Thursday, May 18, 2006

గోదావరి~~2007



రచన: వేటూరి
సంగీతం:KM. రాధాక్రిష్నన్
గానం:C.సునీత
అందం గా లేనా..
అసలేం బాలేనా
అంత లెవలేంటోయ్ నీకు ?

అందం గా లేనా..
అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అందం గా లేనా..
అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా..
అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందం గా లేనా..
అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా

కనులు కలపవాయే..
మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే..
మాట వరసకీకలికి చిలకనాయే..
కలత నిదురలాయే
మరవలేక నిన్నే..మధన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేలా
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు
నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

!!! అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా !!!

నీకు మనసు ఇచ్చా..
ఇచ్చి నపుడె నచ్చా
కనుల కబురు తెచ్చా..
తెలుసు నీకదీతెలుగు
ఆడపడుచూ..తెలుపలేదు
మనసూమహా తెలియనట్టూ..
నటనలే అనీఎన్నెల్లో గోదారి..
తిన్నెల్లో నన్నూతరగల్లే
నురగల్లే ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా

!!! అందం గా లేనా..అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అందం గా లేనా ?
అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా
అలుసైపోయానా..
అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందం గా లేనా?
అసలేం బాలేనా
నీ ఈడూ జోడూ కాననా !!!

Wednesday, May 17, 2006

గోదావరి~~~2006



రామచక్కని సీతకి
నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ
మధుర వదన నలిన నయన మనవి వినరా రామా

రామచక్కని సీతకి అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట
రామచక్కని సీతకి
ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో
!! రామచక్కని సీతకి !!

ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు
!! రామచక్కని సీతకి !!

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా
రామచక్కని సీతకి

ఇందువదన కుందరదన మందగమన భామ
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

గోదావరి~~2007



రచన::వేటూరి
సంగీతం::KM. రాధాకౄష్ణన్
గానం::SP.బాలు , Chorus
రాగం::


షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద లాగా
ప్రభువు తాను కాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి !!!