Monday, June 21, 2010

డార్లింగ్--2010




సంగీతం::J.V.ప్రకాష్ కుమార్
రచన::?
గానం::ప్రసాంతిని,సూరజ్


ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకూ
యదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా మగువై నిండుగా
కనిపించాక మౌనాలే చూపించకు
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని
జాబిల్లి చల్లిన జడివానని
ముళ్ళ పై మేమిలా విచ్చుకున్నామని
నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే మారిన తీరులో మారునా… మారదు ఆ ప్రాణం
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో
ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

వెళ్ళెళ్ళు చెప్పేసేయి ఏమవ్వదు
లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అంధం
పద పద రా రా పరుగున రా రా గురువా గురువా
ఇక బయపడకుండా బయటకి తేరా చొరవా చొరవా

No comments: