Monday, June 21, 2010

మరో చరిత్ర ~~ 2010





సంగీతం::మిక్కీ జే మయర్
రచన::వనమాలి
గానం::శ్వేతా పండిట్


నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

ప్రపంచమే వెలేసినా వెలేయని జ్ఞాపకమా
కనే కలే కన్నీరయ్యే నిజాలుగా మారకుమా
గతించిన క్షణాలని ముడేసిన ఆ వరమా
విధే ఇలా వలేసినా జయించును నా ప్రేమ

నిన్ను నన్ను చేరో జగాలలో
అటో ఇటో పడేసినా
ప్రతీ క్షణం మదే ఇలా స్మరించెనా

నా మనసే విరిసే స్వరాలుగా
గతానికే నివాళీగా పదాలు పాడనీ
ఇవాళ నా ఉషొదయం జగాలు చూడనీ
ప్రతీ కల ఒ.. సుమాలు పూయనీ

సఖి ~~2000~~~రాగం::కానడ





సంగీతం::AR.రహీం
రచన::వేటూరి
గానం::హరిణి,కల్పన,కల్యాణి మెనన్


రాగం::::కానడ
అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగేరా

ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా
నీ నవరస మోహన వేణుగానమది

అలై పొంగెరా కన్నా

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను

కాలమాగినది రాదొరా ప్రాయమున
యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేణుగానం కానడ పలికే

కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికె వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా

కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగే
రా

డార్లింగ్--2010




సంగీతం::J.V.ప్రకాష్ కుమార్
రచన::?
గానం::ప్రసాంతిని,సూరజ్


ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకూ
యదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకు
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని
జాబిల్లి చల్లిన జడివానని
ముళ్ళ పై మేమిలా విచ్చుకున్నామని
నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే మారిన తీరులో మారునా… మారదు ఆ ప్రాణం
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

వెళ్ళెళ్ళు చెప్పేసేయి ఏమవ్వదు
లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అంధం
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

మరోచరిత్ర ~~ 2010



మరోచరిత్ర 2010
సంగీతం::Micky J Mayor
రచన::?
గానం:;శ్వేత పండిట్


Actors::Anita,Shraddha Das,Varun Sandesh
Director::Ravi Yadav
Music Director::Micky J Mayor
Producer::Dil Raju


భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2)

పడ్డాను పిలగాడా మోజుపడ్డాను మొనగాడా
జోడైతే జోరేగా ఎల్ ఓ ఈ లవ్
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదననోయ్ (2

తెలిసేది కాదు ప్రేమా తెలియంది కాదు సుమా
దొరికేది కాదులేమ్మా తెరచాటు ఘాటు చుమ్మా
ప్రియమైనా ఈ వసంతం వయసల్లే ఎంత సొంతం
పరువాల కోయిలమ్మా పలికింది ప్రేమా గీతం
నా...హా..మా..హా..నా..హా
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2)

మనసమ్మ కూని రాగం వయసమ్మ వాయు వేగం
కౌగిళ్ళ ఆశలోనా కోరింది అర్ధభాగం
విరహాల వింత దాహం విడదియ్యలేని స్నేహం
తెలిసిందో ఏమో పాపం కురిసింది నీలి మేఘం
పడ్డాను పిలగాడా మోజుపడ్డాను మొనగాడా
జోడైతే జోరేగా ఎల్ ఓ ఈ లవ్
ఆ అ ఆ అ ఆ
నా...హా..మా..హా..నా..హా
నా...హా..మా..హా..నా..హా

భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీదాననోయ్ (2

డార్లింగ్--2010




సంగీతం::GV.ప్రకాష్ కుమార్
రచన::అనంత శ్రీరామ్
గానం::GV.ప్రకాష్ కుమార్


నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే

ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా

నీవే నీవే నీవే నీవే..నీవే.....
నీవే నీవే నీవే నీవే..నీవే...

ఒక నిముషంలోన సంతోషం ఒక నిముషంలోన సందేహం
నిదురన కూడా హే నీ ధ్యానం వదలదు నన్నే ఓ నీ రూపం
నువ్వే...హే...నువ్వే నువ్వే ఆలోచిస్తు పిచ్చోడ్నయ్యా నేనే చెలియా..
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా
మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా
మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువులేకున్నా

నీవే నీవే నీవే నీవే..నీవే..
నీవే నీవే నీవే నీవే..నీవే..

నడకలు సాగేదీ నీవైపే పలుకులు ఆగిందీ నీవల్లే
ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే
నువ్వే...హే...నువ్వే నువ్వే చుట్టూ అంతా తిప్పేస్తున్నా నేనే విననే..
ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిన వెళుతున్నా
కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా

నీవే నీవే నీవే నీవే నీవే నీవే
నీవే నీవే నీవే నీవే నీవే నీవే
ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా
ఏమైనా అది నీవల్లే జరిగుంటుందే ఎలా




Darling--2010
Music:: G. V. Prakash
Lyrics::Anantha Sriram
Singer's::G. V. Prakash

::::

Neeve Neeve ...Neeve Neeve
Neeve Neeve ...Neeve Neeve
Edaina Neetaruvathe Anipistundhe Ila
Emaina Adi Neevalle Jariguntundhe Ela
Edurosthune Unnave Neneydaarilo Velutunna
Kadilisthune Unnave Nenekanthamlo Unna
Maripisthune Untaave Nakemem Gurutostunna
Muripisthune Untaave Naa Mundhe Nuvlekunna
Neeve Neeve ...Neeve Neeve
Neeve Neeve ...Neeve Neeve

::::1

Oka Nimushamu Lona Santhosham
Oka Nimushamu Lona Sandeham
Niduranu Kooda Hey Nee Dhyanam
Vadaladu Nanne Hoo Nee Roopam
Nuvvee Hey Nuvvee Nuvvee
Alochisthu Pitchodnaina Nene Cheliya
Edurosthune Unnave Neneydaarilo Velutunna
Kadilisthune Unnave Nenekanthamlo Unna
Maripisthune Untaave Nakemem Gurutostunna
Muripisthune Untaave Naa Mundhe Nuvlekunna
Neeve Neeve ...Neeve Neeve
Neeve Neeve ...Neeve Neeve

::::2

Nadakalu Saagedhi Neevaipe
Palukulu Aapindhi Neevalle
Evariki Chebutunna Nee Oose
Chivariki Nenayya Nee Laane
Nuvvee Nuvvee Nuvvee
Chuttu Antha Tippesthunna Nene Vinane
Edurosthune Unnave Neneydaarilo Velutunna
Kadilisthune Unnave Nenekanthamlo Unna
Maripisthune Untaave Nakemem Gurutostunna
Muripisthune Untaave Naa Mundhe Nuvlekunna
Neeve Neeve ...Neeve Neeve
Neeve Neeve ...Neeve Neeve
Edaina Neetaruvathe Anipistundhe Ila

Emaina Adi Neevalle Jariguntundhe Ela...!

Tuesday, June 1, 2010

వరుడు ~~ 2010

వరుడు ~~ 2010



సంగీతం::మణిశర్మ
రచన::వేటూరి
గానం::హేమచంద్ర

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జంట

ఓ సఖీ నా ఆశకి వరమైనా కావే
నాకు నీ సావాసమే కావాలి
ఓ చెలీ నా ప్రేమకీ ఉసురైనా కావే
ఒంటరీ ప్రాణమేం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూ ఉంటాను నేను నేనుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తా నిన్నే జీవితాన నాదానా

మేఘ్హమై ఆ మెరుపునే వెంటాడే వేళ
గుండెలో నీరెండలే చెలరేగాల
అందుతూ చేజారినా చేమంతీ మాల
అందనీ దూరాలకే నువ్ పోనేల
తెగించాను నీ కోసం ఈ పందెం వేసా లోకంతోనే స్వయాన
తెరుస్తాను ఈ లోకం వాకిళ్ళే నీ్తో ఏకం అవుతా ఏమైనా

కలలు కావులే కలయిక లిక
కరిగిపోవు ఈ కధలిక లిక
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదిరిస్తాను
కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను
నాతో నువు లేకున్నా నీలోనే నేనున్నా
నీ కోసం కన్నే నేనై కావలి కాస్తున్నా
నీ తోడై వస్తున్నానీ నీడై పోతున్నా
ఆ నింగి నేల ఏకం అయ్యే చోట కానా నీ జం