Sunday, February 15, 2009
నేను మీకు తెలుసా~~2008
సంగీతం::అచ్చు
రచన::సిరివెన్నెల
గానం::శ్రీరాం పార్థసారధి
ఏమైందో గాని చూస్తూ చూస్తూ..చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
ఏం మాయవల వేస్తూ వేస్తూ..ఏ దారి లాగుతుందో తననలా
అదుపులో..ఉండదే..చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ..చూడదే..గాలిలో తేలిపోవడం
అనుమతీ..కోరదే..పడిలేచే పెంకితనం
అడిగినా..చెప్పదే..ఏమిటో అంత అవసరం
ఏం చేయడం..మితి మీరే ఆరాటం
తరుముతూ ఉంది ఎందుకిలా
ఏమైందో గాని చూస్తూ చూస్తూ..చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
తప్పో ఏమో అంటోంది..తప్పదు ఏమో అంటోంది..తడబాటు తేలని నడకా
కోరే తీరం ముందుంది..చేరాలంటే చేరాలి కదా..బెదురుతు నిలబడకా
సంకెళ్ళుగా..సందేహం బిగిశాకా..ప్రయాణం కదలదు గనకా
అలలా అలాగ..మది నుయ్యాల ఊపే భావం ఏమిటో పోల్చుకో త్వరగా
లోలో ఏదో నిప్పుంది..దాంతో ఏదో ఇబ్బంది ..పడతావటే తొలి వయసా
ఇన్నాళ్ళుగా చెప్పంది..నీతో ఏదో చెప్పింది కదా..అది తెలియద మనసా
చన్నీళ్ళతో చల్లారను కాస్తైనా..సంద్రంలో రగిలే జ్వాలా
చినుకంత ముద్దు..తనకందిస్తే చాలు అంతే..అందిగా అందెగా తెలుసా
ఏం మాయవల వేస్తూ వేస్తూ..ఏ దారి లాగుతుందో తననలా
అదుపులో..ఉండదే..చెలరేగే చిలిపితనం
అటూ ఇటూ..చూడదే..గాలిలో తేలిపోవడం
అనుమతీ..కోరదే..పడిలేచే పెంకితనం
అడిగినా..చెప్పదే..ఏమిటో అంత అవసరం
ఏమైందో గాని చూస్తూ చూస్తూ..చేజారి వెళ్ళిపోతోంది మనసెలా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment