Monday, July 7, 2008
చందమామ~~2007
సంగీతం::KM.రాధాకృష్ణన్
రచన::పెద్దడ మూర్తి
గానం::రాజేష్
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామా
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమా
కోటి తారల్లొ ముద్దు గుమ్మా
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలేలేలో
ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలో..ఏలేలేలో
ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం... చెలికే సొంతం
వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారమ్మ్
పుష్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లొ వేడి నీవో
పూల గంధాల గాలి నీవో
పాల నురుగల్లో తీపి నీవో
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా
సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో..
నారుమల్లే తోటకాడ నాయుడోళ్ళ ఎంకిపాట
నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులాగా
సందె గాలి కొట్టగానే ఆరుబయట ఎన్నెలింట
సర్దుకున్న కన్నె జంట సద్దులాయెరోయ్..
ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎపుదో
అన్ని పువ్వుల్లో అమె నవ్వే
అన్ని రంగుల్లో అమె రూపే
అన్ని వేళల్లొ ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయ చెసే
బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామా
ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా
కన్నె రూపాల కోనసీమా
కోటి తారల్లొ ముద్దు గుమ్మా
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
నాకు బాగా నచ్చే పాటల్లో ఇదీ ఒకటి. పుష్య మాసాన మంచు నీవో
భోగి మంటల్లొ వేడి నీవో
పూల గంధాల గాలి నీవో
పాల నురుగల్లో తీపి నీవో
అంటూ సిరివెన్నెల ఎంత బాగా వర్ణిస్తారో.
శక్తి గారూ మీ ఇన్ని పాటలని ఒక్క చోట చేర్చడం లో మీ ప్రయత్నాన్ని మనస్పూర్తి గా అభినందిస్తున్నాను.
Thank you Satath gaaru
meeru ilaage raavaalani meeku nachchina paaTalu vEyaDamE naa anhilaasha mee AnandamE..maa Anandam :)
Post a Comment