Wednesday, February 11, 2009

శశిరేఖా-పరిణయం~~2008



సంగీతం::మణిశర్మ విద్యాసాగర్
రచన::సిరివెన్నెల
గానం::చిత్ర

నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకునీ..కొలువుంచే మంత్రం నీవవనీ


ప్రతీ పూట పువ్వై పుడతా ..నిన్నే చేరి మురిసేలా
ప్రతీ అడుగు కోవెల అవుతా..నువ్వే నెలవు తీరేలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ
నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ


వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు మేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏల వలసిన దొరవూ నువ్వే


రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేధించే శ్యామ సుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా
ఆ..ఆ ..నిన్నే నిన్నే అల్లుకునీ..కుసుమించే గంధం నేనవనీ


ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాశ వీణలోని మధురిమ నీవే సుమా
గంగపొంగు నాపగలిగిన కైలాసమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా

ప్రాయమంత కరిగించీ ధారపోయనా
ఆయువంత వెలిగించీ..హారతీయనా
నిన్నే నిన్నే నిన్నే..ఓ..నిన్నే నిన్నే నిన్నే

No comments: