Tuesday, November 1, 2011

7/G బృందావన కాలని


సంగీతం::యువన్‌శంకర్‌రాజా
రచన::


కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు
గమ్యాలు వొంటరిగ పయనం చేయునా
ఇది చేరువ కోరే తరుణం
ఇరు ఎదలలో మెల్లని చలనం
ఇక రాత్రులు ఇంకొక నరకం
వయసులా అతిశయం
ఇది కత్తిన నడిచే పరువమ్
నిత్య కలలతొ తమ తమ రూపం
వెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవునీ రహస్యమూ
లోకం లో తీయని భాష హృదయం లో పలికే భాష
మెల మెల్లగా వినిపించే ఘోషా ఆ ఆఆ
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా

తడి రాని కాళ్లతోటే కడలికేది సంబంధం
నే వేరు నువ్వెరంటే చెలిమికేది అనుబంధం
ఎగరలేని పక్షి కేలా పక్షి అనే ఆ నామం
తెరవలేని మనస్సుకేలా కలలు గనె ఆరాటమ్
ఒంటరి గా పాదాలు ఎమి కోరి సాగినవొ
జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో
తల్లైనా కొన్ని హద్దులు ఉండును
స్నేహంలో అవి ఉండవులే
ఎగరొచ్చీ కొన్ని ఆశలు దూకితే ఆపుట
ఎవరికి సాధ్యములే ఆఆ ఆఅ...ఆఅ
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా

ఏవైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే
ఏకాంతం పూసు కొని సంధ్యావేల పిలిచేనూలే
తెల్లవారు ఝామూలన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి
తనలో తానే మాట్లాడ తోచెనూలే
నడచేటి దారిలో నీ పేరు కనిపించా
గుండెల్లో ఎవో గుసగుసలు వినిపించే
అప్పుడప్పుడు చిరు కోపము రాగ
కరిగేనులే అది మంచులాగా
భూకంపం అది తట్టు కోగలము
మది కంపం అది తట్టుకొలేం ఆ..ఆఅ..ఆఅ..
కలలు గనె కాలాలు కరిగిపోవు సమయాలు
చెరిగిపోనీ ముగ్గే వేయునా ఆ ఆ
చూపు రాయు లేఖలు దిశలు మారు గమ్యాలు
వొంటరిగ పయనం చేయునా

No comments: