Showing posts with label కుర్రాడు (2009). Show all posts
Showing posts with label కుర్రాడు (2009). Show all posts
Sunday, November 22, 2009
కుర్రాడు (2009)
సంగీతం::అచ్చు
రచన::అనంత్ శ్రీరామ్
గానం::కార్తీక్
ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే
నీ చూపే నవ్విందీ..నా నవ్వే చూసిందీ
ఈ నవ్వూ చూపూ కలిసే వేళ ఇదే
ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే
సంతోషం ఉన్నా..సందేహం లోనా లోనా
ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా !
అంతా మాయేనా..సొంతం కాలేనా లేనా
అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ
యవ్వనమా..జమున వనమా..ఓ జాలే లేదా జంటై రావే ప్రేమ !
ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే
అందాలనుకున్నా..నీకే ప్రతి చోటా చోటా
బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా
చెందాలనుకున్నా..నీకే ప్రతి పూటా పూటా
వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ
అమృతమో..అమిత హితమో హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా !
ఏమంటావే..ఈ మౌనం మాటై వస్తే
ఏమౌతావే..ఆ మాటే ప్రేమైతే
ఔనంటావే..నాలానే నీకూ ఉంటే
తోడౌతావే..నీలోనే నేనుంటే
Subscribe to:
Posts (Atom)