Sunday, February 15, 2009
ఒంటరి~~2008
సంగీతం::మణిశర్మ
రచన::రామజోగయ్యశాస్త్రి
గానం::హేమచంద్ర,మాళవిక
అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
తనువంతా పులకిస్తున్నది..చిగురాకై వణికిస్తున్నది
నేనంటే నువ్వంటున్నది..మనసు ఎందుకో మరీ
నీలాగే నాకూ ఉన్నది..ఏదేదో అయిపోతున్నది
నా ప్రాణం నువ్వంటున్నది..మనసు ఎందుకే ప్రియా మరి మరి
అరెరెరె ఏమది..పరిగెడుతుంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
లేత పెదవుల తీపి తడీ..మొదటి ముద్దుకు ఉలికిపడీ మేలుకున్నదీ
ఎడమవైపున గుండెసడీ..ఎదురుగా నీ పిలుపు వినీ వెల్లువైనదీ
తొలి వెన్నెలంటే తెలిపిందీ..నీ జతలో..చెలిమీ
తొలి వేకువంటె తెలిసిందీ..నీ చెయ్యే..తడిమీ
అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
కనులు చూసిన తొలివరమూ..కలలు కోరిన కలవరమూ నిన్నలేదిదీ
చిలిపి సిగ్గుల పరిచయమూ..కొంటె నవ్వుల పరిమళమూ మత్తుగున్నదీ
మన మధ్య వాలి చిరుగాలి..నలిగిందే..పాపం
పరువాల లాలి చెలరేగీ..చెరిగిందే..దూరం
అరెరెరె ఏమది..పరిగెడుతోంది నా మదీ
తెలియని హాయిది..అలజడి రేపుతున్నదీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment