Sunday, June 24, 2007

నువ్వు లేక నేను లేను~~2001



సంగీతం::PR.పట్నాయక్
గానం::SP.బాలు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు చిన్ని

చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

ఏ బ్రహ్మ రాసాడో పాశాలిలా
మారాయి స్నేహాలుగా
ఏ జన్మలో రక్త బంధాలిలా
ఈ రెండు దీపాలుగా

ఏ రెండు కళ్ళల్లో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా
ఏ గుండెలొ చోటు దక్కిందిలా ఏ తోడు కానంతగా
రాలేటి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా
రొషాల ఈ లేత బుగ్గలో రోజాలు పూయించగా
ఆ బంధం అనుబంధం మాదె కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్విందిసిరి వెన్నెల జల్లింది

ఆ చెమ్మచెక్కల్లో చెలిమే ఇలా మారింది పంతాలుగా
ఈ గూడ దిక్కుల్లో ఉడుకే ఇలా సాగింది పందాలుగా
ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరులా
ఈ తిట్టి పోతల్లో అర్ధాలనే విలిగించుకో వీలుగా
కారాల మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా
కల్యాణ తాంబూలమెప్పుడో కలలన్ని పండించగా
ఆ అందం ఆనందం మాది కదా

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
పువ్వు పువ్వునా నవ్వులు చూసి
పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది

ఆ తుంటరి కోపం తొలి పొద్దు
ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు
అల్లరి హద్దు గొడవల పద్దు
ముద్దులకే ముద్దు

చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి
జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది

Monday, June 11, 2007

బొమ్మరిల్లు~~2006



సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::భాస్కరభట్ల
గానం::శ్రీనివాస్,గోపికాపూర్ణీమ

బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది
హే...హే...హే...హే...
హే...హే...హే...హే...

చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది
పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా
అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా
యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది
ఊ...
అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది
నా మనసు యెన్నో కలలు కంటుంది

బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ..
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ..
దాని మనసే నీలో ఉందంది...
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....

Friday, June 8, 2007

సంతోషం!!రాగం:::కాఫీ::: 2002



సంగీతం::RP.ఫట్నాయక్
రచన::సిరివెన్నెల
గానం::ఉష

రాగం:::కాఫీ:::

నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా
నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా
మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా

రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా
ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిల అనురాగమా
నడకలు నేర్పిన ఆశవు కద
తడబడనీయకు కదిలిన కథ
వెతికే మనసుకు మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా
నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగ
కనబడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా
నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా
నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా
తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా
చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధమా

Thursday, June 7, 2007

సంతోషం~~2002



రచన::చేంబోలు సీతారామశాస్త్రి
సంగీతం::RP.పట్నాయక్
గానం: రాజేష్,ఉష

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో... శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో.... అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా
ఆ..హా..నిన్నిలా చూస్తూ ఉంటే మైమరపు నన్నల్లుతుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా ఇలా నన్ను చేరగా
సుదూరాల తారక సమీపాన వాలగా
లేనేలేదు ఇంకే కోరిక

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ

ఆగిపోవాలి కాలం మనసొంతమై ఎల్లకాలం
నిన్నగా సనసన్నగా చేజారిపోనీయక
ఆ..హా..చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా..ఆ..ఆ...

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో... శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో.... అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా
నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