Monday, May 20, 2013

అడవిరాముడు--2004::AdaviRamudu--2004















అడవిరాముడు--2004
సంగీతం::మణిశర్మ
రచన::సిరివెన్నెల 
గానం::సోనూనిగమ్,మహాలక్ష్మి అయ్యర్

పల్లవి::

ఆకాశం సాక్షిగా..భూలోకం సాక్షిగా
ఆకాశం సాక్షిగా..భూలోకం సాక్షిగా
నిజం చెప్పనీ..నిను ప్రేమించాననీ
నిజం చెప్పనీ..నిను పూజించాననీ
నిరూపించుకోనీ..నీ ప్రేమే నా ప్రాణమనీ
నివేదించుకోనీ..నీ ప్రేమకి నా హృదయాన్ని
నిను స్వాగతించు బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
నా శ్వాసే సాక్షిగా నీ ధ్యాసే సాక్షిగా
నిజం చెప్పనీ..నిను ప్రేమించాననీ
నిజం చెప్పనీ..నిను పూజించాననీ

చరణం::1

కొమ్మ పైన ఆ చిలక..ఊసులేమి చెప్పింది
బొమ్మ లాగ ఈ చిలక..పరవశించి విన్నది
పంజరాన చెర కన్నా..పర్ణశాల మేలన్నది
రాముడున్న వనమైనా..రాణివాసమన్నది
అన్నా అనుకున్నా..అడవి అంతఃపురమవునా
అయినా ఎవరైనా..ఇది కొనగల వరమేనా

నిరూపించుకోనీ నీ ప్రేమే..నా ప్రాణమనీ
నివేదించుకోనీ నీ ప్రేమకి..నా హృదయాన్ని
నిను స్వాగతించు..బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా

ప్రతి నిమిషం సాక్షిగా మన పయనం సాక్షిగా
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ
నిజం చెప్పనీ నిను పూజించాననీ
ఆకాశం సాక్షిగా..భూలోకం సాక్షిగా
నిజం చెప్పనీ..నిను ప్రేమించాననీ

చరణం::2

సప్తపదిన సాగమని ప్రేమ నడుపుతున్నదట
ఏరికోరి ఇద్దరినీ ఎందుకల్లుకుందట
నిన్ను నన్ను నమ్ముకునే..ప్రేమనేది ఉన్నదట
నీవు నేను కలవనిదే..తనకి ఉనికి లేదట
ప్రణయం ఇక నుంచీ..మన జతలో బతకాలి
నిత్యం వికసించే..మధులతగా ఎదగాలి

నివేదించుకోనీ నీ ప్రేమకి..నా హృదయాన్ని
నిరూపించుకోనీ నీ ప్రేమే..నా ప్రాణమనీ
నీ చెలిమి నన్ను శ్రీరామరక్షగా పరిపాలించగా
నిను స్వాగతించు..బిగి కౌగిలింతనై కాస్తా కంచెగా

రవికిరణం సాక్షిగా తడి నయనం సాక్షిగా
నిజం చెప్పనీ నిను పూజించాననీ
నిజం చెప్పనీ నిను ప్రేమించాననీ


AdaviRamudu--2004
Music::Manisharma
Lyrics::Sirivennela 
Singer's::Sonunigam,Mahalakshmi iyer  

:::

Aakaasam saakshigaa..Boolokam saakshigaa
Aakaasam saakshigaa..Boolokam sakshigaa
Nizam cheppanii ninnu..preminchanani
Nizam cheppanii ninnu..poojinchanani
Niroopinchu konii nee..preme naa pranamani
Nivedinchu konii nee..premaki naa hrudayani
Ninnu swagatinchu..bigi kougalintanai kaastaa kanchega
Nee chelimi nannu..sriraamarakshagaa paripaalinchagaa
Na swase saakshigaa..nee dhyaase sakshiga
Nizam cheppani ninnu..preminchanani
Nizam cheppani ninnu..poojinchanani

:::1

Komma paina aa chilaka oosulemi cheppindi
Bomma laga ee chilaka paravasinchi vinnadi
Panjaraana jerakanna parnasaala melannadi
Ramudunna vanamaina rani vaasamannadi
Anna anukunna adivi antapuramounaa
Aina evaraina idi konagala varamena

Niroopinchu konii nee..preme naa pranamani
Nivedinchu konii nee..premaki naa hrudayani
Ninnu swagatinchu..bigi kougilintanai kaastaa kanchagaa
Nee chelimi nannu..sriraamarakshaga paripaalinchagaa

Prati nimisham saakshigaa..Mana payanam sakshigaa
Nizam cheppanii ninnu..preminchanani
Nizam cheppanii ninnu..poojinchanani
Aakasam sakshiga..Boolokam sakshiga
Nizam cheppani ninnu..preminchanani

:::2

Sapthapadiga sagamani prema naduputunnadata
Eri kori iddarini..endukallu kundata
Ninnu nannu nammukune..premanedi unnadata
Neevu nenu kalavanide..tanaki uniki ledata
Pranayam ika nunchii mana..jatalo batakali
Nityam vikasinche..madhulataga yadagali

Nivedinchukoni nee premaki..naa hrudayani
Niroopinchu koni nee preme..naa pranamani
Nee chelimi nannu srirama..rakshaga paripaalinchga
Ninnu swagadhinchu..bigi kougalinta nai kaasta kanchega

Ravikiranam sakshigaa..tadinayanam sakshigaa
Nizam cheppanii ninnu..poojinchanani
Nizam cheppanii ninnu..preminchanani

No comments: