Monday, July 7, 2008
చందమామ~~2007
సంగీతం::KM.రాధాకృష్ణన్
రచన::సుద్దాల అశోక్ తేజ
గానం::కార్తీక్,శ్రీలేఖ,నోయల్
రేగూ ముళ్ళోలే నాటూ సిన్నాది
బొడ్డూ మల్లేను సూడూ అన్నాది
మీసాలు..గుచ్చా..కుండా..
ఒరె బాబో..ముద్దాడుతావా అందీ..
కందీ పువ్వల్లే ముట్టూ కుంటాను
కందీరీగల్లే కుట్టీ పోతాను
కుచ్చీళ్ళు..జారాకుండా..ఒరి బాబో..
కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు....
దీన్నడుముకెంత పొగరవ్వా..
అది కదులుతుంటే వడదెబ్బా
నువ్వు గెలకమాకు మనసంతా
ఇక నిదుర రాదు నీ యబ్బా
మీసాలు గుచ్చాకుండా....
కోనేటి నీళ్ళల్లో..వంగిందిరో
కుండల్లె నా గుండె..ముంచిందిరో
తను తడిసిందిరో..నను తడిపిందిరో
ఆ పిట్టగోడేక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో..అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే..ఎదలో గుండు సూదల్లె దిగుతామురో
తన కనులు గిలికి సింగారీ..ఛా
తన జడను విసిరి వయ్యారీ..ఆహ
చిరు నగవు చిలికి ఒకసారీ..అబ్బో
కొస పెదవి కొరికి ప్రతి సారీ..యహ
మీసాలు గుచ్చాకుండా..ముద్దాడుతావా నువ్వూ
అహ..అహ..అహ..మలమలమల మల్లెలా
మలమలమల వస్తివా..మలమలమల మల్లెలా
మలమలమల వస్తివా....
ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరకా..కసి ఊరిందిరో
ఓ సారి నాతోని..
తర్వాత?
సయ్యంటెరో
ఆహ !
దాసోహమౌతాను..
అచ్చా !
నూరేళ్ళురో..
ఇక తన కాళ్ళకే పసుపౌతానురో
ఇదిగో..పిల్లగో..నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై..
పై జనమలోన ఇక పుడతా..
అని చెలిని చేరి మొరపెడితే..
తెగ కులుకులొలికి ఆ సిలకా..
మీసాలు గుచ్చాకుండా..ఒసె భామా..ముద్దాడలేనే నేనూ
కందీ పువ్వల్లే ముట్టూ కుంటాను
అహ కందీరీగల్లే కుట్టీ పోతాను
కుచ్చీళ్ళు జారాకుండా..ఒరి బాబూ..
కౌగిళ్ళు ఇవ్వూ నువ్వు
మీసాలు గుచ్చాకుండా..ఒరి బాబో..
మీసాలు గుచ్చాకుండా..ఒరి బాబో..
ముద్దాడుతావా నువ్వూ..
ముద్దాడుతావా అందీ ....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment