Sunday, May 18, 2008
అతడు~~2005
సంగీతం::మణిరత్నం
రచన::సిరివెన్నెల
గానం::కవితా క్రిష్ణమూర్తి,కార్తీక్
పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ..చిలిపిగా చెంతకు రాలేవా
తెలివిగా చేరే తోవా
తెలియనే లేదా బావా
అటు ఇటూ చూస్తూ ఉంటావా
ఓ ఓ ఓ..తటపటాయిస్తూ ఉంటావా
సమయం..కాదంటావా
సరదా..లేదంటావా
సరసం..చేదంటావా బావా
చనువే..తగదంటావా
మనవే..విననంటావా
వరసై..ఇటు రమ్మంటే..నా మాట మన్నించవా
డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
హేయ్..డోలుబాజాలా ఇలా నా వెంట పడతావా
చలాకి రోజా ఆగమంటే ఆగనంటావా
కలలుంటే సొగసే కనపడదా..మనసుంటే తగు మార్గం దొరకదా
రాననకా..రాననకా..రాననకా ....
అనుకుంటే సరిపోదే వనితా..అటుపై ఏ పొరబాటో జరగదా
రమ్మనకా..రమ్మనకా..రమ్మనకా ....
పెరిగిన దాహం తరగదే..పెదువుల తాకందే
తరిమిన తాపం తాళదే..మదనుడి బాణం తగిలితే
చాల్లే బడాయి నాతో లడాయి తగ్గించవోయీ అబ్బాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నానులే
Break it down
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ
హవ్వా హవ్వాయీ అమ్మో అమ్మాయీ విన్నాం కదా నీ సన్నాయీ
పిలిచినా రానంటవా
కలుసుకోలేనంటావా
నలుగురూ ఉన్నారంటావా
ఓ ఓ ఓ..చిలిపిగా చెంతకు రాలేవా
మొహమాటం పడతావా అతిగా సుకుమారం చిటికేస్తే చొరవగా
చేరవుగా..చేరవుగా..చేరవుగా....
ఇరకాటం పెడతావె ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా
ఆగవుగా..ఆగవుగా..ఆగవుగా....
దర్శనమిస్తే సులువుగా అలుసుగ చూస్తావా
సరసకు వస్తే దురుసుగా మతిచెడిపోదా మరదలా
వరాల బాలా వరించువేళా..వరించనంటూ తగువేలా
నిగారమిట్టా జిగేలనాలా..జనం చెడేలా
Everybody
నిగారమిట్టా జిగేలనాలా..జనం చెడేలా జవరాలా
నిగారమిట్టా జిగేలనాలా..జనం చెడేలా జవరాలా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment