Showing posts with label కింగ్~~~2008. Show all posts
Showing posts with label కింగ్~~~2008. Show all posts

Sunday, May 3, 2009

కింగ్~~~2008



సంగీతం::దేవీశ్రీ ప్రసాద్
రచన::రామజోగయ్య శాస్త్రి
గానం::సాగర్,దివ్య


చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

మాట చాలు ఓ మాళవిక
ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా..నీ మనసులో సరిగమ
కలుపుకోవా నన్ను నీలో యుగయుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఏరికోరి నీ ఎదపైన ..వాలిపోనిదే వయసేనా
తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వానా..కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్ని ఇలా దరికి పిలుచుకోనా..హే
ఆడించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర

ఆడ మనసులొ అభిలాష ..అచ్చ తెలుగులొ చదివేసా
అదుపు దాటి వరదయ్యింది ఈ చిలిపి చినుకు వరస ..హే
నన్ను నేను నీకొదిలేసా..ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తెరిచా
అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా
తెలుసులే అందమా నీ మనసులో సరిగమ..
ఓఓ..చూపు చాలు ఓ మన్మధుడా
ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర