని..నీ గూటికే రాని
నేనంటు ఇక లేనని నీ వెంటే ఉన్నానని చాటనీ
చేసానే నీ స్నేహాన్ని...పోల్చానే నాదో కానీ..నీ వాణ్ణి

Wednesday, August 12, 2009

కలవరమాయే మదిలో--2009



సంగీతం::శరత్ వాసుదేవన్
రచన::వనమాలి
గానం::చిత్ర


కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో..కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే

మనసునే తొలి మధురిమలే వరి౦చెనా
బతుకులో ఇలా సరిగమలే రచి౦చెనా
స్వరములేని గాన౦ మరపు రాని వైన౦
మౌనవీణ మీటుతు౦టే..... కలవరమాయే మదిలో

ఎదగని కలే ఎదలయలో వరాలుగా
తెలుపని అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీర౦ మధురమైన భార౦
గు౦డెనూయలూపుతు౦టే .....కలవరమాయే మదిలో

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలే
అలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో..... కలవరమాయే మదిలో

Tuesday, August 11, 2009

మగధీర ~~ 2009 (magadhiira )



సంగీతం::MM.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::అనూజ్ గురువర,రీట


పంచదార బోమ్మ బోమ్మ పట్టుకోవద్దనకమ్మ
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే చేంతకే రావొద్ద్దంటే
ఏమవుతానమ్మా
నిను పొందేటందుకు పుట్టనే గుమ్మా
నువ్ అందకపోతే వ్రుధా ఏ జన్మ..ఆ..
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మా
నువ్ అందకపోతే వౄదా ఏ జన్మా..ఆ..ఆ..ఆ

పువ్వుపైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్ళంటా
అంటుకొటే మంటే వొళ్ళంతా

తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంటా..ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితె ముప్పంటా
వరదైన వరమని వరిస్తా నమ్మ..ఆ..ఆ..ఆ
మునకైనా సుఖమని వుడేస్తా నమ్మ..ఆ..ఆ..ఆ
నిన్ను పొందేటందుకె పుట్టనె గుమ్మా
నువ్ అందకపొతే వౄధా ఈ జన్మా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
గాలి నిన్నుతాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి వూపిరయ్యిందీ..నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్పా
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతమెందుకు నాపైన

వెలుగు దారిచూపింది..చినుకు లాల పోసింది..
వాటితోటి పోలిక నీకేలా
అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మ
నీ చితిలో తోడై నేనొస్తానమ్మ
నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మా
నువ్ అందకపొతే వౄధా ఈ జన్మా..ఆ..అ..ఆ..ఆ..ఆ..ఆ

Monday, August 10, 2009

మగధీర ~~ 2009 (magadhiira )



మగధీర :: 2009
సంగీతం::MM.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::MM.కీరవాణి,నికిత నిగం


ఆఆ... ఆ...

ధీర ధీర ధీర మనసాగలేదురా
చేర రార శూర సొగసందుకో దొరా

అసమాన సాహసాలు చూడ రాదునిద్దురా
నియమాలు వీడి రాణివాసం
ఏలుకోరా ఏక వీర ధీరా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

సమరములో దూకగ చాకచిక్యం నీదేరా
సరసములో కొద్దిగ చుపరా
అనుమతితో చేస్తున్న అంగరక్షణ నాదేగా
ఆధిపతి నై అదికాస్తా దోచేదా
కోరుకైన ప్రేమకైనను దారి ఒకటేరా
చెలి సేవకైన దాడికైన చేవ ఉంది గా
ఇక ప్రాయమైనా ప్రాణమైనా
అందుకోరా ఇంద్రపుత్రా

ధీరా ధీరా ధీరా మనసాగలేదురా
చేర రార శూరా సొగసందుకో దొరా

శశిముఖితో సింహమే జంట కడితే మనమేగా
కుసుమముతో కడ్గమే ఆడదా
మగసిరితో అందమే అంటు పెడితే అంతేగా
అణువణువు స్వర్గమే అయిపోదా
షాసనాలు ఆపజాలని తాపముందిగా
చెరసాలలోని ఖైదు కాని కాంక్ష మోందిగా
శతజన్మలైన ఆగిపోని అంతులేని యాత్ర చేసి
నింగిలోని తార నన్ను చేరుకుంది రా
గుండెలో నగార ఇక మోగుతోంది రా
నవ సోయగాలు చూడ చూడ రాదు నిద్దురా
ప్రియా పూజలేవోచేసుకొనా
చేతులార సేదతీరా

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర

కిక్ ~~ ( Kick ) ~~ 2009



సంగీతం::S.తమన్
రచన::సిరివెన్నెల
గానం::కార్తీక్,జ్యోస్న


గోరే గోరే గో గోరే గోరే
గోరే గోరే గో గోరీ...

గోరే గోరే గో గోరే గోరే
గోరే గోరే గో గోరీ...

గో..గో..గో...

పో పో పోమ్మంటోందా
నన్ను ర ర రమ్మంటోందా
నీ మనసేమంటోందో
నీకైన తెలిసిందా

పో పో పోమ్మంటోందా
నన్ను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో
నీకైన తెలిసిందా

చూస్తూ చూస్తూ సుడి గాలల్లే
చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
ఊపిరి ఆడక నీవల్ల
ఈదరా ఆదరా యేడ యేమన్న తెలిసే వీలూందా

గోరే గొ గొరే గోరే
గోరే గొ గొరే గొ గొరీ..
గోరే గోరే గొ గొరే గోరే
గోరే గొ గొరే గొ గొరీ..

తెగ వురుముతు కలకాలం
తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం
తెగ వురుముతు కలకాలం
తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం

మెల్లగ నాతోటే నీ వ్యవహారం
తుళ్ళి పడగా నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా

గోరే గొ గోరే గోరే గోరే
గొ గోరే గొ గోరీ....
గోరే గోరే గో గోరే గోరే
గోరే గొ గోరే గొ గోరీ..

Yo Girl
My Love Is True
Just Dont Leave Me Alone Yo

గోరే గొ గోరే గో
If U Wann Be Mine
గోరే గొ గోరే గో
If U Wann Be Mine

వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హౄదయం
మరిచే మంత్రమైనా చెప్పదే సమయం
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హౄదయం
మరిచే మంత్రమైనా చెప్పదే సమయం

నీతో నీకే నిత్యం యుద్ధం
యెందుకు చెప్పవే సత్యభామా
ఏం సాదిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పులేదే వున్న ప్రేమ
తగువా మగువా
నా పొగరంటే నీకిష్టం కాదా

గోరే గొ గొరే గోరే
గొరే గొ గొరే గొ గొరీ..
గోరే గోరే గొ గొరే గోరే
గోరే గొ గొరే గొ గొరీ..

జోష్ ~~~ 2009



సంగీతం::సందీప్ చౌట
రచన::సిరివెన్నెల
గానం::కార్తీక్
డైరెక్టర్::వాసు వర్మ
ప్రొడ్యుసర్::దిల్ రాజు
నటీ,నటులు::కార్తీక,నాగచైతన్య


నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఏమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంక కొనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చలు
మున్ముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు

కాలాన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు

నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు
సెలయేళ్ళు చిత్రంగా నీ వైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు
రాగాలూ నీలాగ నలువైపులా
భూమి అంతా నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంతా నీ తరంగానికి సొమ్మసిల్లిపోదా
చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చెదైన తీపవుతుందే నీ సంతోషం చూసి
చెడుకూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంక కోనాళ్ళు
ఎమవుతాయో యెదిగిన ఇన్నేళ్ళు

నువ్వేం చూస్తున్న యెంతో వింతల్లే
అన్ని గమనించే ఆశ్చర్యమా
ఏ పని చేస్తున్నా ఏదో
ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చుపుల్లో కొలువు ఉండి పోగా
చీకటన్నది ఇక రాలేదే నీ కంటి పాప దాకా
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నెర్పేటందుకు నువ్వే పాటషాల

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు
నిన్నిప్పుడు చూస్తే చాలు
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వలా గుంపై వాలు
కాలన్నే తిప్పేసింది లీలా
బాల్యాన్నే రప్పించింది ఈవేళ
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మలుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంక కోన్నాళ్ళు
ఎమవుతయో యెదిగిన ఇన్నేళ్ళు

Sunday, August 9, 2009

ప్రయాణం ~~~ 2009



సంగీతం::మహేష్ శంకర్
రచన::అనంత శ్రీరాం
గానం::అమౄతవర్షిణి


మేఘమా ఆగాలమ్మ
వానలా కరుగుటకు
రాగమా రావమ్మ
పాటలా ఎదుగుటకు
చల్లగాలై మనసులో భావం
నింగిదాకా పయనిస్తుంది
చేరువయ్యే కౌరెప్పల్లోన
ప్రేమతాళం వినిపిస్తుంది.

