Friday, July 25, 2008

దశావతారం~~2008


సంగీతం::హిమేష్ రేష్మియ
రచన::వేటూరి
గానం::కమల హాసన్,సాధనా సర్గం

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా
ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా
వెన్నదొంగా వైన మన్నుతింటివా
కన్నే గుండె ప్రేమ లయల మృదంగానివా

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా


జీవకోటి నీచేతి తోలుబోమ్మలె
నిన్నుతలచి ఆటలాడే కీలుబోమ్మలె

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా


నీలాల నింగి కింద తేలియాడు భూమి
తనలోనే చూపించాడు ఈ కృష్ణ స్వామి
పడగవిప్పి మడుగునలేచే సర్ప సేషమే ఎక్కి
నాట్యమాడి కాలేయుని దర్పమనిచాడు
నీద్యనం చేయువేల విజ్ఞానమేగా
అజ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగా
ఆట అర్జును గుండెను నీ దయవల్ల గీతోపదేసం
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేసం
వేదాల సారమంతా వాసుదేవుడీ
రేపల్లె రాగం తాళం రాజీవమే

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా

మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాచి
కూర్మ రూప దారిమి నీవై భువిని మోసినావే
వామనుడై పాదము నెట్టి నింగి కొలిచినావే
నరసిహుని అమ్సే నీవై హిరణ్యుని చీల్చావు
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు
కృష్ణుడల్లె వేణు వూది ప్రేమను పంచావు
ఇక నీ అవతార లేన్నేనున్న ఆదారం నేనే
నే వరవడి పట్టే ముడిపడివుంట ఏదేమైనా నేనే
మదిలోనే ప్రేమ నీవే మాధవుడా
మందార పువ్వే నేను మనువాడారా

ముకుంద ముకుందా...క్రిష్ణ
ముకుంద ముకుందా
స్వరం లో తరంగ
బృందా వనంలో వరంగా

No comments: