సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల
గానం::ఉష,దీపు
సరిమా...సరిమా...సరిమా...
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పే దెవరు ఏ వ్యక్తికైన..
రెప్పల దుప్పటి కప్పే చీకటి
చూపించేనా ఏ కాంతినైనా
నీలో నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడకా కడతేరదు తెలుసా
ఏదో జ్ఞపకాల సుడిదాటి బయట పడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా...
చంద్రుడి ఎదలో మంటనీ వెన్నెల అనుకొంటారని
నిజమైన నమ్మేస్తావా..భ్రమలో పడవా తెలిసి
జాబిలిని వెలివేస్తావా..తనలో చెలిమి విడిచీ
రూపం లేదుకనుక సౌఖ్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికిపైన అనుమాన పడరు ఎపుడైనా
నిన్ను నీవే సరిగా..కనలేవా మనసా
నడిరాతిరి నడకా...కడతేరదు తెలుసా
పోయింది వెతికే వేదనా పొందింది ఏదో పోల్చనా
సంద్రంలో ఎగిసే అలకి..అలజడి నిలిచెదెపుడొ
సందేహం కలిగే మదికి..కలతనుతీర్చేదెవరో
శాపం లాగ వెంటబడుతున్న గతం ఏదైనా
దీపంలాగా తగిలి దారేదో చూపేనా
No comments:
Post a Comment