Friday, July 25, 2008
దశావతారం~~2008
సంగీతం::హిమేష్ రేష్మియ
రచన::వెన్నెల కంటి
గానం::హరిహరన్
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు
హరి ని తలిచిన హృదయం నేడు హరుడి తలచుట జరగదు లే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదు లే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవు ని ఏం చేస్తారు ఆ యమ కింకరులు
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువు గా నన్ను చీల్చుతున్న మాట మార్చాను లే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచను లే
నిలువు గా నన్ను చీల్చుతున్న మాట మార్చాను లే
వీర శివుల బెదిరింపులకు పరమ వైష్ణవం ఆగదులె
ప్రభువు ఆనతి కి జడిసే నాడు పడమట సూర్యుడు పొడవదు లే
రాజ్య లక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణు దాసుడే
దేసాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగ రాజులే
నీటిలోన ముంచినంత నీటి చావదులే
గుండెలోన వెలుగులు నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీటి చావదులే
గుండెలోన వెలుగులు నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలను ఆర్పే సుడి గాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలని ముంచే జడి వాన ఆకాశాన్ని తదిపెన
శివం ఒక్కటి మాత్రం దివం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట
రాయి ని మాత్రం కంటే దేవుడు కాన రాడూ
దేవుని మాత్రం కంటే దేహం కాన రాదు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment