Friday, March 25, 2011

ఆడవారి మాటలకు అర్థలే వేరులే -- 2007
సంగీతం::యువన్ శంకర్ రాజ్
రచన::చంద్రబోస్
గానం::భార్గవి,హరిచరణ్,జెన్ని,మాతంగి


ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్‌మి

కళ్ళలో స్వర్గం నువ్వే గుండెలో నరకం నువ్వే

మాటలో మధురం నువ్వే గోన్తులో కల్లెం నువ్వే

నాప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా

ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా

మదిలోనా జ్వాల నువ్వే


ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్‌మి


పువ్వయి పువ్వయి పరిమళించినావే

ముళ్ళై ముళ్ళై మనస్సు దోచినావే

మెరుపై మెరుపై వెలుగు పంచినావే

పిడుగై పిడుగై కలలు కూల్చినావే

ప్రేమకి అర్థం అంటే కన్నీట్లో పడవేనా

ప్రేమకి గమ్యం అంటే సుడిగుండంలోకేనా

చింతల్లోనే ఉందంటా చేలగట్టు ఈ ప్రేమా

కనుకా మతిపోయి ప్రేమించానమ్మా

కనుకా మూల్యాన్ని చెల్లించానమ్మ

నా ప్రేమ గాధ నువ్వే ఓ చెలియా చెలియా

ప్రియమైన బాధ నువ్వే..ఏ..ఏ..ఏ..

నా ప్రేమ జ్వాల నువ్వే ఓ సఖియా సఖియా

మదిలోన జ్వాల నువ్వే...


నువ్వే నువ్వే ఆదరించినావే..ఆపై ఆపై చీదరించినావే

నిన్నే నిన్నే ఆశ్రయించగానే..నాలో నాలో ఆశ కూర్చినావే

కోవెల లోకం కూడా..నా తనువుని కాల్చిందే

దేవత మెళ్ళో హారం..ఉరితాడై బిగిసిందే

ప్రేమ పైనే నమ్మకం కోల్పోయానే ఈ క్షణం

ప్రేమ పని లేని చోటుకి వెళ్ళాలి

నువ్వు కనలేని గూటికి చేరాలి


ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి ఓ బేబి ఓ బేబి గురువా యు టచ్‌మి

Thursday, March 24, 2011

తమ్ముడు --- 1999
సంగీతం::రమణ గోగుల
రచన::సిరివెన్నెల
డైరెక్టర్::అరుణ్ ప్రసాద్
ప్రోడ్యుసర్::B.శివరామ కృష్ణన్
గానం::రమణ గోగుల


వయ్యారి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలొ దడ దడ
ఏ పిల్లా నీ పేరు లవ్లి
జారిపోకే చేపల్లే తుళ్ళి
జాంపండులా ఉన్నావే బుల్లి
ఊరించకే మళ్ళీ మళ్ళీ
వయ్యారి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే నా గుండెలొ దడ దడ

అరె ఎన్ని సైగలు చేసా దొరసానికి కనపడదే
తనకోసమే కదా వేషాలేసా సిగ్నలే రాదేం
పలకరిస్తే సరదాగా బదులు రాదే అసలు
నడుమూపుతు ఊగుతు సింగారంగా చూడు ఆ లయలు
why doesn’t she talk to me
మా సిన్నోడ్తో ఊసులాడవే చిలకా
why doesn’t she walk with me
ఈ సంటోడెనకే వెళ్ళవే కుళుకా
వయ్యారి భామ నీ హంస నడక
ఎందుకే ఈ తొందర తొందర
ముద్దుల గుమ్మ ఇందరి ముందర
రేపకే గుండెలొ దడ దడ

ఏం చేస్తే ఈ చిన్నారి లిల్లి
ఏరి కోరి నా జంట కడుతుంది
ఏమిస్తే తన గాలి మల్లి
ఎగురుకుంటూ ఒళ్ళో పడుతుంది
ఓరి ఫ్రెండు చెప్పర సలహా
షార్టు రూటు ఉందా లేదా
ఏందిరా ఈ అమ్మడి తరహా
ఎంత కాలం నాకీ బాధ

మన హైటు సరిపోలేదా తన కన్నా పొడవు కదా
మన లెవలు సంగతి తెలుసో లేదో చెప్పరా గురుడా
పెదవి నుంచి ఒక నవ్వొస్తే తన సొమ్మేం పోదు కదా
పడుచువోడ్నే కొన చూపుతొ చూస్తే అరిగిపోదు కదా
why doesn’t she look at me
ఒక సూపు సూడవే అమ్మే ఈడ్ని
why doesn’t she care for me
సీ కొట్టి వెళ్ళిపోకే సిన్ని
why doesn’t she stop for me
జర ఆగే ఆగే ఆగే రాణి
why doesn’t she just love me
ప్రేమించరాదటె ఈడ్ని పోని
O.. why doesn’t she just love me
ఓ.. ప్రేమించరాదటె ఈడ్ని పోని
why doesn’t she just love me
ప్రేమించరాదటె బుల్లో ఈడ్ని
why doesn’t she just love me
ప్రేమించవమ్మో ఈడ్ని పోని
why doesn’t she just love me

Tuesday, March 15, 2011

రెడి -- 2010

చేతిలో చెయ్యేసి -- 2010


సంగీతం::బంటి
రచన::మౌనశ్రీ మల్లిక్
గానం::కార్తీక్, గీతా మాధురి


చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ

సుధలు చిందు కావ్యం చదివా ఓ నేస్తమా
తెలుగు భాష పరువం నీవే ఓ అందమా
కలలు కనే వయసిది తెలుసా నా ప్రియతమా
కన్నె గుండె అలజడి తెలుసా నా ప్రాణమా

నువ్విలా పాడితే మది వాసంతం
నన్నిలా మీటితే ఎద సంగీతం !
హే నువ్విలా పాడితే మది వాసంతం
హే నన్నిలా మీటితే ఎద సంగీతం !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ !

విరులవాన గానం నాదీ ఓ నాదమా
నవరసాల వదనం నీదీ ఓ వేదమా
సిరులు కురులు సొగసే నాదీ ఓ ప్రణయమా
మరులుగొన్న మనసే నీదీ నా వినయమా

గుండెలో దేవిగా పూజిస్తాలే
కంటిలో పాపగా కొలువుంటాలే !
హో గుండెలో దేవిగా పూజిస్తాలే
హే కంటిలో పాపగా కొలువుంటాలే !!

చిలిపి చిలిపి అల్లరి వయసే రమ్మన్నదీ
వగరు వగరు ప్రాయం నీకే ఇమ్మన్నదీ
మధుర మధుర ప్రేమే నాలో రగిలిందిలే
అంతులేని విరహం ఎదలో మరిగిందిలే

కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
మత్తుగా ఉన్నదే నీ అనురాగం
కొత్తగా ఉన్నదే నీ అనుబంధం
హె హే మత్తుగా ఉన్నదే నీ అనురాగం

చేతిలో చెయ్యేసి -- 2010


సంగీతం::బంటి
రచన::చంద్రబోస్
గానం::హరిహరన్ , అల్కా


పిల్లన గ్రోవి నేనై
చల్లని గాలి నువ్వై
అల్లుకుపోయే రాగం..ఆనంద రాగం

రాగానికే రూపం ఒచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం..ఆత్మీయ రాగం..అదే ప్రేమ రాగం

మొదటి సారి నిను చూడగానే..ఆశ్చర్యరాగం
మదిని తెరిచి మాటాడగానే..ఆవానరాగం
చొరవ చేసి నను చేరగానే..ఆందోళరాగం
చెలిమి చేయి కలిపేయగానే..అవలీలరాగం
నవ్వులోన నవనీత రాగం..సిగ్గులోన గిలిగింతరాగం
ఒంపులోన ఒళికింత రాగం..ఓపలేని విపరీత రాగం
అణువుఆణువున పలికెను మనలో
అనురాగ రాగం..అదే ప్రాణ రాగం

రాగానికే రూపం వచ్చి
రూపమిలా ఎదురుగ నిలిచి
ఆలాపించే రాగం..ఆత్మీయ రాగం..అదే ప్రేమ రాగం

ఇరువురం దూర దూరముంటే..ఇబ్బందిరాగం
బంధమై స్పందించుతుంటే..నే బంధరాగం
పెదవి నీటినే పెనవేసుకుంటే..నిశబ్ధరాగం
మధుర నిధిని దోచేసుకుంటే..నిక్షేప రాగం
తనువులోన తారంగ రాగం..క్షణముకొక్క కేరింతరాగం
కలలోన కల్లోల రాగం..కలిసిపోతే కళ్యాణరాగం
ఇద్దరమొకటై ముద్దుగ ఉంటే అద్వైత రాగం..అదే మోక్షరాగం
పిల్లన గ్రోవి నేనై...చల్లని గాలి నువ్వై
ఆలాపించే రాగం..ఆత్మీయ రాగం..అదే ప్రేమ రాగం

బౄందావనం
సంగీతం::
రచన::
గానం::

నిజమేనా..నిజమేనా..నిలబడి కలగంటున్నానా
ఎవరైనా..ఎదురైనా..నువ్వే అనుకుంటున్నానా

నీకలలే దాచుకున్నా..నిజమల్లే వేచి ఉన్నా
నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్నా..ప్రియా..మరి నాలో ప్రాణం నీదంటున్నా

wanna wanna be with you honey నిన్నూ నన్నూ ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey నువ్వు నేను ఇక మనమైపోనీ

ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే..
తొలి ప్రేమే నాలో గుచ్చేస్తున్నాదే..

సర సర సర తగిలే గాలే..నీ సరసకి తరిమేస్తుండే
హా..హాయే..హ ఆయే
మునిపెరుగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే
హా..హాయే చిరుగాలై నిను చేరి ఊపిరిలో కలిసిపోయి
ఆ సంతోషాలే నీకే అందించేయనా..ప్రియా..నీ సొంతం అవుతా ఎప్పటికైనా..

wanna wanna be with you honey నిన్నూ నన్నూ ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey నువ్వు నేను ఇక మనమైపోనీ

గిర గిర గిర తిరిగే భూమి..నీ చుట్టు తిరగాలందే
అమ్మమ్మో..హొ హో..అమ్మమ్మో హో హో ..
నిను మరవను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మమ్మో ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా
వదిలేసే ఊసే రాదే..ఏది ఏమైనా ప్రియా..ప్రతి నిముషం నీతో ఆడుగేస్తున్నా..

wanna wanna be with you honey నిన్నూ నన్నూ ఇక ఒకటైపోనీ
wanna wanna be with you honey నువ్వు నేను ఇక మనమైపోనీ

ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నాదే..
తొలి ప్రేమే నాలో గుచ్చేస్తున్నాదే..

LBW--
సంగీతం::R.అనిల్
రచన::క్రిష్ణ చిన్ని
గానం::జావద్ ఆలి , రమ్య
Director : :Prayeen Sataru
Producer : Naveen Satatru
Starring : Rishi, Asif Taj, Chinmayi Ghatrazu, Abhijit Pundla

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా
కన్నులు రమ్మంటే కలలే రానే రావు కదా
ఏదేమైనా నీతో నువ్వే ఉండాలికా

ఈ వాలినా పొద్దులో చీకటే..ఆ వేకువై ఉదయమే వెలగదా

ఏకాంతం వద్దంటూ నీ మౌనం అంటున్నా
నా పంతం నాదంటూ ఊరుకోవు కదా
కలతన్నది కన్నీరా .. తరిగే వీలుందారా
ఎడబాటే లేదంటే..ప్రేమ కాదు కదా...

ఆనందం వద్దంటూ నే మాత్రం అంటానా
నాకొద్దు పొమ్మంటే పారిపోదు కదా
వలపన్నది తలపేనా..తెలిసే రేపుందారా
నాకోసం రమ్మంటే..ప్రేమ రాదు కదా...

తీరాలే వద్దంటే అలలే ఆగవు కదా
ఎవరో కాదన్నారని ఇలా నువ్వే ఆగిపోతే ఎలా...