Friday, July 25, 2008

దశావతారం~~2008


సంగీతం::హిమేష్ రేష్మియ
రచన::వేటూరి
గానం::కమల హాసన్,సాధనా సర్గం

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా
ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా
వెన్నదొంగా వైన మన్నుతింటివా
కన్నే గుండె ప్రేమ లయల మృదంగానివా

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా


జీవకోటి నీచేతి తోలుబోమ్మలె
నిన్నుతలచి ఆటలాడే కీలుబోమ్మలె

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా


నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగునలేచే సర్ప సేషమే ఎక్కి
నాట్యమాడి కాలేయుని దర్పమనిచాడు
నీద్యనం చేయువేల విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా
ఆట అర్జును గుండెను నీ దయవల్ల గీతోపదేసం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేసం
వేదాల సారమంతా వాసుదేవుడీ
రేపల్లె రాగం తాళం రాజీవమే

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా

మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి
కూర్మ రూప దారిమి నీవై భువిని మోసినావే
వామనుడై పాదము నెట్టి నింగి కొలిచినావే
నరసిహుని అమ్సే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లె వేణు వూది ప్రేమను పంచావు
ఇక నీ అవతార లేన్నేనున్న ఆదారం నేనే
నే వరవడి పట్టే ముడిపడివుంట ఏదేమైనా నేనే
మదిలోనే ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడారా

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా

దశావతారం~~2008


సంగీతం::హిమేష్ రేష్మియ
రచన::వెన్నెల కంటి
గానం::హరిహరన్

రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు
హరి ని తలిచిన హృదయం నేడు హరుడి తలచుట జరగదు లే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవు ని ఏం చేస్తారు ఆ యమ కింకరులు


నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువు గా నన్ను చీల్చుతున్న మాట మార్చాను లే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువు గా నన్ను చీల్చుతున్న మాట మార్చాను లే
వీర శివుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులె
ప్రభువు ఆనతి కి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవదు లే
రాజ్య లక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే
దేసాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగ రాజులే


నీటిలోన ముంచినంత నీటి చావదులే
గుండెలోన వెలుగులు నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీటి చావదులే
గుండెలోన వెలుగులు నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలను ఆర్పే సుడి గాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలని ముంచే జడి వాన ఆకాశాన్ని తదిపెన
శివం ఒక్కటి మాత్రం దివం కాదంట

దైవం కోసం పోరే సమయం లేదంట
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు

Monday, July 7, 2008

చందమామ~~2007


సంగీతం::KM.రాధాకృష్ణన్
రచన::సుద్దాల అశోక్ తేజ
గానం::కార్తీక్,శ్రీలేఖ,నోయల్

రేగూ ముళ్ళోలే నాటూ సిన్నాది
బొడ్డూ మల్లేను సూడూ అన్నాది
మీసాలు..గుచ్చా..కుండా..
ఒరె బాబో..ముద్దాడుతావా అందీ..

కందీ పువ్వల్లే ముట్టూ కుంటాను
కందీరీగల్లే కుట్టీ పోతాను
కుచ్చీళ్ళు..జారాకుండా..ఒరి బాబో..
కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు....

దీన్నడుముకెంత పొగరవ్వా..
అది కదులుతుంటే వడదెబ్బా
నువ్వు గెలకమాకు మనసంతా
ఇక నిదుర రాదు నీ యబ్బా
మీసాలు గుచ్చాకుండా....

కోనేటి నీళ్ళల్లో..వంగిందిరో
కుండల్లె నా గుండె..ముంచిందిరో
తను తడిసిందిరో..నను తడిపిందిరో


ఆ పిట్టగోడేక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో..అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే..ఎదలో గుండు సూదల్లె దిగుతామురో

తన కనులు గిలికి సింగారీ..ఛా
తన జడను విసిరి వయ్యారీ..ఆహ
చిరు నగవు చిలికి ఒకసారీ..అబ్బో
కొస పెదవి కొరికి ప్రతి సారీ..యహ

మీసాలు గుచ్చాకుండా..ముద్దాడుతావా నువ్వూ
అహ..అహ..అహ..మలమలమల మల్లెలా
మలమలమల వస్తివా..మలమలమల మల్లెలా
మలమలమల వస్తివా....


ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరకా..కసి ఊరిందిరో

ఓ సారి నాతోని..
తర్వాత?
సయ్యంటెరో
ఆహ !
దాసోహమౌతాను..
అచ్చా !
నూరేళ్ళురో..

ఇక తన కాళ్ళకే పసుపౌతానురో
ఇదిగో..పిల్లగో..నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో


నీ నడుము పైన ఒక మడతై..
పై జనమలోన ఇక పుడతా..
అని చెలిని చేరి మొరపెడితే..
తెగ కులుకులొలికి ఆ సిలకా..

మీసాలు గుచ్చాకుండా..ఒసె భామా..ముద్దాడలేనే నేనూ

కందీ పువ్వల్లే ముట్టూ కుంటాను
అహ కందీరీగల్లే కుట్టీ పోతాను
కుచ్చీళ్ళు జారాకుండా..ఒరి బాబూ..
కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు
మీసాలు గుచ్చాకుండా..ఒరి బాబో..
మీసాలు గుచ్చాకుండా..ఒరి బాబో..
ముద్దాడుతావా నువ్వూ..
ముద్దాడుతావా అందీ ....

చందమామ~~2007


సంగీతం::KM.రాధాకృష్ణన్
రచన::పెద్దడ మూర్తి
గానం::రాజేష్

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా

పట్టు చీరల్లో చందమామా
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమా
కోటి తారల్లొ ముద్దు గుమ్మా

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలేలేలో
ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలేలేలో


ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం... చెలికే సొంతం
వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారమ్మ్
పుష్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లొ వేడి నీవో
పూల గంధాల గాలి నీవో
పాల నురుగల్లో తీపి నీవో

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా


నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా
సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో..

నారుమల్లే తోటకాడ నాయుడోళ్ళ ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా
సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరోయ్..


ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎపుదో
అన్ని పువ్వుల్లో అమె నవ్వే
అన్ని రంగుల్లో అమె రూపే
అన్ని వేళల్లొ ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చెసే

బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామా
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమా
కోటి తారల్లొ ముద్దు గుమ్మా

చందమామ~~2007


సంగీతం::KM.రాధాకృష్ణ
రచన::అనంత శ్రీరాం
గానం::ఆశా భోస్లే,KM.రాధాకృష్ణన్


ధీంతనకధీన్ తకతకిట ధీంతకధీన్
ధీంతనకధీన్ తకిటతక ధీంతకధీన్
తకిట థోం..తతకధీం..తకట..తకిట..తకిట..
సనిసనీదా..దనిదమదా..
గామాధా..సానీసా......
మ్మీ..మ్మీ..ఆ..ఆ..


నాలో ఊహలకు
నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు
నాలో కాంతులకు నడకలు నేర్పావూ

పరుగులుగా ..
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ

నాలో ఊహలకు..నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
స..సనిపసా..సా..సనిపరీ
స..సనిపసా..సా..సనిపరీ
స..సనిపసా..సా..సనిపరీ


కళ్ళలో..మెరుపులే
గుండెలో..ఉరుములే
పెదవిలో..పిడుగులే
నవ్వులో..వరదలే

శ్వాసలోనా..పెనుతుఫానే..ప్రళయమవుతుంది ఇలా

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు

ఆ....ఆ...ఆ...గరిగా మమగా
గరిగా..మమగా..మమగరిసరిసని
తకిటథోం..తకిటథోం..తకిటథోం..
తకిటథోం....ఆ....ఆ...ఆ....రరననా..


మౌనమే..విరుగుతూ
బిడియమే..ఒరుగుతూ
మనసిలా..మరుగుతూ
అవధులే..కరుగుతూ
నిన్ను చూస్తూ..ఆవిరవుతూ..అంతమవ్వాలనే

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ
నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ


పరుగులుగా .......
పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయీ
నాలో ఊహలకు..నాలో ఊసులకు అడుగులు నేర్పావూ..
దనిసస్సా నిరిసస్సారీస దనిసస్సా నిరిసస్సారీస దనిసస్సా నిరిసస్సారీస

చందమామ~~2007


సంగీతం::KM.రాధాకృష్ణ
రచన::సాయి శ్రీహర్ష
గానం::హరిచరణ్,సుజాత

ముక్కుపై ముద్దు పెట్టు..ముక్కెరై పోయేట్టూ
చెంపపై ముద్దు పెట్టు..చెక్కెరై పోయేట్టూ
మీసం పై ముద్దు పెట్టు..మీదికే దూకేట్టు
గడ్డం పై ముద్దు పెట్టు..గుండెనే తాకేట్టూ
నననా..నానానా..ననననా..

మొదట నుదిటి మీదా ఒక్క బొట్టు ముద్దు
ఆ పిదప చెవికి చిన్నా బుట్ట ముద్దూ
మత్తు మెడకు ఒక్కా మొక్కజొన్న ముద్దు
గమ్మత్తు గొంతుకొక్కా సన్నజాజి ముద్దూ

బుగ్గపండు కొరికేసే రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేసే కేడీ ముద్దు
కంత్రీ ముద్దూ..జగ జంత్రీ ముదూ
కంత్రీ ముద్దూ..జగ జంత్రీ ముదూ
ముద్దు ముద్దు ముద్దు ముద్దు ఆ ఆ ఆ

ముక్కుపై ముద్దు పెట్టు..
తాననాన తననానా తనననా
తన తనననా..తనతనననా..
తానానానాననా.....


వగల నడుము మడత మీదా వడ్డాణం ముద్దు
నీ నాభి చుట్టు వేడి సెగలా సిగ్గాణం ముద్దు
వంటి వన్నె చిన్నే విన్నపాల ముద్దు
పువ్వంటి కన్నెకొక్కా జున్నుపాల ముద్దు

అల్లరాని వల్లకానియా అల్లరి ముద్దు
అల్లసాని పద్యమంత అల్లిక ముద్దూ
ఆవకాయ్ ముద్దూ..అదే అంధ్రా ముద్దు
ఆవకాయ్ ముద్దూ..అదే అంధ్రా ముద్దు

ముక్కుపై ముద్దు పెట్టు.. మీదికే దూకేట్టు
చెంపపై ముద్దు పెట్టు.. గుండెనే తాకేట్టూ
ముక్కుపై ముద్దు పెట్టు..
తననానా...ఆ...నా..నా..
తనననానననా.....
ముక్కుపై..ముద్దుపెట్టు...