ఓయ్.. ~~ 2009



ఓయ్...2009
సంగీతం::యువన్ శంకర్ రాజ
గానం::యువన్ శంకర్ రాజ


నన్నోదిలి నీడ వెల్లిపోతుందా
కన్నోదిలి చూపు వెల్లిపోతుందా
వేకువనే సందే వాలిపోతుందే
చీకటిలో ఉదయముండి పోయిందే

నా యద నే తొలి చినుకురి నీకు తెస్తుందా
నీ జత లో గడిపిన బతుకిక బలి అవుతుందా

పోవద్దే నేనుంటా ప్రేమా
పోవద్దే పోవద్దే ప్రేమా

నన్నొదిలీ నీడ వెల్లిపోతుందా
కన్నొదిలీ చూపు వెల్లిపోతుందా

ఇన్నినాళ్ళు నీ వెంటే
సాగుతున్న నా పాదం
వెంట పడిన అడుగేదంటుందే...ఓవ్ ఓవ్ ఓఓఓ

నిన్న దాక నీ రూపం
నింపుకున్న కనుపాపే
నువ్వు లేకే నను నిలదీస్తుందే.......

కోరుకున్న జీవితమే..చేరువైన ఈ క్షణమే....
జాలిలేని విధి రాతే...శాపమైనదే........

మరు జన్మే వున్నదంటే బ్రహ్మ నైన అడిగేదొకటే....
క్షణమంట మమ్ము తన ఆటలింక సాగనిచుంటే...

నువ్వుంటే నేనుంటా ప్రేమ....
పోవద్దే పోవద్దే ప్రేమ....

నువ్వుంటే నేనుంటా ప్రేమ....
పోవద్దే పోవద్దే ప్రేమ....

ఓయ్.. ~~ 2009



సంగీతం::యువన్ శంకర్ రాజ్
డైరెక్టర్::ఆనంద్ రంగ
ప్రొడుసర్::DVV.దనయ్య
గానం:: సిద్ధార్త
నటీ,నటులు::సిద్ధార్త,శాంలీ


నూట డెబ్భైఆరు (176)బీచ్ హౌస్ లో పేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్..20,సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..empty గుండె నిండ నిలిచెరో
ఓయ్...ఊ..ఊ..ఊ
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే

!! 176 బీచ్ హౌస్ లో ప్రేమదేవతా !!

రూపం లోన Beautiful, చేతల్లోన dutyful, మాటల్లోన fundamental...
అన్నిట్లోన capable, అందర్లోన Careful, అంతేలేని sentimental
సినిమాలో మెరిసేటి పాత్ర,City లోన దొరకదు రా...
నిజంగానే తగిలెను తార,వైజాగు నగరపు చివరన
ఝల్ ఝల్ జరిగే
Love@1st sight ఛిల్ కలిగే
Love@1st sight పల్ పల్ పెరిగే
Love@1st sight పైకెదిగే

హేయ్...హేయ్...
డబ్బంటేనే Alergy,భక్తంటేనే Energy నమ్ముతుంది Numerology...
ఇంటి ముందు nostory అంతేలేదు అల్లరి, ఒప్పుకోదు Humorology
ఉండాల్సింది తన వాదల్లో,చ్రాల్సింది Military లో
ఏదో ఉంది strong thing తనలో, లాగింది మనసును చిటికెలో
Some సంబరమే
Love@1st sight వహ్ వరమే
Love@1st sight ఉఫ్ఫ్ ఉఫ్ఫ్ క్షణమే,
Love@1st sight ఓ యుగమే

176 బీచ్ హౌస్ లో ప్రేమదేవతా
యల్లోచుడిదార్ వైట్ చున్ని తో దోచే నా ఎద
ఓయ్..ఓయ్..అంటు casual గా పిలిచెరో
ఓయ్..ఓయ్..20,సార్లు కల్లో కలిసెరో
ఓయ్..ఓయ్..empty గుండె నిండ నిలిచెరో
ఓయ్..ఊ..ఊ..ఊ..
Love@1st sight నాలో కలిగే
Love@1st sight నన్ను కదిపే
Love@1st sight నాకే దొరికే
Love@1st sight నన్ను కొరికే(2)

Tuesday, August 4, 2009

అనంతపురం 1980 ~~2009 ~~ రాగం:::రీతిగౌళ:::



సంగీతం::జేమ్స్ వసంతం
రచన::వెన్నెలకంటి
గానం::బెల్లిరాజ్,

రాగం:::రీతిగౌళ:::

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

పగలే రేయయిన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈవేళ ఇరువురి దూరాలు తరగనీ
ఒడిలో వాలాలనున్నదీ వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మొమాటం ఇది

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే


కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే