Wednesday, February 4, 2009
ఆరు~~2005
సంగీతం::దేవిశ్రీ ప్రసాద్
రచన::చంద్రబోస్
గానం::టిప్పు,సుమంగళి
చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
అప్పుడు పంచిన నా మనసే..తప్పని అనవద్దె
ఇప్పుడు పెరిగిన వడ్డితో ఇమ్మని అడగొద్దే...
చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
వద్దు వద్దంటు నేనన్న వయసె గిల్లింది నువ్వెగ
పొ..పొ..పొమ్మంటు నేనున్న,పొగలా అల్లింది నువ్వెగా..
నిదొరోతున్న హృదయాన్ని లాగింది నువ్వెగా
నలుపై ఉన్న రాతిరిలో రంగులు నువ్వెగా.....
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే
నాలో నిలిచే నా ప్రాణం నీలో నిలిపావే..ఏ..
చుడొద్దె నను చుడొద్దె..చుర కత్తిలాగ నను చుడొద్దె
వెళ్ళొద్దె వదిలి వెళ్ళొద్దె..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
వద్దు వద్దంటు నువ్వున్న వలపే పుట్టింది నీపైన
కాదు కాదంటూ నువ్వన్నకడలేపొంగింది నాలోన
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలుచున్న
సుడిగుండాల శృతిలయలో పిలుపే ఇస్తున్నా...
మంటల తగిలిన పుత్తడిలో మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే..ఏ..
చుడొద్దె నను చుడొద్దు..చుర కత్తిలాగ నను చుడొద్దు
వెళ్ళొద్దు వదిలి వెళ్ళొద్దు..మది గూడు దాటి వదిలి వెళ్ళొద్దె
అప్పుడు పంచిన నా మనసే..తప్పని అనలేదే
గుప్పెడు గుండెల చెలి ఊసే ఎప్పుడు నీదేలే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment