Thursday, June 19, 2008

సీతయ్య -- 2000సంగీతం::M.M.కీరవాణి
రచన::చంద్రబోస్
గానం::విజయ్ ఏసుదాస్,సునీత

సమయానికి తగుసేవలు
సేయనీ నీ శ్రీవారినీ
సమయానికి తగుసేవలు
సేయనీ నీ శ్రీవారినీ
ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని
ఇక సేవించనీ ఈ శ్రీవారినీ

నాకు నువ్వు నీకు నేను
అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసల
చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగల మించు
బాహు బంధాలతో
చలువ చందనాల మించు
చల్లని నా చూపుతో
అర్ధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు
కలిపిన ఈ బువ్వతో
నాన్నలోని ఊరడింపు
తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్యసేవ
నైవేద్యసేవ...

సమయానికి తగుసేవలు
సేయనీ నీ శ్రీవారినీ

కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో
చెడుచేరని చోటులో..ప్రశాంత పర్ణశాలలో
ఈ కాంతకు జరిగేను ఏకాంతసేవ
అనుబంధమె బంధువై
మమతలె ముత్తయిదువలై
ఆనందబాష్పాలె అనుకోని అతిథులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై..పరిచేటి పాన్పులో
కనురెప్పల వింజామర..విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ
జోజోలాలి సేవ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ
ఈ ప్రియదాసినీ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ
ఈ ప్రియదాసినీ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ
ఈ ప్రియదాసినీ
కనుతెరవగ మీ రూపే చూడాలని
మీ కౌగిళ్లలో కనుమూయాలని
ఈ కౌగిళ్లలో కలిసుండాలని

Friday, June 6, 2008

క్రిష్ణ~~~2007


సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::ఉదిత్‌నారాయణ,సాధనాసర్గం

తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా
తుమేరి తుంటరి తనమా తుమేరి ఊపిరి గుణమా
తుమేరి తియ్యని జ్వరమా తుమేరి జీవన స్వరమా
తుహిమేరా స్వరమా..స్వరమా...
మామ్మమ్మా మమ్మమ్మా..తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా..చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా..యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా..హరేరామా
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా...

నాబడి నువ్వే నా గుడి నువ్వే
నా ఒడి నువ్వేగా ఈ అమ్మవొడి నువ్వేగా
నననా గుస నువ్వే నాదశ నువ్వే
పదనిస నవ్వేగా పడుచు నస నువ్వేగా
కీచులాట నువ్వే కిస్సులాట నువ్వే
నువ్వే దక్కే దూరమా నువ్వే
తేలిక భారమా తుహిమేరా ఆ భారమా
తుహిమేరా స్వరమా..స్వరమా...
మామ్మమ్మా మమ్మమ్మా..తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా..చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా..యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా..హరేరామా
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా...


నాసిగ నువ్వే నాసెగ నువ్వే
నా పొగనువ్వేగా చిలిపి పగనువ్వేగా
నాసిరి నువ్వే నా తరి నువ్వే
నా సరి నువ్వేగా అసలు గురి నువ్వేగా
తుహిమేరా స్వరమా..స్వరమా...
మామ్మమ్మా మమ్మమ్మా..తొలిప్రేమా
మామ్మమ్మా మమ్మమ్మా..చిరునామా
మామ్మమ్మా మమ్మమ్మా..యమధీమా
మామ్మమ్మా మమ్మమ్మా..హరేరామా
తుమేరా జిల్‌ జిల్‌ ఓ ప్రియతమా
తుమేరా మంజిల్‌ ఓ నేస్తమా...

క్రిష్ణ~~~2007


సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::కునాల్ గంజవాల,మహాలక్ష్మి

దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె మోర్‌ మోర్‌
ఇన్నాళ్ళు బోర్‌ బోర్‌ ఇవ్వాళ జోర్‌ జోర్‌
పట్టాపట్టా నీ ఫోన్‌ నెంబర్‌ పట్టా పట్టా నీ డోర్‌ నెంబర్‌
పట్టన వేళ గుండెకు అయ్యే ఫంచర్‌
చిట్ట నవ్వే సెంటిమీటర్‌ పొట్టి నడుమే మిల్లిమీటర్‌
ఇట్టానన్ను పెట్టేసావే టార్చర్
దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె

వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా గుండె దడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ మూడే చూశాలే నీ స్పీడే చూశాలే
నే తోడా తోడా సర్దేస్తే నువు తేడా తేడాహే
దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె

నన్నే మరి నన్నే మిక్సీలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ జెంటిల్‌ మేన్‌లా ఉన్నా నే నిన్నటికి
నన్ను మెంటల్‌ మేన్‌లా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంటహే నీతోటి తంటాహే
నా వెంటే ఇట్టా పడుతుంటే టెమిటైపోతాలే
దిల్‌ మాంగే మోర్‌ మోర్‌ దిల్‌మాంగె

క్రిష్ణ~~~2007


సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::ఫారిద్,కౌసల్య

మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానే
నీలోనా మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తానా హేయ్యనా చెయ్యి వేస్తే నే చిలికవు
తున్నా రాస్తేనే పరికవుతున్నా చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా
మురిపించే మైనా ఓ మైనా

నచ్చావే నువ్వే నాకు చాన పాప ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా
పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా

మురిపించే మైనా ఓ మైనా

తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా
నీ మగసిరి మిన్నానా ముద్దుల కన్నా
జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా లకజా జానే జానా

మురిపించే మైనా ఓ మైనా

Thursday, June 5, 2008

క్రిష్ణ~~~2007 రాగం:::ఆనందభైరవి:::


రాగం:::ఆనందభైరవి:::
సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::చక్రి


నీ సోకుమాడ అమ్మోనీ జిమ్మడ
తిప్పుకుంటుతిరిగావే నీ ఒంపులు ఊడిపడా
దొంగ చూపు చెబుతుంటే నీ రంగు పెదవి చెబుతుందే
తిక్క నడక చెబుతుందే తై తక్కనడుము చెబుతుందే
నా పైన నీ ప్రేమ నోరార చెప్పరాదే నీ నోరు మండ

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ

ఎపుడెప్పుడో ఇంకెప్పుడే నీకు నాకు లింకెపుడే
ఎపుడెప్పుడే లవ్వెపుడే నీలో ఒంటికి జివ్వెపుడే
వయసై పోతే ఉడికే ఐసైపోతే
మోజే పోతే కోరిక క్లోజైపోతే
తెలుపవుతుంది తల్లోని జుట్టు వదులవుతుంది ఒంట్లోని
పట్టు అనవసరంగా చెయ్యద్దు బెట్టు అందాలన్ని నా చేత
పెట్టు అతి చెయ్యకుండా

నీ సోకుమాడ అమ్మో నీ జిమ్మడ

అంతేలే అంతేలే ఆడోళ్ళంతా అంతేలే
పైపైనే పంతాలే లోలో తకధిం దింతాలే
వదిలెయ్ అంటే అర్ధం ఇంకా వాటెయ్
నోర్ముయ్ అంటే అర్ధం పెదవే కలిపెయ్
గసిరామంటే కవ్వించినట్టు నసిగా మంటే ఉసిగొలిపినట్టు
తిట్టామంటే తెర తీసినట్టు కొట్టామంటే కను నింపినట్టు
తెలిసిందే జాన

క్రిష్ణ~~~2007


సంగీతం::చక్రి
రచన::చంద్రబోస్
గానం::కౌసల్య,రఘు కుంచె

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
తరత్తా మంతరమేస్తా తరత్తా మత్తెకిస్తా తరత్తా పిచ్చెకిస్తా
గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్
ఓ బేబి ఓ బేబి సత్తా చూపిస్తా బేబి
ఓ బేబి ఓబేబి శభాష్ అనిపిస్తా బేబి
నా కోరికనంతా ఓ కొడవలి చేస్తా
నీకులుకులు మొత్తం నే కోసుకుపోతా
రారా కృష్ణా రాధాకృష్ణా బరిలేని ఫన్నీ కృష్ణా
ఛీ పో కృష్ణా సిల్లి కృష్ణా పరువాన్ని కొల్లే కృష్ణా

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్


ఎండ లోన ముద్దిస్తా మై వానలోన వాటేస్తా
ఇక ఎండ వాన కలిపొస్తే ఆ పండు చేతికిస్తా
ఉత్తరాన ఊపేస్తా ఇక దక్షిణాన దులిపేస్తా
ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగదీస్తా
నీ దూకుడు తగ్గిస్తా
నా చెడుగుడు సాగిస్తా
పిల్లగో నే తిప్పులు పెడతా
పిల్లగో సరి హద్దులు పెడతా
పిల్లగో నిన్ను అల్లాడిస్తా ఆడిస్తా
పిల్లో నే తొందర పెడతా
పిల్లో నే పంతంపడతా
పిల్లో నేపైపై కొస్తా పీడిస్తా
రారా కృష్ణా రాధాకృష్ణా రెచ్చావు రౌడి కృష్ణా
గోపికృష్ణా అగ్ని కృష్ణా నాతీపికోరే కృష్ణా

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్

ఊరుకుంటె ఒకటిస్తా నువ్వు కోరుకుంటె రెండిస్తా
ఆ మూడు ముళ్ళు నువ్వేస్తే నా ఏడు జన్మలిస్తాం
అడుగుతుంటే ఇంతిస్తా నువ్వు అడుగకుంటే కొంతిస్తా
నా అడుగులోనా అడుగేస్తా ్బ్రతుకంతా ధారపోస్తా
నా నా నా గడపన దాటొస్తా రా రా రారాటు పిల్లోదాటేస్తా
పిల్లగో నీవేలే పడతా
పిల్లగో మురిపాలే పడతా
పిల్లగో సగుపాలై పోతా లాలిస్తా
పిల్లో నీ బరువే మోస్తా
పిల్లో యెద పరుపే వేస్తా
పిల్లో పిల్లోడిని ఇస్తా కవ్విస్తా

రా రా కృష్ణా రాధాకృష్ణా నచ్చావు నాజికృష్ణా
పెళ్ళి కృష్ణా క్రేజి కృష్ణా నీ ప్రేమ నాదే కృష్ణా

తరత్తా ఎత్తుకు పోతా తరత్తా హత్తుకుపోతా
తరత్తా చిత్తడి చేస్తా గివ్ మి ఛాన్స్ గివ్ మి ఛాన్స్